NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi March 1 2024 Episode 346: ఇందిరా దేవి సూపర్ ప్లాన్..? భాస్కర్ మీద కోపంతో కళావతి ఇంటికి రాజ్.. అప్పు సలహా..?

Brahmamudi Today Episode March 1 2024 Episode 346 Highlights

Brahmamudi March 1 2024 Episode 346:  ఈరోజు ఎపిసోడ్ లో, కళ్యాణ్ అనామికుల మధ్య జరిగిన గొడవను సర్దుమనిగేలా చేయాలని రాజ్ అనుకుంటాడు అందుకు కళ్యాణ్ కి వేరే ఆఫీస్ బ్రాంచ్ పేపర్స్ ను తీసుకువచ్చి కళ్యాణ్ ను సంతకం పెట్టమని అడుగుతాడు. అందుకు అనామిక ధాన్యలక్ష్మి ఇద్దరు సంతోషిస్తారు కానీ కళ్యాణ్ మాత్రం నాకు ఇష్టం లేదన్నయ్యా అని చెప్తాడు. మనసుకి సంబంధించిన వాళ్ల కోసం మనం కొన్ని సార్లు ఇష్టం లేని పని కూడా చేయాలి కళ్యాణ్ అని అంటాడు రాజ్ అన్నయ్య నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని అంటాడు కళ్యాణ్. నీ మంచి కోసమే ఇలా చేయమని చెప్తున్నాను అని అంటాడు రాజ్ వెంటనే కావ్య కూడా అవును కళ్యాణ్ నువ్వు నీకు నచ్చిన పని చేస్తూ ఈ ఆఫీస్ బాధ్యతలు కూడా స్వీకరించు అని అంటుంది అయినా కానీ కళ్యాణ్ మాత్రం అందుకు ఒప్పుకొక,నేను అలా రెండు పనులు చేయలేని వదిన అసలు నావల్ల కాదు ఆఫీస్ కి వెళ్ళాలంటే నాకు ఇష్టం ఉండదు నా మనసుకు నచ్చని పనిని నేను చెయ్యలేను ఇన్ని రోజులు ఆఫీస్ కి వెళ్లి నటించి చాలా ఇబ్బంది పడ్డాను ఇక నేను అలసిపోయాను నాకు నచ్చిందే నేను చేస్తాను అని కళ్యాణ్ తెగేసి చెప్తాడు.

Brahmamudi Today Episode March 1 2024 Episode 346 Highlights
Brahmamudi Today Episode March 1 2024 Episode 346 Highlights

ఇక అక్కడే ఉన్నానా మీకా మళ్ళీ గొడవ పెట్టుకోవడానికి లేచి అంటే ఏం చేయబోతున్నావు కళ్యాణ్ అని అడుగుతుంది అది నీకు చెప్పినా అర్థం కాదులే అని అంటాడు కళ్యాణ్, అంటే ఇప్పుడు నువ్వు మళ్ళీ నన్ను బాధ పెట్టాలనుకుంటున్నావా అని అంటుంది అనామిక నేను నిన్ను బాధ మాత్రమే పెడుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు మాత్రం నా మనసుని ముక్కలు చేశావని అంటాడు కళ్యాణ్. నీ భార్య నీ మంచి కోసమే కదా చెప్తుంది అని ధాన్యలక్ష్మి కూడా ఆ కోడలికి వత్తాసు పలుకుతుంది. పాతికే వెళ్లి వచ్చిన వాళ్లకి ఏది మంచి ఏది చెడు అని చెప్తే ఇక వాళ్ళు చేయాలనుకున్న పని ఎలా చేస్తారు? వాళ్లకంటూ వాళ్ళ జనరేషన్ కంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి అవి అర్థం చేసుకోకపోతే ఎలాగో అని అంటాడు కళ్యాణ్. అక్కడే ఉన్న ప్రకాశం వెంటనే లేచి శభాష్ కళ్యాణ్ ఇప్పటికైనా నువ్వు అనుకున్నది చేయాలనుకుంటున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. నా ఫుల్ సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది అని అంటాడు వెంటనే రాజ్ అదేంటి బాబాయ్ మీరు అని అలాగా ఎంకరేజ్ చేస్తారు అని అంటే అవును రాజ్ ఇప్పటివరకు నువ్వు నీ తమ్ముడి కోసం నువ్వు చాలా చేశావు ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నీ తమ్ముని నువ్వు దారిలో పెట్టాలనుకుంటున్నావు నువ్వు కళ్యాణ్ కి ఎంత అండగా నిలిచావో నువ్వు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. వాడికి అండగా నిలబడితే చాలు అని అంటాడు. ఇక సుభాష్ కళ్యాణ్ ఇప్పుడు నువ్వు ఎక్కడికి బయలుదేరారు అని అడుగుతాడు. ఇక్కడ ఉన్న చాలామంది నాకు ఏదీ చేతకాదని అనుకుంటున్నారు అందుకే నేనేంటో నిరూపించుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. నా కవితల్ని తీసుకువెళ్లి ఎవరైనా వీటిని పబ్లిష్ చేస్తారో లేదో కనుక్కుంటాను అని అంటాడు.

