నాలుగో సీజన్ బిగ్ బాస్ హౌస్ లో అందాల ఆరబోతలో కుర్రకారును వేడెక్కించింది మోనాల్. అఖిల్ మరియు అభిజిత్ తో క్లోజ్ గా ఉంటూ ఇంటిలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్న తరహాలో సిచువేషన్ క్రియేట్ చేసి షో పై ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ కలిగించే రీతిలో మోనాల్ స్టార్టింగ్ లో వ్యవహరించింది. అంత మాత్రమే కాక ప్రారంభంలో ప్రతి చిన్నదానికి ఏడుస్తూ ఎమోషనల్ అయినా మోనాల్ ఉన్న కొద్దీ హౌస్లో రాటుతేలి మంచి గేమ్ ప్లే చేసింది.
సరిగ్గా టాప్ ఫైవ్ లోకి వెళ్ళకు ముందు వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యింది. అయితే ప్రస్తుతం బయట సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కోసం ఎదురు చూస్తున్న మోనాల్ కి “స్టార్ మా” నుండి అదిరిపోయే ఛాన్స్ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే “స్టార్ మా” ఛానల్ నిర్వహించే ‘డ్యాన్స్ ప్లస్’ అనే షోకి మోనాల్ ని హోస్ట్ గా తీసుకుంది.
ఇదే విషయాన్ని మోనాల్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇదిలా ఉండగా ఇటీవల హౌస్ నుండి బయటకు వచ్చిన మోనాల్ త్వరలోనే సొంత రాష్ట్రం గుజరాత్ నుండి కుటుంబ సమేతంగా హైదరాబాద్ సిటీకి షిఫ్ట్ అవుతున్నట్లు తెలియజేయటం అందరికీ తెలిసిందే. ఒక పక్క సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు బాగా వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోనాల్ ఓ చానల్ ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే సినిమా అవకాశాల్లో కంటే ముందు టెలివిజన్ రంగంలో మోనాల్ కి ఛాన్స్ రావడంతో త్వరలోనే మొత్తం ఫ్యామిలీ అంతా హైదరాబాద్ తీసుకొచ్చి చేయడానికి ఆమె మరింతగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.