Monal Gajjar: బిగ్ బాస్ తర్వాత స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే మోనాల్ గజ్జర్ అడ్రస్ లేదుగా..?

Share

Monal Gajjar: మోనాల్ గజ్జర్..లాస్ట్ ఇయర్ మొత్తం హాట్ టాపిక్ ఆమె గురించే. ఎప్పుడో అల్లరి నరేశ్ నటించిన సుడిగాడు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై అలా అలా పెద్దగా క్రేజ్ లేని సినిమాలు చేసి కనుమరుగైపోయింది. అసలు మోనాల్ గజ్జర్ అనే హీరోయిన్ ఒకరున్నారా అని అందరికీ అనుమానమే. అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి బిగ్ బాస్‌లో అవకాశం ఇచ్చారు. సుడిగాడు తర్వాత మోనాల్ గజ్జర్ తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసింది. వెన్నెల వన్ బై టు, ఒక కాలేజ్ స్టోరి, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి లాంటి సినిమాలు చేసిన మోనాల్ ఎందుకనో పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకోలేకపోయింది.

monal-gajjar-fade-out-from-tollywood
monal-gajjar-fade-out-from-tollywood

మధ్యలో ఒకటి రెండు హిందీ, తమిళ సినిమాలు చేసిన మోనాల్ గజ్జర్ అక్కడ కూడా పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకోలేకపోయింది. ఇలా తెలుగు, హిందీ, తమిళం లాంటి పెద్ద సినిమా ఇండస్ట్రీలలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ మోనాల్ గజ్జర్ ఒక్కచోట కూడా స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది. ఇలా మెయిన్ ఇండస్ట్రీస్ అయిన సౌత్, నార్త్ సినిమా ఇండస్ట్రీస్‌లలోనే మోనాల్ సక్సెస్ కాలేదంటే ఇక ఆమె హీరోయిన్‌గా ఎక్కడా సక్సెస్ కానట్టే అని అనుకున్నారు. కానీ ఆమె మాతృభాష అయిన గుజరాతిలో మాత్రం క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ వచ్చింది.

Monal Gajjar: మోనాల్ తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకుంది.

ఆ సినిమాల వల్లే బిగ్ బాస్ సీజన్ 4లో అవకాశం అందుకుంది మోనాల్. ముఖ్యంగా ఆమెను బిగ్ బాస్‌లో తీసుకోవడానికి కారణం ఆమెతో అందాల ప్రదర్శన చేయించడానికే అని మొదటి రోజు నుంచే అందరికీ అర్థమయింది. గట్టిగా రెండు వారాలు కూడా ఉండేందుకు స్కోప్ లేని మోనాల్ దాదాపు చివరి వరకు నెట్టుకొచ్చిందంటే ఆమె ఇచ్చిన గ్లామర్ ట్రీటే అని అందరికీ తెలిసిందే. లుక్ పరంగా మోనాల్ సూపర్బ్‌గా ఉంటుంది. ఎంత కావాలన్నా ఎక్స్‌ఫోజింగ్ చేయడానికి రెడీ అంటుంది. ఇలాంటి అమ్మాయి ఉంటేనే కదా బిగ్ బాస్ వీక్షకులకి పండుగ. అందుకే ఎన్నిసార్లు ఎలిమినేట్ అవుతుందనుకున్నా షాకిస్తూ షోలో కంటిన్యూ అయింది.

చెప్పాలంటే కొద్దో గొప్పో బిగ్ బాస్ తర్వాత మోనాల్ తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకుంది. దాంతో ఆమెకి వరుసగా సినిమాలలో హీరోయిన్ అవకాశాలు దక్కుతాయని ఆల్రెడీ ఆమెకి హీరోయిన్‌గా కొందరు అవకాశాలు కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారని చెప్పుకున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – నభా నటేశ్ జంటగా నటించిన అల్లుడు అదుర్స్ సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసే అవకాశం కూడా అందుకుంది. ఈ సాంగ్ మోనాల్‌కి బాగానే పేరు తీసుకువచ్చింది. దాంతో మోనాల్ హీరోయిన్ అవకాశాలు కాకపోయినా కనీసం యంగ్ హీరోలతో ఐటెం సాంగ్స్ చేసే అవకాశాలు దక్కించుకుంటుందని అనుకున్నారు.

Monal Gajjar: బిగ్ బాస్‌లో కంటెస్టెంట్ గా వచ్చిన వారి కెరీర్ ఖతం అనే నెగిటివ్ టాక్ ఉంది.

కానీ ఇప్పుడు అమ్మడు తెలుగులో ఎలాంటి అవకాశాలు లేక సొంతూరు వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. తనకున్న క్రేజ్ కారణంగా మాతృభాష గుజరాతిలోనే హీరోయిన్‌గా సినిమాలు కమిటవుతోందట. అయితే తెలుగులో బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ చూపించుకొని హీరోయిన్ అవకాశాలు అందుకునేందుకు మోనాల్ గట్టిగానే ట్రై చేసినట్టు సమాచారం. కానీ ఆమె వేసుకున్న ప్లాన్ అన్నీ తారుమారై తెలుగులో మోనాల్ ఊహించిన అవకాశాలు రావడం లేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అసలే బిగ్ బాస్‌లో కంటెస్టెంట్ గా వచ్చిన వారి కెరీర్ ఖతం అనే నెగిటివ్ టాక్ ఉంది. అదే మోనల్ గజ్జర్ విషయంలో కూడా నిజం అయిందా.


Share

Related posts

మ‌హేష్ అస‌హ‌న‌మా..

Siva Prasad

జగన్ ఫ్యామిలీ లో అతడు కరుడుగట్టిన హిందువు అంటున్న ఉండవల్లి..!!

sekhar

Dry fruits డ్రై ఫ్రూట్స్  తో డార్క్ చాక్‌లెట్ ను  ఇలా తయారు చేసుకోండి!!రుచితో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి!!

Kumar