మోనల్ గజ్జర్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పేరే మారుమోగిపోతోంది. ఫైనలిస్టుగా కాకుండా చివరి ఆరో కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయిపోయి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేసింది మోనల్. నిజానికి మోనల్ కు చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. తాను సేవ్ అవుతానని అనుకుంది కానీ.. ప్రేక్షకులు మాత్రం ఆమెను టాప్ 5 లో వద్దనుకున్నారు. అందుకే 14వ వారంలోనే ఎలిమినేట్ చేసేశారు.

అయితే.. మోనల్ ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ దత్తపుత్రికను ఎందుకు ఎలిమినేట్ చేశారు? ఇక నుంచి బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ షో ఉండదా? ఇక నేను బిగ్ బాస్ చూడను… అయ్యో పాపం.. అఖిల్ పరిస్థితి ఏంటి ఇప్పుడు.. ఒక్కడే మరో వారం రోజులు ఎలా ఉంటాడు.. ఇదిగో.. ఇలా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సరే… అదంతా పక్కన పెట్టేద్దాం.. అసలు మ్యాటర్ లోకి వద్దాం. మోనల్ ఎలిమినేట్ అయి బయటికి రాగానే బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఈసందర్భంగా తను షాకింగ్ విషయాలు బయటపెట్టింది.
అయితే.. అందరూ ఊహించినట్టుగానే రాహుల్ ముందుగా మోనల్ ను A.. అంటే ఎవరు.. అంటూ అడిగాడు. దీంతో A అంటే అఖిల్ కాదు.. అభిజీత్ కాదు.. అంటూ సిగ్గుపడింది మోనల్. మరి.. A అంటే యాపిలా అంటూ సెటైర్ వేశాడు రాహుల్. అయితే.. ప్రోమోలో మాత్రం మోనల్.. A.. అంటే ఎవరి గురించి చెప్పిందో చూపించలేదు. కానీ.. మొత్తానికి మోనల్ మాత్రం ఈ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్ లో జరిగిన ఎన్నో షాకింగ్ విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. దానికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి.