NewsOrbit
న్యూస్ సినిమా

Monal gajjar : మోనాల్ గజ్జర్ కి హిట్ ఇచ్చిన సల్మాన్ ఖాన్…ఇక బాలీవుడ్ లో సెటిల్ అయినట్టే ..!

Monal gajjar : మోనాల్ గజ్జర్ కి బిగ్ బాస్ 4 తర్వాత విపరీతంగా క్రేజ్ వచ్చేసింది. బిగ్ బాస్ కి రాకముందు మాతృభాషలో సినిమాలు చేసుకుంటున్న మోనాల్ గజ్జర్ కి బిగ్ బాస్ 4 లో పాల్గొనే అవకాశం వచ్చింది. అంతకముందు టాలీవుడ్ లో రెండు మూడు సినిమాలు చేసి తట్టా బుట్టా సర్దేసుకుంది. ఆ పేరు చెప్పినా ఎవరు అని ఆలోచించేంత దూరంలో ఉన్న మోనాల్ కి బిగ్ బాస్ బిగ్ కెరీర్ ని ఇచ్చింది. హాట్ హాట్ అందాలతో హూజ్ లో హంగామా చేసిన మోనాల్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిపోయింది. దాంతో టాలీవుడ్ మేకర్స్ మోనాల్ గజ్జర్ కి అవకాశాలివ్వడానికి రెడీ అయిపోయారు.

Monal gajjar: salman khan gave a hit to Monal gajjar...by this she will be settled in bollywood..!
Monal gajjar salman khan gave a hit to Monal gajjarby this she will be settled in bollywood

ఇప్పటికే అల్లుడు అదుర్స్ సినిమాలో ‘రంభ ఊర్వశి మేనకా..’ అంటూ ఐటమ్ సాంగ్ లో స్టెప్పులేసి ఒక ఊపు ఊపుంది. ఈ సాంగ్ అమ్మడికి బాగానే పేరు తెచ్చింది. బొద్దుగా ఉన్న మోనాల్ డాన్స్ తో యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఈ సాంగ్ చూశాక తమిళ సినిమాలలో అవకాశాలు వస్తాయన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే కోలీవుడ్ జనాలకి ఎర్రగా బుర్రగా బొద్దుగా ఉంటేనే నచ్చుతారు. ఆ రకంగా మోనాల్ కి కోలీవుడ్ లో ఆఫర్స్ వస్తాయని చెప్పుకుంటున్నారు. తెలుగులో కూడా రెండు – మూడు సినిమాలలో నటించేందుకు సైన్ చేసిందని వార్తలు వస్తున్నాయి.

Monal gajjar : మోనాల్ గజ్జర్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ మీద గట్టిగా ఫోకస్ పెడుతున్నట్టు చెబుతోంది.

అయితే ఈ లోపు బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకొని అక్కడా హాట్ టాపిక్ అయింది ఈ బొద్దుగుమ్మ. రీసెంట్ గా మోనాల్ గజ్జర్ నటించిన బాలీవుడ్ సినిమా కాగజ్.. జీ5 లో విడుదలై పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది. అంతేకాదు బాలీవుడ్ లో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. కాగజ్ సినిమాను కండలవీరుడు సల్మాన్ ఖాన్ నిర్మించడం విశేషం. కాగా బాలీవుడ్ నటుడు దర్శకుడు సతీష్ కౌశిక్ కాగజ్ కి దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ క్రేజీ స్టార్ పంకజ్ త్రిపాఠీతో మోనాల్ గజ్జర్ నటించి పేరు తెచ్చుకుంది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ నుంచి మోనాల్ గజ్జర్ కి మంచి అవకాశాలు వస్తున్నట్టు సమాచారం. మోనాల్ గజ్జర్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ మీద గట్టిగా ఫోకస్ పెడుతున్నట్టు చెబుతోంది.

 

 

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

bharani jella

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju