న్యూస్ సినిమా

కార్తీకదీపం సీరియల్ లో మోస్ట్ ఎమోషనల్ సీన్… చూస్తే కంటతడి పెట్టకుండా ఉండలేరు!!

కార్తీకదీపం సీరియల్ లో మోస్ట్ ఎమోషనల్ సీన్… చూస్తే కంటతడి పెట్టకుండా ఉండలేరు!!
Share

గత మూడు సంవత్సరాలుగా స్టార్ మా ఛానల్  లో నిర్విఘ్నంగా ప్రసారమవుతూ తెలుగు సీరియల్ ల చరిత్ర లోనే రికార్డులను సృష్టిస్తున్న సీరియల్ కార్తీకదీపం. ఇప్పటికే కార్తీకదీపం 930+ ఎపిసోడ్ లను పూర్తిచేసుకుంది. అయితే ఇటీవల ప్రసారమయ్యిన ఎపిసోడ్ మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంది… కార్తీక్ బాధలో ఏంచెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉండగా సౌందర్య అటు వైపు గా రాగా సౌందర్యను కూర్చోపెట్టి వొడిలో తల పెట్టుకుని ఏడుస్తూ తన బాధని వెళ్లగక్కుతాడు. 

కార్తీకదీపం సీరియల్ లో మోస్ట్ ఎమోషనల్ సీన్… చూస్తే కంటతడి పెట్టకుండా ఉండలేరు!!

‘ఏంటి నాన్నా’ అంటూ సౌందర్య బాధగా తలనిమురుతూ ‘నీకు ఈ పరిస్థితిని తీసుకొచ్చిన దోషిని నేనే కదా?’ అంటుంది. ఆ మాటలకూ కార్తీక్ బాధగా, ‘నాకు ఎవరిని దోషి గా నిలబెట్టాలని లేదు మమ్మీ. అసలు హిమకి హిమే దీప కూతురని చెప్పకుండా ఉండి నాకే చెప్పాల్సింది మమ్మీ. నేనేమి రాక్షసుడ్ని కాదు మమ్మీ..’ అంటాడు. సౌందర్య తలనిమురుతూ ‘నేను అదే అనుకున్నానురా కానీ పరిస్థితి ఇలా వచ్చింది’ అంటుంది. ‘ఈ పరిస్థితికి కారణం ఎవరు మమ్మీ.. కన్నతల్లా? పెంచిన కూతురా? మనందరినీ పుట్టించిన ఆ దేవుడా?’ అంటూ కార్తీక్ ప్రశ్నిస్తుంటే వెంటనే సౌందర్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

‘శాపం తగిలింది మమ్మీ… నాకు, నా పిల్లలకీ. మళ్లీ వరాలు ఇచ్చేది ఎవరు? నేను హిమని మరిచిపోలేను, అలానే తనని వదులుకోలేను కూడా. హిమని వెనక్కి తెచ్చుకోవాలంటే ఏ చట్టాన్ని ఆశ్రయించాలి? ఏ దేవుడ్ని కొలవాలి? ఏం చెయ్యాలి? ఆ ఒక్క తప్పు అది చేసి ఉండకపోతే? కాలం వెనక్కి మళ్లీ ఆ ఆత్మసౌందర్యమే నా కంట పడితే.. ఈ గుండె చల్లబడితే ఎంత బాగుంటుంది కదా మమ్మీ’ అని కార్తీక్ చాలా బాధపడుతూ ఏడుస్తాడు. కార్తీక్  మాటలు వింటూ సౌందర్య కూడా కన్నీళ్లతో బాధగా చూస్తు ఉండిపోతుంది. ఆ సీన్ మాత్రం చాలా ఎమోషనల్‌గా ఉంది.

 


Share

Related posts

ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీల పదవి ఉండేనా ? ఊడేనా ?

Yandamuri

Pooja hegde: పేరే పెట్టుబడి..కల నెరవేర్చుకుంటున్న స్టార్ హీరోయిన్స్

GRK

Tirupati By Poll: తిరుపతిలో పవన్ పై వైఎస్ జగన్ వ్యూహమిదేనా..!?

Muraliak
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar