Monal : బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో హాట్ కంటెస్టెంట్ గా మాత్రమే కాకుండా అందాల ఆరబోతలో సీజన్ మొత్తానికి హైలెట్ గా నిలిచి బిగ్ బాస్ ఆడియన్స్ ని మోనాల్ Monal అలరించింది. సరిగ్గా టాప్ ఫైవ్ లోకి వెళ్ళకు ముందు వారం ఇంటి నుండి మోనాల్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. వాస్తవానికి మొదటిలోనే మోనాల్ వ్యవహరించిన తీరుకు హౌస్ నుండి ఎలిమినేట్ అవటం గ్యారెంటీ అని అందరూ భావించారు. కానీ హౌస్ లో అభితో పాటు అఖిల్ తో చాలా క్లోజ్ గా ఉండటంతో ట్రయాంగిల్ లవ్ స్టోరీ తరహాలో హౌస్ లో వాతావరణం క్రియేట్ అవటం తో మోనాల్ బిగ్ బాస్ ఫోర్ లో హైలెట్ గా నిలిచింది.
చాలామంది ఆడియన్స్ మోనాల్ అదేవిధంగా అభిజిత్ అఖిల్ మధ్య ఏదో జరుగుతోంది అనే ఇంటెన్షన్ తో షో చూసేవాళ్ళు. దీంతో టిఆర్పి రేటింగ్ కూడా భారీ స్థాయిలో వచ్చేవి. షో కి సంబంధించి చాలా ప్రోమోలలో ఈ ముగ్గురి కి సంబంధించిన విషయాలు వేసేవాళ్ళు. షో మొత్తాన్ని రక్తి కట్టించిన మోనాల్ ప్రస్తుతం హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత మంచి క్రేజ్ సంపాదించడంతో సినిమా ఇండస్ట్రీలో అనేక అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన “అల్లుడు అదుర్స్” సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం భారీ స్థాయిలో మోనాల్ రెమ్యునరేషన్ దక్కించుకున్నట్లు వార్తలు రావడంమనకందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా మోనాల్ ఇండస్ట్రీలో బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లు సరికొత్త టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది. ఈ వార్త విని బిగ్ బాస్ కంటెస్టెంట్ లు, ఇంకా చాలామంది ఈ దెబ్బతో మోనాల్ కి ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ రావడం గ్యారెంటీ అని అంటున్నారట. విషయమేమిటంటే మైత్రి మూవీ మేకర్స్ 14రీల్స్ ప్లస్ పతాకాలపై పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న “సర్కారు వారి పాట” సినిమాలో పక్కా మాస్ స్పెషల్ సాంగ్ కోసం మోనాల్ ని సినిమా యూనిట్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ షో తో ఈ ముద్దుగుమ్మ కి మంచి క్రేజ్ ఉండటంతో సినిమా యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?