Moringa: ఆరోగ్యానికి పర్మినెంట్ అడ్రస్ ఈ ఆకు..!! 

Share

Moringa: మునక్కాయలు నిత్యం మనం కూరగా తీసుకుంటూనే ఉంటాం.. మునగ కాయలే కాకుండా మునగ ఆకుల వలన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది.. మునగాకులో విటమిన్ ఎ, సి సమృద్ధిగా ఉన్నాయి.. మనం డబ్బులు వెచ్చించి కొనుక్కుని తినే ఏ ఆకుకూరల్లో లభించని విటమిన్లు మునగ ఆకులలో ఉన్నాయి. ఇందులో క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్ అధికంగా ఉన్నాయి. ఆయుర్వేదంలో మునగాకు ద్వారా 300కు పైగా వ్యాధులను నయం చేయవచ్చు. మునగాకు మిరాకిల్ హెర్బ్..!! దీనిని సూపర్ ఫుడ్ గా ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు..!! మునగాకును పౌడర్ గా చేసి టీ, కాఫీ లు చేస్తున్నారు.. మునగాకు టీ వలన సులువుగా బరువు తగ్గుతారు.. మునగ ఆకు కాయలు బెరడు పువ్వులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు..!! దీనిని ఖచ్చితంగా తింటారు.. ఈ ఆకు వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..!!

Moringa Leaves tea health benefits
Moringa Leaves tea health benefits

Moringa: మునగాకు టీ తాగుదామా..!!

మునగాకు లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి.. క్యారెట్లు తింటే వచ్చే విటమిన్ లకు ఎనిమిది రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందవచ్చు.. పాల నుంచి లభించే కాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి లభిస్తుంది. పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8 రెట్లు ఎక్కువగా మునగాకు నుంచి పొందవచ్చు. అరటిపళ్ళ నుంచి పొందే పొటాషియం 15 రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి లభిస్తుంది. అందుకే ఈ ఆకులను మిరాకిల్ హెర్బ్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఈ ఆకులతో తయారు చేసుకున్న టీ రుచికరంగా నే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా తీసుకు వస్తుంది. మొరింగా టీ బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. కొవ్వు నిల్వ లను కలిగిస్తుంది. ఈ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి ఇవి ఎక్కువగా పాలీఫెనాల్స్ మొక్కల సమ్మేళనాలు.. ఈ ఆకులను ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తక్కువ కొవ్వు, అధిక పోషక విలువలు అందిస్తాయి. దీని కారణంగా త్వరగా బరువు తగ్గుతారు. టి ప్రియులు ఈపాటికే ఏదేని ట్రై చేసి ఉంటారు. మీరు కూడా మునగాకు పొడి తో టి తయారు చేసుకుని తాగండి. దీని రుచి ఒక్కసారి తెలిస్తే అసలు వదిలిపెట్టరు. రుచి కి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈ టీ ని రుచి చూసేయండి..

Moringa Leaves tea health benefits
Moringa Leaves tea health benefits

Moringa: మునగాకు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!

మునగాకు చర్మ సౌందర్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. మునగాకు రసాన్ని తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాస్తే మిలమిల మెరిసే మోము మీ సొంతం అవుతుంది. ముఖం పై ఉన్న టాన్ తొలగిపోతుంది. చర్మంపై ఉన్న మొటిమల తాలూకు మచ్చలు, నల్లటి మచ్చలు తొలగిపోయి మీ ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది.. పాలిచ్చే తల్లులకు మునగాకు వివరంగా చెప్పవచ్చు . వీరికి మునగాకు కూర కూర వండి పెడితే పాలు వృద్ధి చెందుతాయి. గుప్పెడు మునగ ఆకులను 100 మిల్లీ లీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. కాచి వడపోసి చల్లారబెట్టాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్తమా, దగ్గు, టీబీ తగ్గుతాయి. ఒక చెంచా మునగ ఆకుల రసాన్ని, ఒక గ్లాసు కొబ్బరి నీటిలో కలిపి, అందులో కొంచెం తేనె కలిపి విరోచనాలు అయ్యే వారికి ఇస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. కాల్షియం లోపం తో బాధపడేవారికి ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఆకులను కూరగా, పప్పుగా, ఫ్రై గా ఏదోవిధంగా తీసుకుంటే వారిలో కాల్షియం పెరుగుతుంది. ఈ ఆకుల రసంలో కొద్దిగా పాలు పోసుకుని తాగితే ఎముకల బలంగా తయారవుతాయి. రక్త శుద్ధి జరుగుతుంది. మునగాకు లో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్స్ ద్వారా బ్లడ్ కి షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. థైరాయిడ్ ను రెగ్యులేట్ చేసే నేచురల్ మందుగా మునగాకును సూచిస్తారు వైద్యులు. మునగాకులు, క్యారెట్, కీర దోస కలిపి జ్యూస్ లా తయారు చేసుకొని తాగితే మూత్ర సంబంధిత సమస్యల నుండి బయట పడేస్తుంది. మునగాకు పూలతో ఆవు పాలను కలిపి కషాయం చేసుకుని తాగితే వీర్య కణాలు వృద్ధి చెందుతాయి.


Share

Related posts

ముంబాయిలో అగ్నిప్రమాదం : 15కార్లు దగ్ధం

somaraju sharma

పూజా హెగ్డే ఎంత బాగా బ్యాలెన్స్ చేస్తుందో ..?

GRK

బిగ్ బాస్ 4: అతని లేని లోటు స్పష్టంగా కనబడుతోంది అంటున్న నెటిజన్లు..!!

sekhar