మోటో జి9 స్మార్ట్ ఫోన్‌ను మోటోరోలా కొత్తగా భారత మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. దీంట్లో 6.5 ఇంచుల డిస్ప్లేను ఇచ్చారు. స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్ ఉండడం వల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్ ఆప్షన్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 64జీబీ గా ఉంది. మెమోరీని కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్లను ఇచ్చినందున ఇందులో రెండు సిమ్ కార్డులు, ఒక మెమొరీ కార్డును ఒకేసారి వేయలేం. రెండు సిమ్ కార్డులు లేదా ఒక సిమ్ కార్డు, ఒక మెమొరీ కార్డును వేసి ఉపయోగించాలి. వెనుక వైపు 48 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న మెయిన్ కెమెరాను ఇచ్చారు. దీనికి తోడు 2 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న మరో 2 కెమెరాలు ఉన్నాయి. ముందు వైపు ఒకే కెమెరాను ఇచ్చారు. అది 8 మెగాపిక్సల్ కెపాసిటీని కలిగి ఉంది.
ఫోన్ కు వెనుక వైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఫోన్‌ను దీంతో వేగంగా అన్ లాక్ చేయవచ్చు. రెండు 4జి సిమ్ కార్డులను వేసి ఉపయోగించవచ్చు. బ్లూటూత్ 5.0 ఫీచర్‌ను ఇందులో ఇచ్చారు. ఎన్ఎఫ్సీ ఉన్నందున కార్డ్ లెస్ పేమెంట్లు చేయవచ్చు. 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని టర్బో పవర్ చార్జింగ్ ఫీచర్‌తో ఇచ్చారు. మోటో జి9 ఫోన్ ధర రూ.11,499గా ఉంది. ఆగస్టు 31 నుంచి ఫ్లిప్ కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.