NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Motkupalli Narasimhulu: అబ్బెబ్బే అదేం లేదు! బీజేపీ బలోపేతానికే కెసిఆర్ మీటింగ్ కు వెళ్లానన్న మోత్కుపల్లి! నరసింహలుని నమ్మొచ్చంటారా ??

Motkupalli Narasimhulu: తెలంగాణ బీజేపీలో సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్శింహులు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేసిఆర్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి బీజేపీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన తరువాత ఆ పార్టీ నేతగా ఉన్న నర్శింహులు హజరుకావడాన్ని ఆ పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. పార్టీ స్టాండ్ ను దిక్కరించి సమావేశానికి హజరు కావడంతో పాటు మోత్కుపల్లి ఓ అడుగు ముందుకు వెళ్లి సీఎం కేసిఆర్ ను అభినందనలతో ముంచెత్తారు. దలితుల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన చారిత్రాత్మకమైన మీటింగ్ అని కూడా కితాబు ఇచ్చారు. అయితే మోత్కుపల్లి ఆ సమావేశానికి హజరుకావడంతో బీజేపీలోని ఓ వర్గం తప్పుబడుతుండగా ఆయన దీనిపై వివరణ ఇచ్చారు.

Motkupalli Narasimhulu comments on all party meeting issue
Motkupalli Narasimhulu comments on all party meeting issue

Read More: AP CM YS Jagan: కనీస విలువలు పాటించకుండా తప్పుడు రాతలు అంటూ సీఎం జగన్ ఫైర్

Motkupalli Narasimhulu: బీజేపీని బతికించేందుకే మీటింగ్ కు వెళ్లా

దళిత ఎంపవర్‌మెంట్ పథకం పై సీఎం కేసిఆర్ మీటింగ్ ఏర్పాటు చేసిన మీటింగ్ కు వెళ్లకపోవడం తప్పు అవుతుందన్నారు మోత్కుపల్లి. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అనే ప్రచారం ఇప్పటికే ఉంది, ఈ సమావేశానికి వెళ్లకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది అందుకే రాష్ట్రంలో పార్టీని బ్రతికించేందుకే సమావేశానికి వెళ్లినట్లు చెప్పారు మోత్కుపల్లి. సమావేశానికి వెళుతున్న విషయంపై పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కు తెలియజేశానన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌యే స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారని చెప్పారు. ఇతర నాయకుల మాదిరిగా వ్యాపారాల కోసమో మరో దాని కోసమో వెళ్లే వ్యక్తిత్వం మోత్కుపల్లిది కాదనీ స్పష్టం చేశారు. రాజకీయాల్లో నీతి నిజాయితీగా ఉండాలని స్వర్గీయ నందమూరి తారక రామారావు చెప్పేవారనీ, ఆదే విధంగా తాను రాజకీయాల్లో కొనసాగుతున్నాననీ మోత్కుపల్లి చెప్పుకొచ్చారు. తాను బీజేపీలోనే ఉన్నాను, పార్టీలోనే కొనసాగుతానని వెల్లడించారు.

దళితుల అభ్యున్నతికి గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ ఒక్కో కుటుంబానికి పది లక్షలు పంపిణీ చేసే పథకాన్ని ఏర్పాటు చేయడం మామూలు విషయం కాదనీ, ఈ విషయంలో కేసిఆర్ ను మరో సారి అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే బీజేపీలోని పాత నాయకులు అందరూ కేసిఆర్ ను విమర్శిస్తూ టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగి 2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదపాలని చూస్తుంటే అదే పార్టీలోని ఉన్న మోత్కుపల్లి కెసిఆర్ ను ప్రశంసిస్తూ పరిపాలన అధ్బుతం అని పొగుడుతుండటం అనుమానాలను రేకెత్తిస్తోంది. బీజేపీ నేతలు అఖిలపక్ష సమావేశానికి హజరుకారని తెలిసిన కేసిఆర్ స్వయంగా మోత్కుపల్లికి ఫోన్ చేసి ఆహ్వానించడంలోనే  పెద్ద ఆంతర్యం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా ఈ విషయంపై ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపకుడు మందా కృష్ణమాదిగ స్పందిస్తూ మోత్కుపల్లికి దళితులపై ప్రేమ తగ్గి పదవులు, సీఎం కేసిఆర్ పై ప్రేమ పెరిగిందని విమర్శించారు. కేసిఆర్ దళిత సాధికారితపై మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. ఉద్యమ కాలం నుండి నేటి వరకు దలితులను మూడు సార్లు మోసం చేసిన ఘనత సీఎం కేసిఆర్‌దేనని అన్నారు. గత ప్రభుత్వాల కన్నా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే లాకప్ డెత్ లు పెరిగాయని అన్నారు. లాకప్ డెత్ కారకులైన పోలీస్ అధికారులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N