Brahmamudi Today Episode March 1 2024 Episode 346 Highlights
Brahmamudi Today Episode March 1 2024 Episode 346 Highlights

ఇక అనామికా చాలా కోపంతో అంటే ఇప్పుడు ఈ కవితలు తీసుకెళ్లి నువ్వు గొప్ప కవి అవ్వాలనుకుంటున్నావా అని అంటుంది. నాపై నీకు ఎట్లాగూ నమ్మకం లేదు కనీసం నాపైన నాకైనా నమ్మకం ఉండాలి కదా అనామిక అని అంటాడు దానికి ఇంకొకరి దగ్గరికి ఎందుకు వెళ్లడం అని అంటాడు రాజ్, అదేంటి అన్నయ్య అని అడుగుతాడు కళ్యాణ్. నీకు కవితలు పబ్లిష్ చేయాలని ఉంటే చెప్పు నేనే అందుకు ఖర్చు పెట్టుకుని పబ్లిష్ చేస్తాను అని అంటాడు రాజ్, నేను నేనేంటో నిరూపించుకోవాలనుకుంటున్నాను కానీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి నేను కవిని అవ్వాలనుకోవట్లేదు అని అంటాడు కళ్యాణ్ ఇది నా ఆస్తిత్వం కోసం చేస్తున్న పోరాటం అన్నయ్య అని అంటాడు కళ్యాణ్. ఇక అక్కడ ఉన్నవాళ్లంతా కళ్యాణ్ కి ఆల్ ది బెస్ట్ చెప్తారు. కానీ అనామిక, ధాన్య లక్ష్మీ మాత్రం సైలెంట్ గా ఉంటారు. ఇక రాజ్ ఆలోచిస్తూ ఉంటే నీకు నా మీద నమ్మకం లేదా అన్నయ్య అని అడుగుతాడు నా తమ్ముడు సాధించలేనిది ఇంకెవరూ సాధించలేరు రా ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు రాజ్ దాంతో కళ్యాణ్ సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక ధాన్యలక్ష్మి ఇద్దరు కోపంగా లోపలికి వెళ్తారు.

Brahmamudi Today Episode March 1 2024 Episode 346 Highlights
Brahmamudi Today Episode March 1 2024 Episode 346 Highlights

