స్టార్ మా లో ప్రసారమయ్యే బిగ్బాస్ షో లోని సీజన్ 4 లో చివరి దశ వరకు చేరుకొని 6వ ప్లేస్ తో సరిపెట్టుకున్న హీరోయిన్ మోనాల్ గజ్జర్ ఇటీవల హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు. ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారం అవుతున్న డాన్స్ ప్లస్ అనే డాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ప్రతి చిన్న విషయానికి ఏడ్చేసిన మోనాల్ గజ్జర్ బయటికి వచ్చిన తర్వాత ఎన్నో అవకాశాలను అందుకుంటున్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తూ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న అల్లుడు అదుర్స్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించడానికి ఆమెకు అవకాశం వచ్చిందట. ఈ సాంగ్ కి గాను ఆమె అక్షరాలా 15 లక్షల రూపాయలనురెమ్యూనరేషన్ గా అడుగుతున్నారట. ఈ సినిమాలో కేవలం మూడు నిమిషాలు డాన్స్ చేసినందుకు ఆమె 15 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని ప్రస్తుతం సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జోరుగా సాగుతోంది.
స్టార్ మా లో ఆమె ఓంకార్ డాన్స్ ప్లస్ షో కి జడ్జి గా వ్యవహరిస్తున్నందుకు గాను ఆమె రోజుకి 50 వేల రూపాయలు తీసుకుంటున్నారట. ఈ గుజరాతి ముద్దుగుమ్మ సుడిగాడు సినిమాతో తెరంగేట్రం చేసి బ్రదర్ అఫ్ బొమ్మాలి వంటి చిన్న చిన్న సినిమాలలో నటించి ఆ తర్వాత కనుమరుగయ్యింది. చాలా గ్యాప్ తరువాత మళ్లీ బిగ్బాస్ షో తో తెరమీదకు వచ్చి అనేక సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.
అయితే ఈమెకు జీ 5 OTT లో ప్రసారం కానున్న కాగజ్ సినిమాలో కూడా నటించేందుకు అవకాశం వచ్చిందట. బిగ్ బాస్ లో వచ్చిన ఫేమ్ తో ఈమె కు పలు వెబ్ సిరీస్ లు మరియు సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఛాన్సులు ఎక్కువ రావడంతో ఆమె తన పారితోషికం కూడా ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది.