బిగ్బాస్ అనేది పూర్తిగా మైండ్ గేమ్. ఇక్కడ ఎత్తులకు పై ఎత్తులు, యుక్తులకి కుయుక్తులు వేయకపోతే నిలబడడం కష్టం. ఈ విషయాన్ని మోనాల్ గజ్జర్ చాలా లేటుగా తెలుసుకుంది. ఒకప్పుడు బిగ్ బాస్ షో అంటే అఖిల్-మోనాల్-అభిజిత్ లవ్ ట్రాక్ మాత్రమే చూపిస్తారు అని అనిపించేది. అయితే క్రమంగా ప్రేక్షకుల దానిపై ఆసక్తి తగ్గిపోయింది. మొదట్లో ప్రేమదేశం రేంజ్ ని వీరిని చూపించారు.
మోనాల్ కూడా చక్కగా రెండు పడవలపై ప్రయాణం చేస్తూ ఎలిమినేట్ కావడం తప్పించుకుంటూ వచ్చింది. పగలంతా అఖిల్ తో రాత్రయితే అభిజిత్ తో మోనాల్ ఉండేది అని ఎలిమినేట్ అయిపోయిన వారు బయటకి వచ్చాక చెప్పారు. అయితే మధ్యలో అభిజిత్ కు దూరం అయిపోయింది. నాగార్జునకు మాట మార్చి చెప్పడంతో అతను దూరంగా ఉండి పోయాడు. ఇక ఈ మధ్య కాలంలో అఖిల్ కు బాగా దగ్గర అయినా చివరికి అతనిని కూడా దూరం చేసుకుంది.
అన్నీ ఆమె చేసుకున్న స్వయంకృతాపారాధాలే కావడం విశేషం. సోహెల్ గురించి అఖిల్ కి లేనివి చెప్పడంతో నాగార్జున వీడియో చూపించి ఆమె ను భారీగా బుక్ చేశాడు. దీంతో అఖిల్ మోనాల్ ను నామినేట్ చేసే వరకు వెళ్ళాడు. మొత్తానికి ఎవరూ లేకుండా ఒంటరి అయ్యానని రాజశేఖర్ తో చెప్పుకుంటూ వాపోయింది. రాజశేఖర్ నీకు అండగా ఉంటామని ప్రామిస్ చేసి గ్యాంగ్ తో పాటే ఉంటున్నాడు.
ప్రస్తుతం అఖిల్, లాస్య, అభిజిత్, హారిక లు కలిసి ఉంటున్నారు. మరొకవైపు అవినాష్, మెహబూబ్, అరియానా రాజశేఖర్ గ్రూప్ ఉంటుంది. అవినాశ్ మోనాల్ తో ఏదో జోక్ గా ఏదో టైం పాస్ చేస్తాడు అంతే కాని ఆమెతో సీరియస్గా ఇంటిలో ఫ్రెండ్షిప్ చేసేవారే కరువయ్యారు. ఒకప్పుడు ఇంటిలో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా కనిపించిన మోనాల్ ఇప్పుడు ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయింది పాపం..!