NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : మోనాల్ చెల్లి మాటల వెనుక ఉన్న ప్లాన్ చూడండి….

ఇంటిలోకి కంటెస్టెంట్ ల కుటుంబ సభ్యుల రాకతో బిగ్ బాస్ హౌస్ లో ఇంతకుముందెన్నడూ లేని ఎమోషన్స్ కనిపించాయి. అలాగే వచ్చిన పేరెంట్స్ కూడా ఇంటి సభ్యులందరినీ బాగా పలకరించారు. వారి మధ్య ఉన్న గొడవలను స్పోర్టివ్ గా తీసుకుని గేమ్ బాగా ఆడండి అంటూ సపోర్ట్ చేశారు. ఇక గురువారం మోనాల్ సోదరి హిమాలి ఇచ్చిన రెస్పాన్స్ కు అందరూ షాక్ అయిపోయారు అనే చెప్పాలి. ముఖ్యంగా అభి మాత్రం బాగా హర్ట్ అయ్యాడు.

 

ఇక హిమాలి మాట్లాడిన మాటలు చూస్తుంటే బిగ్బాస్ నిర్వాహకులు ఏదో ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే ఈసారి వచ్చిన కంటెస్టెంట్ లు పెద్దగా పేరు మోసిన వారు కారు. క్రితం సీజన్లో తో పోలిస్తే వీరికి ఉన్న పాపులారిటీ తక్కువ. అయితే మోనాల్ గజ్జర్ ఇంట్లోకి అందాలభామ జాబితాలో వచ్చింది. మిగతా వారితో పోలిస్తే అందం విషయంలోనూ లవ్ ట్రాక్ విషయంలోనూ ఆమె అందరినీ బీట్ చేసింది. అయితే టాస్క్ మాత్రం సరిగ్గా చేయదని విమర్శలు ఉన్నాయి.

ఇక మోనాల్ కు ఈ వారం చివరి అవకాశం అని అందరూ భావిస్తున్నారు. ఇదే సమయంలో మొనాల్ సోదరి రావడంతో… ఆమె బాగా ఏడ్చేసింది. ఏ కంటెస్టెంట్ కూడా తమ కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు అంతగా ఏడవలేదు. వచ్చిన కొద్ది సేపు అందరికీ కూల్ గానే పలకరించిన హిమాలి తర్వాత అసలైన పర్ఫార్మెన్స్ మొదలు పెట్టింది.

అభిజిత్ విషయంలో ఆమె అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడు వెనక ఒకటి ముందు ఒకటి మాట్లాడు అని చెప్పడంతో అభి సైలెంట్ అయ్యాడు. గెస్ట్ కాబట్టి ఏమీ అనకుండా సైలెంట్ గా ఉన్నాడు అని అర్థమైంది. అలాగే అందుకు హారిక కూడా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇక హిమాలి వెళ్లిపోయిన తర్వాత హారిక అభి కి సపోర్ట్ చేస్తూ అరియానాకు వివరణ ఇచ్చింది.

మొత్తానికి ఈ వారం మోనాల్ కు ఎక్కువగా కవరింగ్ ఇవ్వడం లోపలికి వచ్చిన ఆమె చెల్లి కంటెస్టెంట్స్ తో నెగెటివ్ గా మాట్లాడటం చూస్తుంటే మోనాల్ ను ఎలిమినేషన్ నుండి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం మరి….

author avatar
arun kanna

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N