తెలుగు ఇండస్ట్రీకి చాలా ఏళ్ల క్రితమే పరిచయమైనా monal gajjar నాలుగైదు సినిమాలు చేసిన తర్వాత టాలీవుడ్ కు దూరం అయిపోయింది. అయితే ఎవరూ ఊహించని రీతిలో బిగ్బాస్లో మెరిసింది. గ్లామర్ షో లవ్ ట్రాక్ లతో విపరీతమైన క్రేజ్ అందుకుంది. అలాగే షోలో అనుకున్న సమయం కన్నా ఎక్కువ వారాలే కొనసాగి విమర్శలు కూడా మూటకట్టుకుంది.
ఇదే సమయంలో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో అఖిల్ తో లవ్ అనే ప్రస్తావన వచ్చినప్పుడు తన అసలు లవర్ అని కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం తెలుగులో మోనాల్ తన హవా చూపిస్తోంది. అల్లుడు అదుర్స్ సినిమాలో ఇప్పటికే ఐటమ్ సాంగ్ చేసింది. ఓంకార్ నిర్వహిస్తున్న డాన్స్ ప్లస్ షో లో కూడా జడ్జిగా వ్యవహరిస్తోంది. అలాగే మరికొన్ని చిత్రాల్లో కూడా ఆఫర్లు వచ్చాయి. లైవ్ చాట్ లు, ఇంటర్వ్యూ లు అని బిజీబిజీగా గడుపుతోంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో అఖిల్ తో తన బంధం పై క్లారిటీ ఇచ్చింది. మోనాల్ మాట్లాడుతూ నేను ఎక్కడికి వెళ్ళినా తెలుగువారంతా నన్ను గుర్తు పడుతున్నారు. అఖిల్ గురించి అడుగుతున్నారు. వాస్తవానికి అందరూ అనుకున్నట్లు మా మధ్య ఏమీ లేదు. అతడు నా స్నేహితుడు మాత్రమే… మేము ఎప్పటికీ అలాగే ఉంటామని చెప్పింది.
అలాగే తన మాజీ లవర్ గురించి వివరిస్తూ నేను సౌత్ ఇండియా కి చెందిన ఆర్యన్ అనే వ్యక్తితో నాలుగేళ్లపాటు ప్రేమ లో ఉన్నాను. తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయాం. అందుకే తెలుగు సినిమాలతో పాటు దక్షిణాదికి కూడా దూరం అయిపోయాను అని చెప్పింది. ఇక ఈ గ్యాప్ లొ గుజరాతీ సినిమాలు చేశాను…. ఇప్పుడు ఇలా మళ్ళీ మీ ముందుకు వచ్చాను అని వివరణ ఇచ్చింది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!