ఏంటి.. మోనల్ ఎలిమినేట్ అయింది కదా.. మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చింది.. ఇంకో మూడు రోజులు అయితే షోనే అయిపోతుంది.. అని అంటారా? అవును.. ఇంకో మూడు రోజుల్లో షో అయిపోతుంది కాబట్టే.. మళ్లీ ఎలిమినేట్ అయిన అందరు ఇంటి సభ్యులు ఓసారి బిగ్ బాస్ హౌస్ ను చూడటానికి వచ్చారు. అందరి కంటే ముందుగా మోనల్ ను బిగ్ బాస్ ఇంట్లోకి పంపించాడు. అయితే.. ప్రస్తుతం కరోనా కాలం కదా..అందుకే ఇంట్లో ఓ గ్లాస్ గోడ కట్టి.. ఆ గ్లాస్ గోడ నుంచే మాట్లాడుకోవడం అన్నమాట.

మోనల్ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టగానే.. అఖిల్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వెంటనే వెళ్లి మోనల్ ను హత్తుకున్నాడు అఖిల్. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. ఆ తర్వాత కరాటే కళ్యాణి, లాస్య వచ్చారు. వాళ్లతో ఫన్ అయిపోయాక.. గంగవ్వ, జోర్దార్ సుజాత, నోయల్, అవినాష్ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టారు.
మిగిలిన వాళ్లు రేపటి ఎపిసోడ్ లో కనపిస్తారు కావచ్చు. ప్రస్తుతానికైతే వీళ్లంతా కలిసి బిగ్ బాస్ హౌస్ లో చేసిన హడావుడి మాత్రం మామూలుగా లేదు.
దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. బిగ్ బాస్ సీజన్ దగ్గరపడుతున్నా కొద్దీ.. ప్రేక్షకుల్లో టెన్షన్ ను పెంచుతోంది. ఇంకో రెండు రోజులు ఆగితే.. షో విన్నర్ ఎవరో తెలియనుంది.