ఇక కళ్యాణ్ ఒక ఆఫీస్ కి వెళ్తాడు అక్కడ తన కవితలను పబ్లిష్ చేయమని అడుగుతాడు ఆ కవితల్ని చూసి అక్కడ వాళ్ళు మెచ్చుకుంటారు కానీ పబ్లిక్ చేయడం కుదరదండి ఎందుకంటే ఈరోజుల్లో కవితలు ఎవరు చదవట్లేదు కదా అని ఆ ఆఫీసర్ కళ్యాణ్తో చెప్తాడు. మీరు కావాలంటే ఒక లవ్ స్టోరీ రాయండి తప్పకుండా పబ్లిష్ చేస్తాను అని అతను సలహా ఇస్తాడు కళ్యాణ్ కి, కానీ కళ్యాణ్ మాత్రం నాకు నచ్చిన పని చేస్తాను బలవంతంగా నేను ఏవి రాయలేను అని అంటాడు. అందుకు అతను వెంటనే మీరు రాసిన కవితలను ఎవరు పబ్లిష్ చేయరు అని అంటాడు నేను ఇప్పుడే ఇంట్లో వాళ్ళతో గొడవపడి నా కవితల్ని పబ్లిష్ చేసుకోవడానికి బయటకి వచ్చాను నా ప్రయాణం మొదలుపెట్టిన రోజే ఆపేయమంటే ఎలాగో నా ప్రయాణం నేను కొనసాగిస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Brahmamudi Today Episode March 1 2024 Episode 346 Highlights
Brahmamudi Today Episode March 1 2024 Episode 346 Highlights

ఇక రాజ్ అనామిక అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య తన బావతో పాటు తను యుఎస్ కి వెళ్లాలనుకుంటున్నట్లు చెబుతుంది దానికి కావాల్సిన వీసా ఏర్పాట్ల కోసం అప్లికేషన్ ఫామ్ ని తీసుకురమ్మని అడుగుతుంది అందుకు వెంటనే రాజ్ ఒప్పుకోడు అనుకుంటుంది కానీ రాజు ఉన్న మూడులో ఓకే అనేస్తాడు ఇదేంటి ఈయన ఓకే అనేసాడు అని కావ్య షాక్ అవుతుంది వెంటనే నేను ఎందుకు అప్లికేషన్ అడుగుతున్నాను తెలుసా అని అంటుంది. ఈ ఇంట్లో ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటున్నప్పుడు నువ్వు మాత్రం నేను ఎందుకు తీసుకోకూడదు. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు అప్లై చేసుకోవచ్చు అని అంటాడు వెంటనే మీ బావని కూడా అప్లై చేయమను అని అంటాడు అంటే అని కావ్య అంటూ ఉంటే నీకు అప్లై చేయడం రాకపోతే ఆఫీస్ కి వెళ్లేటప్పుడు నాకు గుర్తు చేయి అని అంటాడు దాంతో ఇంకా షాక్ అవుతుంది కావ్య. ఇదేంటి ఈయన నేను ఏదో అంటాడు అనుకుంటే ఇలా బిహేవ్ చేశాడు అని ఆలోచనలో పడుతుంది కావ్య.

Brahmamudi Today Episode March 1 2024 Episode 346 Highlights
Brahmamudi Today Episode March 1 2024 Episode 346 Highlights

ఇక మరోవైపు కళ్యాణ్ కవితలు బాగున్నాయి మీరు ఒక మంచి స్టోరీని డెవలప్ చేసి తీసుకురండి అని వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు. సారీ నేను కవితలు పాటలు తప్ప స్టోరీస్ రాయలేనండి అని చెప్పేస్తాడు కళ్యాణ్ నీళ్లు తాగుతూ ఉంటాడు కళ్యాణ్ దగ్గరికి అప్పు వస్తుంది కొబ్బరి బొండం తాగడానికి డబ్బులు లేకపోతే అప్పునే డబ్బులు ఇస్తుంది. ఆ తర్వాత అప్పుతో కళ్యాణ్ జరిగిన విషయాలన్నీ పంచుకుంటాడు. ఇక అప్పు చాలా బాధపడుతుంది కళ్యాణ్ కూడా నువ్వు ఎంతో మంచి దానివి నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అప్పు అని ఫీల్ అవుతాడు అనామిక లాగా నువ్వు నన్ను సాధించొచ్చు కానీ నువ్వు నన్ను ప్రేమించి కూడా ఏ రోజు ఇలా సాధించలేదు. అలాంటి నిన్ను నేను పట్టించుకోకుండా, నా దారి నేను చూసుకున్నాను అని బాధపడతాడు వెంటనే అప్పు అలాంటిదేమీ లేదు నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు నీవు సాధిస్తావని నమ్మకం నాకుంది అని ఎంకరేజ్ చేస్తుంది దాంతో పాటు నువ్వు నీ పని మీద ఫోకస్ పెట్టు కచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు అని అంటుంది ఒక తండ్రి తన కొడుక్కి జాబ్ రాలేదని అరుస్తాడు అంతమాత్రాన ఆ తండ్రికి ఆ కొడుకు మీద ప్రేమ లేనట్టా అట్లాగే నువ్వు కూడా నీ పనిమీద ఫోకస్ పెట్టి మంచి విజయం సాధిస్తే అప్పుడు నీ వాళ్ళందరూ నీ వెనకే ఉంటారు అని అంటుంది అప్పు నాలో ఆత్మవిశ్వాసం పెంచావో థాంక్స్ అని చెప్తాడు కళ్యాణ్. ఇక అప్పు నేను పోలీస్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్తుంది అందుకు కళ్యాణ్ ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు. అప్పు ఇచ్చిన సలహాతో కళ్యాణ్ లో ఎక్కలేని ఉత్సాహం వస్తుంది కవితలు ఎలాగైనా పబ్లిష్ చేయించాలి అని అనుకుంటాడు.

