Monal Gajjar : మోనల్ గజ్జర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికంటే ముందే తను తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది. అయినప్పటికీ తనకు అంతగా గుర్తింపు రాలేదు. సినిమాలు కొన్ని హిట్టయినా తనకు పేరు రాలేదు. తర్వాత సినిమా అవకాశాలు కూడా రాలేదు. కానీ… ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లో మోనల్ అడుగుపెట్టిందో అప్పుడే తన రేంజ్ మారిపోయింది. బిగ్ బాస్ హౌస్ లో అందరి ఫేవరేట్ కంటెస్టెంట్ అయిపోయింది.

బిగ్ బాస్ తర్వాత తనకు చాలా సినిమా ఆఫర్స్ వచ్చాయి. టీవీ షోలలోనూ తనకు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. స్టార్ మాలోనే డ్యాన్స్ ప్లస్ షోలో జడ్జిగా అవకాశం వచ్చింది. అల్లుడు అదుర్స్ సినిమాలోనూ ఐటెమ్ సాంగ్ చేసింది. ఇంకా వేరే సినిమాల్లోనూ నటిస్తోంది.
Monal Gajjar : డ్యాన్స్ ప్లస్ షోలో సూపర్బ్ డ్యాన్స్
అయితే.. తాజాగా డ్యాన్స్ ప్లస్ షోలో మోనల్ గజ్జర్ వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని… బాహుబలి సినిమాలోని పాటకు డ్యాన్స్ వేసి అదరగొట్టింది. దీవరా సాంగ్ కు ఇద్దరు అమ్మాయిలు డ్యాన్స్ వేయగా… వాళ్లతో పాటు దేవకన్యలా వచ్చి డ్యాన్స్ చేసి అదరగొట్టేసింది మోనల్ గజ్జర్. అసలు… డ్యాన్స్ కంటెస్టెంట్ల కన్నా మోనల్ గజ్జర్ చేసిన డ్యాన్స్ చూస్తే మీ మతి పోతుంది.
ఇంకెందుకు ఆలస్యం… మీరు కూడా మోనల్ గజ్జర్ చేసిన డ్యాన్స్ వీడియోను చూసేయండి.