న్యూస్ సినిమా

హారిక విషయం లో అభిజిత్ కి అనుకోని షాక్ ఇచ్చిన మోనాల్!!

హారిక విషయం లో అభిజిత్ కి అనుకోని షాక్ ఇచ్చిన మోనాల్!!
Share

స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యిన బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ హౌస్ నుంచి బయటకు వచ్చాక తనకు ఉన్న క్రేజ్ ను సరిగ్గా సద్వినియోగపరచుకుంటోంది అని చెప్పాలి. “అల్లుడు అదుర్స్” సినిమా ద్వారా ఐటెం సాంగ్స్ కు కూడా తాను సిద్ధమేనంటూ హింట్ ఇచ్చింది. ప్రస్తుతం మోనాల్ ‘డాన్స్ ప్లస్’ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తూ ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. మోనాల్ కు ఇకమీదట తన పాత్రలకు తానే దుబ్బింగ్ చెప్పుకుంటా అని కూడా చెప్తోంది

అయితే తాజాగా మోనాల్ బిగ్ బాస్ సీసన్ 4 విన్నర్ అభిజిత్ అలాగే హారిక ఫ్రెండ్ షిప్ గురించి విశ్లేషిస్తూ ఆడియెన్స్ కు గట్టి షాకిచ్చింది. అప్పటిలో అభిజిత్ మరియు హారిక ఫ్రెండ్షిప్ బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులను అలరించింది. ఇది చుసిన వీరి అభిమానులు ఈ కాంబినేషన్ కు “అభిక” అని పేరు కూడా పెట్టారు. అయితే, అభిజిత్ మాత్రం హౌస్ నుంచి బయటికి వచ్చాక ‘హారిక నాకు సిస్టర్ లాంటిది” అని క్లారిటీ ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో ఇదే విషయం గురించి మోనాల్ ను అడగగా వారిద్దరి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ తనకెప్పుడూ కనిపించలేదని చెప్పుకొచ్చింది ఈ గుజరాతి ముద్దుగుమ్మ. ఈ సందర్భంలో ఒక అమ్మాయిగా ఇంకొక అమ్మాయిలోని ఫీలింగ్స్ ను తాను ఇట్టే అర్థం చేసుకోగలనని చెప్తూ హారికకు అభిజిత్ అంటే ఇష్టం అన్న విషయాన్ని తానే స్వయంగా అభిజిత్ కు ఒకానొక సమయంలో చెప్పానని గుర్తుచేసుకుంది మోనాల్. ఇంతకీ ఈ విషయమై అభిజీత్ ఎలా స్పందిస్తాడో చూడాలి.


Share

Related posts

‘ఆచార్య’ షూటింగ్ లో భాగంగా ‘ఫైట్’ చెయ్యడానికి చిరంజీవి వెనుకంజ వేసారట!!

Naina

Kota Srinivas Rao: ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్ ఉన్న హీరో అతనే అంటూ కోట సెన్సేషనల్ కామెంట్స్..!!

sekhar

ఏలూరు మిస్టరీ తేలేది ఎప్పుడు? రేపు జగన్ పర్యటన వైద్యుల నిర్లక్ష్యాన్ని ప్రస్తావిస్తార??

Special Bureau
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar