NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Motkupalli: బీజేపీకి మోత్కుపల్లి గుడ్ బై!అనూహ్యమేమీ కాదన్న కమలనాథులు!కెసిఆర్ ట్రాప్ లో పడ్డ మాజీ మంత్రి?

Motkupalli: తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు.గత కొంతకాలంగా పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్న ఆయన ఇటీవల సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన దళిత నేతల సమావేశానికి సైతం హాజరయ్యారు.అప్పటి నుండే ఆయన కెసిఆర్ కి జిందాబాద్ కొడతారేమోనన్న అనుమానాలు మొదలయ్యాయి.కాగా పార్టీనేతలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మోత్కుపల్లి ప్రగతి భవన్‌కు వెళ్లటంపై బిజెపి ఆగ్రహం వ్యక్తం చేసింది.దీంతో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు నరసింహులు ప్రకటించారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోత్కుపల్లి తన నిర్ణయాన్ని వెల్లడించారు.ఈ మేరకు బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షుడికి అయన లేఖ రాశారు.

Motkupalli good bye to BJP!
Motkupalli good bye to BJP

బీజేపీలో దళితులకు ప్రాధాన్యత లేదు

బిజెపి లో జరుగుతున్న పరిణామాలపై మనస్థాపానికి గురయ్యానని, దళిత ఎంపవర్మెంట్ మీటింగ్ అని సీఎం మీటింగ్ కు వెళితే తనపై వివాదం సృష్టించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి వెళ్లడం ద్వారా దళితులకు ఏదైనా మేలు చేకూరుతుందేమో అని తాను సదుద్దేశంతో హాజరయ్యానని,దాన్ని బిజెపి నాయకత్వం వేరే విధంగా చూసిందన్నారు. బిజెపిలో దళితులకు ప్రాధాన్యత లేదని ఆయన ఆరోపించారు.ఈ పరిస్థితుల్లో ఒక దళితుడిగా తాను బిజెపిలో ఉండి ప్రయోజనం లేదని అందుకే రాజీనామా చేస్తున్నానని ఆయన వివరించారు.

వేరే స్కెచ్ ఉందని అనుమానం!

అయితే, దళిత బంధు సమావేశం కన్నా ముందు నుండే మోత్కుపల్లి టీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉన్నారన్న వార్తలు వినిపించాయి.నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా కూడా మోత్కుపల్లి నల్లగొండ జిల్లానే అయినప్పటికీ బీజేపీ అభ్యర్థికి పెద్దగా ప్రచారం చేయలేదు అంటారు.తాజాగా మోత్కుపల్లి బీజేపీకి రాజీనామా చేయటంతో ఆయన టీఆర్ఎస్‌లో చేరటం లాంఛనమే అని వినిపిస్తోంది.ఇక పార్టీలు మార్చటంలో మోత్కుపల్లి నర్సింహులుకు మరొకరు సాటి రారు.తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలను ఆయన చుట్టేశారు.తెలుగుదేశం,కాంగ్రెస్ బీజేపీలతో ఆయన సహజీవనం చేశారు.తెలుగుదేశం నిజానికి నర్సింహులుకు రాజకీయ భవిష్యత్ కల్పించింది.అయితే ఎప్పటికైనా గవర్నర్ కావాలన్న కోరికతో ఉన్న నర్సింహులు తనకు చంద్రబాబు ఆ పదవి ఇప్పించలేదని కోపం పెట్టుకున్నారు.చివరకు ఎన్ని పార్టీలు మారినా ఆయనకు ఒరిగిందేమీ లేదు.ఆయన రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి.

 

author avatar
Yandamuri

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju