NewsOrbit
Entertainment News Telugu TV Serials న్యూస్ సినిమా

Brahmamudi March 5 2024 Episode 349: కనకంపై రాజ్ ఫైర్.. అత్తారింట్లో అల్లుడు ఫ్రస్టేషన్.. ముక్కలవ్వబోతున్న దుగ్గిరాల ఫ్యామిలీ..

Brahmamudi Today Episode March 5 2024 Episode 349 Highlights

Brahmamudi March 5 2024 Episode 349:  సుభాష్,ప్రకాశాన్ని తిట్టడంతో ధాన్యం ప్రకాష్ అన్ని తిట్టడానికి వీల్లేదని అంటుంది. 50 లక్షల నష్టం వస్తే ఇలా మాట్లాడతారా సర్ది చెప్పాలి కానీ అని ధాన్యం అనడంతో సుభాష్ తనకి సారీ చెప్పి అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తాడు. ఇక సుభాష్ కళ్లనిండా నీళ్లతో అల్లాడిపోతూ ఉంటాడు. ఇక ప్రకాశం దగ్గరికి వచ్చి అన్నయ్య అనగానే కళ్ళు తుడుచుకొని ఏంటో చెప్పు అంటాడు ఇక నాకు మతిమరుపు అయితే ఉంది గాని కళ్ళు బానే కనిపిస్తున్నాయి అని అంటాడు నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు అన్నయ్య అంటాడు ధాన్యం అన్న మన మాటలకు నేను క్షమించమని అడుగుతాను అన్నయ్య అంటాడు. ఇక వెంటనే దయచేసి నన్ను క్షమించు అని కూడా అంటాడు ప్రకాశం.

Brahmamudi Today Episode March 5 2024 Episode 349  Highlights
Brahmamudi Today Episode March 5 2024 Episode 349 Highlights

నువ్వెందుకు అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు సరిగ్గా ఆలోచిస్తే ధాన్యం మన మాటల్లో తప్పేం లేదు ఇన్నాళ్లు నా తమ్ముడే కదా ఏం మాట్లాడినా పర్వాలేదులే అనుకున్నాను కానీ ఈ రోజే తెలిసింది నీకు కూడా ఒక మనసు ఉంటుందని దానిని తక్కువ చేస్తున్నానని చిన్నప్పటి నుంచి నీకు మతిమరుపు అన్న విషయం నాకు అలవాటైపోయింది అది ఒక లోపం అన్న సంగతి మర్చిపోయాను నా తమ్ముణ్ణి అన్నిట్లో గొప్పగా చూడాలని అనుకున్నాను తప్ప ఎవరు వాడిని వేలెత్తి చూపించకూడదు అందుకే నువ్వు తప్పు చేస్తే నీలో ఉన్న లోపాన్ని కూడా మర్చిపోయి నిన్ను నేను తిట్టేవాన్ని అది ఎంత పెద్ద తప్పు నాకు ఈరోజు అర్థమైంది నువ్వే నన్ను క్షమించు తమ్ముడు అని అంటాడు సుభాష్ ఎమోషనల్ గా, ఇక మనిషిలో లోపం చూసేవాడు పరాయివాడు ఏమన్నా భరించి పక్కనే ఉండేవాడు మనవాడు ఇన్ని రోజులు అలానే తోడుగా ఉన్నాను ఇప్పుడు ఇలా మాట్లాడినను పరాయి వాడిని చేయొద్దు అన్నయ్య ఇన్నాళ్లు నాకు ఎప్పుడు ఎక్కడ భయం వేసేది కాదు ఎందుకంటే నాకు ఏం జరిగినా నువ్వు ఉంటావని ధైర్యం అన్నయ్య కానీ ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడి నాలో ఉన్న ధైర్యాన్ని చంపేయొద్దు అన్నయ్యా అని సుభాషిని హగ్ చేసుకుంటాడు ప్రకాశం ఇక అక్కడైతే ఎమోషనల్సీన్ మామూలుగా ఉండదు.

