Ali: ఓ నిరుపేద కుటుంబం నుంచి వచ్చి తెలుగు సినీ ఇండస్ట్రీ లో టాప్ కమెడియన్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు అలీ Ali. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల మన్నన పొంది తెలుగు లోనే టాప్ కమెడియన్ అయ్యారు అలీ. తాను ఇపుడు స్టార్ కమెడియన్ అయినప్పటికీ తాను ఒక పేద కుంటుంబ నుంచి వచ్చానని అలాగే తన తండ్రి ఓ దర్జీ అని అలీ ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూ లలో చెప్పారు. అసలు అలీ సినీ పరిశ్రమలోకి రాకముందు ఏమి చేసేవారో తెలుసా?
ఓ రోజు ఒక ఆర్కెస్టా నడిపే వ్యక్తి రోడ్ మీద వెళ్తూ ఉండగా ఆ పక్కన లుంగీలు, లంగాలు, గౌన్స్ అమ్ముతూ ఓ పిల్లవాడు కనిపించాడు. ఆ పిల్లాడితో మాటలాడాక అతని చురుకుదనానికి మెచ్చి అతని వెంట ఆ పిల్లాడిని కూడా తీసుకుని మోహన్ మిత్ర తన ఆర్కెస్టా దగ్గరికి తీసుకెళ్లి నీకు ఎం వచ్చో చేసి చూపించు అనగానే తనకి వచ్చిన డైలాగ్లు, డాన్సులు, కామెడీ చేసి చూపించాడు.
ఇదే సమయంలో కళాతపస్వి కే విశ్వనాధ్ గారు మోహన్ మిత్రా ని కలిసినప్పుడు తన సినిమాలోకి గాను ఓ పిల్లవాడు కావలి అని చెప్పగా అలీ ని మోహన్ మిత్ర విశ్వనాథ్ గారికి పరిచయం చేశారు. అలీ చురుకుదనాన్ని చుసిన ఆయన ఎంతో సంతోషించి ఆయన తెరకెక్కిస్తున్న ప్రెసిడెంట్ పేరమ్మ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ను అలికి ఇచ్చారట. ఇంక అప్పటి నుంచి అలీ తన జీవితంలో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు అనే చెప్పాలి.