ట్రెండింగ్ న్యూస్ సినిమా

యశ్ బ్యాక్ పై కొడితే…. మోనాల్ మాత్రం వెళ్ళి కౌగిలించుకుంది..!

Share

బిగ్బాస్ తెలుగు నాలుగో సీజన్ లో కంటెస్టెంట్ లకు భారీ క్రేజ్ వచ్చేసింది. మొదట్లో అభిమానులు వీరి పేర్లు చూసి బాగా నిరాశ పడ్డారు. అయితే షో మొదలైన తర్వాత వారి ఆట తీరు, స్వభావాలతో షో రేటింగ్ స్థాయిని పెంచేశారు. ఇక ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో స్పెషల్ గా పెట్టుకున్న గుజరాతి బ్యూటీ మోనాల్ గజ్జర్ ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత బుల్లితెరపై అనేక ఆఫర్లు అందుకని రచ్చ మొదలుపెట్టేసింది.

 

అసలు మోనాల్ ఇంటిలో ఎక్కువ రోజులు ఉంటుందని ఎవరూ ఊహించలేదు. వచ్చిన మొదటి నుండి ఏడుస్తూ సరిగ్గా టాస్క్ లు ఆడకుండా దాదాపు చివరి వారం వరకు కొనసాగడం గమనార్హం. ఇప్పుడు బయటికి వచ్చిన ఆమె రియాలిటీ షో లతో బిజీ అయిపోయింది. ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న డాన్స్ ప్లస్ షో కి స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది. ఎంతో మంది సీనియర్ డాన్స్ మాస్టర్ ల మధ్య ఆమెకు స్థానం కల్పించారు.

ఇక రంగంలోకి దిగిన మోనాల్ బిగ్ బాస్ లో చేసిన రొమాన్స్ ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తోంది. శనివారం ఎపిసోడ్ లో జడ్జ్ లు అందరూ మాస్టర్ యశ్ బ్యాక్ ను కర్రతో కొట్టేశారు. ఇక వెంటనే మొనాల్ తనలోని రొమాంటిక్ యాంగిల్ బయట పెట్టింది. ఇక్కడ కూడా అతనిని కౌగలించుకొని సందడి చేసింది. మాస్టర్ ను అందరూ ఇబ్బంది పెడుతుంటే ఈమె మాత్రం వెళ్ళి కొట్టకుండా హగ్ చేసుకోవడం వైరల్ అయిపోయింది. ఇక మున్ముందు ఈమె యశ్ తో ఎలాంటి సీన్లు చేస్తుందో అని అందరూ ఆసక్తిగా ఉన్నారు.


Share

Related posts

మ‌రో హీరోయిన్ కూడా ఓకే…

Siva Prasad

‘సల్మాన్ ఖాన్’కి ఈ జన్మలో పెళ్లి కాదంటున్న పండితుడు.. కారణం అదేనట!

Teja

Tarun Tejpal Case: ఆ కేసు విషయంలో కీలక నిర్ణయాన్ని ప్రకటించిన గోవా సీఎం ప్రమోద్ సావంత్  

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar