Movie review : అవసరాల శ్రీనివాస్ ఏ సినిమా చేసినా కూడా ఒక అర్థం ఉంటుంది. ఆ మధ్యకాలంలో ఈ హీరోపై ఒక వీడియో హల్ చల్ చేసింది. అవసరాల శ్రీనివాస్ కు బట్టతల అనే వీడియోను ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ బయటపెట్టారు. కానీ అదంతా ఉత్తిదే అని ఇప్పుడు అందరికీ తెలిసింది. అవసరాల శ్రీనివాస్ ఇప్పుడు నూటొక్క జిల్లాల అందగాడు సినిమా చేస్తున్నాడు. అందులో ఆయనకు బట్టతల ఉంటుంది. ఈ సినిమా మాంచి కామెడీ ఎంటర్ టైన్ మెంట్ గా థియేటర్లలో రిలీజ్ కు సిద్దమైంది. ఇందులో చిలసౌ సినిమా హీరోయిన్ రుహాని శర్మ నటిస్తోంది. రాచకొండ విద్యాసాగర్ దీనికి డైరెక్షన్ చేస్తున్నారు. ఈ సినిమాకు శ్రీనివాస్ అవసరాల కథను రాశాను. ఈ సినిమాను సెప్టెంబర్ 3వ తేదీన థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ట్రైలర్ ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిలీజ్ చేశారు.
Breaking : రామ్ గోపాల్ వర్మ మొదటి లవర్ ఇదిగో !!
బట్టతల ఉండటంతో హీరో విగ్ ను వాడి హీరోయిన్ ను ఇంప్రెస్ చేస్తాడు. ఆ విగ్ దాచుకుంటూ నానా తంటాలు పడుతాడు. ట్రైలర్ చూస్తుంటే అందరికీ నవ్వు కచ్చితంగా వస్తుంది. ఈ సినిమాలో గొత్తి సూర్య నారాయణ అనే బట్టతల ఉండే వ్యక్తిగా శ్రీనివాస్ అవసరాల కనిపిస్తున్నాడు. హీరోయిన్ తో లవ్ లో పడ్డాక బట్టతల విషయాన్ని ఎవ్వరితో చెప్పుకోలేక అనేక ఇబ్బందులు పడతాడు. అయితే హీరో ఎలాంటి ఇబ్బందులు పడతాడనేది ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమా ద్వారా తెలుస్తుంది. దిల్ రాజు – క్రిష్ జాగర్లమూడి సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై శిరీష్ – వై.రాజీవ్ రెడ్డి – జె.సాయిబాబు సంయుక్తంగా ఈ సినిమా చేస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు నవ్వును పంచనుంది.
BREAKING: అరగంటలో పెళ్లి – మండపం నుంచి పారిపోయిన పెళ్లి కూతురు !