ఇక మరోవైపు రాజ్, తనని పట్టించుకోకుండా ఉంటున్నాడు అన్న విషయాన్ని ఇందిరా దేవికి చెప్తుంది కావ్య. కళ్యాణ్ గురించే ఆలోచిస్తూ ఫీలవుతున్నాడు అని చెప్తుంది. ఇందిరా దేవి కూడా ఇప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితులకి కళ్యాణ్ అలా మాట్లాడుతున్నాడు. నేను మీకు సలహా ఇస్తాను ఇప్పుడు మీరు ఈ వాతావరణం నుంచి రాజ్ ని వేరే చోటికి తీసుకు వెళ్లాలి అందుకు మీ పుట్టిల్లే కరెక్ట్ అని భాస్కర్ కి కావ్యకు ఇందిరా దేవి సలహా ఇస్తుంది. నేను చెప్పిన ప్రకారం రాజ్ కి చెప్పండి అని అంటుంది.ఒక కావ్య రాజు దగ్గరికి వెళుతుంది. నేను మా పుట్టింటికి వెళ్తున్నాను అని అంటుంది వెంటనే సంతోషంగా రాజ్ నేను చాలా ప్రశాంతంగా ఉంటాను నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అని అంటారు. అక్కడే ఉన్న భాస్కర్ నేను చెప్పాను కదా కావ్య అన్నయ్య ఇలానే అంటాడని, ఇప్పుడు నువ్వు పుట్టింటికి వెళ్లొచ్చు అని అంటాడు బావ వెంటనే రాజ్ నీ బొంద మీ ఇద్దరినీ దూరం చేయడానికి నేను తనని పుట్టింటికి పంపిస్తున్నాను అని రాజ్ అనుకుంటాడు. కావ్య నేను ఒక్కదాన్నే మా పుట్టింటికి ఎలా వెళ్తాను మా బావతో కలిసి వెళ్తున్నాను అని అంటుంది. ఆ మాటలకు వెంటనే రాజ్, షాక్ అవుతాడు.

రేపటి ఎపిసోడ్లో కావ్య వాళ్ళ ఇంటికి రాజ్, భాస్కర్ కావ్య ముగ్గురు వెళ్తారు కనకంభాస్కర్ కి కావ్యకు హారతి ఇవ్వబోతుంటే మధ్యలో వచ్చి రాజ్ అదేంటి వాళ్ళిద్దరికీ హారతిస్తున్నారు అని అంటే, అల్లుడే కదా అని అంటుంది కనుక అల్లుడు కాదు మేనల్లుడు అని అంటాడు రాజ్ ఇక రాజ్ లగేజీ తీసుకొని లోపలికి వస్తుంటే మీరు కాఫీ తాగి వెళ్తారు అనుకున్నాము అని అంటుంది కనుకమ్,ఓహో వీళ్ళు నేను రారని బాగా ఫిక్స్ అయినట్టున్నారు.అని అనుకుంటాడు రాజ్ మనసు లో, నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు.

author avatar
bharani jella

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella