మోనాల్ గజ్జర్ కు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి చాలా బిజీ అయిపోయిందని చెప్పాలి. విశ్లేషకులు మాత్రం బిగ్ బాస్ హౌస్ లో అందరి గేమ్ స్ట్రాటజీ ఒక ఎత్తైతే మోనాల్ గేమ్ స్ట్రాటజీ మాత్రమే ఇంకొక ఎత్తు అంటున్నారు. సాధారణంగా అందరూ టాస్కుల మీద ఫోకస్ చేస్తుంటే మోనాల్ మాత్రం టాస్కులు మాత్రమే గేమ్ కాదు ఈ హౌస్ లో ఎలా ఉంటున్నాము అన్నది కూడా గేమ్ లో భాగమే అంటూ ఒకానొక నామినేషన్స్ లో భాగంగా చెప్పుకొచ్చింది. అదేవిధంగా తన గేమ్ స్ట్రాటజీ ని కూడా ఆచరణలో పెట్టింది.
చివరి వరకు బిగ్ బాస్ గేమ్ పై తన ఫోకస్ ని అలాగే మెయింటెయిన్ చేయగలిగింది. బిగ్ బాస్ షోకు ఫుటేజ్ ను బాగా ఇచ్చి ఫుటేజ్ క్వీన్ గా పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందే తన బయటికి వచ్చేసరికి ఆఫర్స్ వెల్లువలా రావాలి అనుకున్నదట ఈ గుజరాతీ భామ. హౌస్ నుంచి రాగానే తాను అనుకున్నట్టుగానే ఆఫర్లను సాధించింది. ప్రస్తుతం ఈ గుజరాతి ముద్దుగుమ్మ తన మకాం ను గుజరాత్ నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ చేస్తే బావుంటుందని అనుకుంటోంది. ఇక ఈ నేపథ్యంలో మోనాల్ గజ్జర్ హైదరాబాద్ లో ఇంటినికొనుగోలు చేసే ఆలోచనలో ఉంది.
ప్రస్తుతానికి, మోనాల్ గజ్జర్ హైదరాబాద్ లో ఇల్లు కొన్న తరువాతే మెల్లమెల్లగా తన ప్రాజెక్ట్స్ కి సంబంధించిన వివరాలను తన అభిమానులకు తెలియచేసి సర్ప్రైజ్ చేసే ఆలోచనలో ఉంది ఈ గుజరాతీ ముద్దుగుమ్మ.