మనకి ఎన్ని నంబర్లు ఉన్నాకూడా అవి 0 నుంచి 9 మధ్యలోనే ఉంటాయి. వాటితోనే కాంబినేషన్లు తయారవుతాయి.సంఖ్యా శాస్త్రం లో కొన్ని నంబర్ల కలయిక చెడ్డవిగా భావిస్తారు.అందులో నెంబర్ 13 అనేది మన భారత దేశం లోనే కాదు, ప్రపంచం మొత్తం కూడా దీన్ని చెడ్డ నంబర్‌గానే అనుకుంటుంది. ఏసుప్రభు లాస్ట్ సప్పర్ లో, డిన్నర్ ఇచ్చినప్పుడు 13వ అతిథిగా జుడాస్ ఇస్కారియట్ అందులో పాల్గొన్నాడు. ఏసుప్రభువుకు అతను అన్యాయం చేశాడు. అందువల్లే 13ను తీవ్రంగా వ్యతిరేకిస్తారు.
అమెరికా లో అయితే చాలా భవనాలకు 13వ అంతస్థు ఖాళీగానే ఉంటుంది. కనీసం అక్కడ లిఫ్ట్ కూడా ఆగదు అంటే ఆలోచించవచ్చు. తూర్పు ఆసియా దేశాలు అయితే 4 సంఖ్యను చెడుగా భావిస్తాయి. చైనాలో అయితే ఈ సంఖ్య అంటే అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే… దీన్ని పలికేటప్పుడు వచ్చే శబ్దానికి, చైనా భాషలో మరణం అనే అర్థం ఉందట. అలా ఈ నంబర్ వ్యతిరేకమైంది.మన దేశంలో నవ గ్రహాలు, నవ రాత్రులు, నవ ధాన్యాలూ… ఇలా ప్రతీదీ 9 తో సంబంధం ఉంటుంది.
భారతీయులకు నెంబర్9 అంటే చాలా ఇష్టం.అయితే చైనా ప్రజలు మాత్రం 9ని అశుభానికి గుర్తుగా భావిస్తారు. ఈ సంఖ్యను పలికేటప్పుడు వచ్చే శబ్దానికి, చైనా భాషలో హింసించడం, ఏడవడం వంటి అర్థాలు వస్తాయట.నంబర్ 24 ఈ సంఖ్య కూడా మనకు వాడుకలోకి వస్తుంది. రోజుకు 24 గంటలు ఎవ్వరికైనా అంతే ఉంటుంది కాబట్టి… ఇది ఎక్కువగా కనిపిస్తుంది. సంఖ్యాశాస్త్ర నిపుణులు లెక్క ప్రకారం ఈ సంఖ్య చెడ్డది మాత్రమే కాదు, చాలా ప్రమాదకరమైనది కూడా అని అంటున్నారు.
24 నంబర్ పలికేటప్పుడు వచ్చే శబ్దం, తల్లి గర్భం లో పూర్తిగా తయారవకుండానే పుట్టే బిడ్డను సూచిస్తుందని అంటున్నారు. అందుకోసం ఈ నంబర్‌కి దూరంగా ఉండాలంటున్నారు సంఖ్యా శాస్త్ర నిపుణులు. ఈ నంబర్ మనకు పెద్దగా కనపడదు. అయితే వాహనము లేదా, మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు చివర్లో ఈ నంబర్ లేకుండా చూసుకోమని సలహా ఇస్తున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. జపాన్ దేశ ప్రజలు కూడా ఈ నంబర్‌ను అశుభానికి గుర్తుగా చూస్తున్నారట.