ట్రెండింగ్ న్యూస్

Monal Gajjar : వామ్మో.. ఏంది మోనల్ గజ్జర్.. డ్యాన్స్ తో అదరగొట్టేశావుపో?

Monal Gajjar : వామ్మో.. ఏంది మోనల్ గజ్జర్.. డ్యాన్స్ తో అదరగొట్టేశావుపో?
Share

Monal Gajjar : మోనల్ గజ్జర్ Monal Gajjar గురించి తెలుసు కదా. బిగ్ బాస్ 4 కంటే ముందు తను తెలుగు సినిమా ఇండస్ట్రీలో 5 సినిమాల్లో హీరోయిన్ గా నటించినా.. తన గురించి ఎవ్వరికీ ఎక్కువగా తెలియలేదు కానీ.. ఎప్పుడైతే తను బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిందో ఇక చూసుకోండి.. తన గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మామూలుగా కాదు.. తను ఇప్పుడు ఎంత బిజీ అంటే.. ఒక స్టార్ హీరోయిన్ కు ఉన్నన్ని ఆఫర్స్ ఇప్పుడు తన చేతుల్లో ఉన్నాయి.

Monal gajjar dance with yash master in dancee plus show
Monal gajjar dance with yash master in dancee plus show

మోనల్ గజ్జర్ తెలుగు ఇండస్ట్రీకి నక్క తోకను తొక్కి వచ్చినట్టుంది. తను నటించిన సినిమాలు హిట్ కాకున్నా.. బిగ్ బాస్ ద్వారా తనకు చాలా ఫేమ్ వచ్చింది. స్టార్ మాలోనే తనకు డ్యాన్స్ ప్లస్ షోలో జడ్జిగా అవకాశం కూడా వచ్చింది. తను మంచి నటి మాత్రమే కాదు.. మంచి డ్యాన్సర్ కూడా. ఆ విషయం.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే ప్రేక్షకులకు తెలిసింది.

Monal Gajjar : డ్యాన్స్ ప్లస్ లేటెస్ట్ ఎపిసోడ్ లో యష్ మాస్టర్ తో డ్యాన్స్ అదరగొట్టిన మోనల్ గజ్జర్

డ్యాన్స్ ప్లస్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఆ ప్రోమోలో యష్ మాస్టర్, మోనల్ గజ్జర్ ఇద్దరూ కలిసి వేసిన డ్యాన్స్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది. మోనల్ మాత్రం డ్యాన్స్ ను ఇరగదీసింది. ఏది ఏమైనా.. మోనల్ కు ఉన్న టాలెంట్ మామూల్ది కాదు. ఎక్కడో గుజరాత్ నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకొని తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నదంటే మామూలు విషయం కాదు.

 


Share

Related posts

Purvabadra Uttaraabadra: పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర,రేవతి నక్షత్ర  నాలుగు  పాదాలు పుట్టిన వారి  లక్షణాలు ఈ విధం గా ఉంటాయి!!

siddhu

బిగ్ బాస్ 4 : ఈ సీజన్ మొత్తం ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయో తెలిస్తే నోరు తెరుస్తారు..! గతంలో కంటే రెట్టింపు

arun kanna

అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటంరెడ్డికి అస్వస్థత

somaraju sharma