ఆడ‌పిల్ల పుడుతుంద‌ని అమ్మడానికి ముందే ఒప్పందం.. చివరికి?

అరే.. ఈ సొసైటిలో చాలా మందికి ఇక తెలివి రాదేమో.. ఆడపిల్ల‌లు అంటే వాళ్ల‌కు ఒక ర‌క‌మైన చీద‌రింపు. గ‌ర్భంలో ఉన్న‌ప్పుడే ఆడ‌పిల్ల‌ను చంప‌డానికి సిద్ధ‌మ‌వుతూనే ఉంటారు. లేక‌పోతే అమ్ముకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతుంటారు. అస‌లు ఇలా చేసే తండ్రుల‌కు బుద్ధి లేద‌ని మ‌న‌కు తెలుసు. కానీ క‌న్న త‌ల్లులే ఇలాంటి ప‌నుల‌కు ఒడిగ‌‌డుతుంటే.. ఇక ఎవ‌రికీ ఏమ‌ని చేప్పాలి. ఇలాంటి ఘ‌ట‌నే ఈ మ‌ధ్య మ‌ళ్లీ ఇంకోటి జ‌రిగింది.

త‌న‌కు ఆడ బిడ్డే పుడుతుంది అనుకుని ఓ త‌ల్లి ఆ బిడ్డ‌ను అమ్మ‌డానికి బేరం చేసింది. అలాగే అమ్మేసింది. కానీ త‌న‌కు కొడుకు పుట్టాడ‌ని తెలుసుకుని ఆ బిడ్డ‌ను త‌న‌కు అమ్మ‌గించ‌మ‌ని పోలీసుల‌ను కోరింది. బ్రోక‌రు త‌న‌ను మోసం చేశాడ‌ని చెప్పుకొచ్చింది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

ఈ విష‌యంపై నాచారం సీఐ కిరణ్‌ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందుల‌తో హైదరాబాద్‌కు చెందిన మీనా, వెంకటేశ్ భార్య‌భ‌ర్త‌లు వారికి పుట్టే బిడ్డను ఒక బ్రోక‌ర్ సాయంతో అమ్ముకోవాల‌ని చూశార‌ని తెలిపారు. ఒప్పందం ప్రకారం కాప్రాకు చెందిన రాజేశ్‌ అనే వ్యక్తి తన భార్య పేరుతో ఈఎస్‌ఐలో ప్రసవం చేయించాడ‌ని తెలిపారు. కానీ ఆమెకు కొడుకు పుట్టాడ‌ని తెలిపారు.

ఆడపిల్లే పుట్టిందని చెప్పి మ‌గ‌పిల‌గాన్నిరాజేశ్‌కు అప్పగించారు. 5 నెలల తర్వాత మీనాకు ఈ విషయం తెలిసింద‌ని పేర్కొన్నాడు. దాంతో మీనా త‌న బిడ్డ‌ను ఇప్పించాల‌ని పోలీసులను ఆశ్రయింద‌ని పేర్కొన్నాడు. దర్యాప్తు చేసిన పోలీసులు బాబును రాజేశ్ నుంచి తీసుకున్నారు. ఆ అబ్బాయిని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సభ్యులకు అప్పగించినట్లు సీఐ కిరణ్‌ కుమార్ పేర్కొన్నాడు.