Brahmamudi Today Episode March 5 2024 Episode 349  Highlights
Brahmamudi Today Episode March 5 2024 Episode 349 Highlights

ఇక తనకు మీ ఇంట్లో కావ్య, భాస్కర్ క్యారం బోర్డ్ గేమ్ ఆడాలని అనుకుంటారు. అక్క ఏం చేస్తున్నావు అంటుంది రాజ్ గది దగ్గరికి, రాజ్ కి వినిపించేలా అని అడుగుతుంది అప్పు ఇక వెంటనే అప్పు రా మనం క్యారమ్స్ ఆడదాం అని అంటుంది కావ్య. ఇక రాజ్ కూడా బయటికి వస్తాడు ఇక అందరూ క్యారం బోర్డు దగ్గరికి వచ్చి కూర్చుంటారు. రాజ్ దూరంగా నిలబడి చూస్తూ ఉంటాడు. కావ్య నేను మా బావ ఒకటి అని అంటుంది. వెంటనే రాజ్ వచ్చి అంత లేదు నువ్వు అప్పు ఒకటి నేను మీ బావ ఒకటి టీమ్ అంటాడు. ఇక ఇప్పుడు ఆడదామా ఆట అని అంటాడు రాజ్. ఇక అందరూ క్యారమ్స్ ఆడుతూ ఉంటారు కాయిన్స్ పడుతూ ఉన్న ప్రతిసారి కావ్య కాయిన్ వేయగానే వెంటనే బావ పైకి లేచి చప్పట్లు కొట్టి కావే కాయిన్ వేసింది చూడండి అంటూ మురిసిపోతూ ఉంటాడు. ఇక కావ్య ప్రతిసారి ఆడగానే పొగుడుతూ ఉంటాడు భాస్కర్ ఇక రాజ్ మాత్రం కాయం వేస్తే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు ఇక రాజకీయ కోపం వస్తుంది నేను నువ్వు ఒకటి మన విషయం మర్చిపోయావా అని అంటాడు నువ్వు నేనే టీంలో ఉన్నా కానీ నా మరదలు గెలవాలి అనుకుంటాను అని అంటాడు భాస్కర్. అసలు తనని గెలిపించడం కోసమే నేను ఈ ఆట ఆడుతున్నాను అన్నట్లుగా మాట్లాడుతాడు ఇక గేమ్ లో చివరికి భాస్కర్ దగ్గర ఉండి కావ్యని గెలిపిస్తాడు. ఇక నాకు ఈ గేమ్ అసలు నచ్చలేదు అని చెప్పి రాజ్ లోపలికి వెళ్ళిపోతాడు.

Brahmamudi Today Episode March 5 2024 Episode 349  Highlights
Brahmamudi Today Episode March 5 2024 Episode 349 Highlights

రాజ్ లోపలికి వెళ్లి తలుపు వేసుకొని అక్కడే ఉన్న కావ్య డిజైన్స్ చూసి వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని ఆ డిజైన్స్ మీద ఇంకు పోస్తాడు. ఆ డిజైన్స్ చూసి ఇప్పుడు ఎలా ఆడతారు నేను చూస్తాను అని బయటికి వచ్చి ఏమీ తెలియనట్టు కళావతి నా కాఫీ తీసుకురా అని అంటాడు వెంటనే కళావతి లేవబోతుంటే కనకం వచ్చి నేను ఇస్తా లేమా నువ్వు బావతో ఆడుకో అని అంటుంది ఇక ఆ టైంలో కనకం రాజ్ దగ్గరికి వచ్చి మీకు టీ స్ట్రాంగ్ గా కావాలా లైట్ గా కావాలా అని అంటుంది వెంటనే కనకాన్ని గట్టిగా పీక పట్టుకొని పిసికేస్తాడు రాజ్,కనకం కెవ్వు మని అరుస్తుంది. ఇదంతా రాజ్ కలగంటాడు. ఇక బాబు మిమ్మల్ని అడుగుతుంది మీకు టీ ఎలా పెట్టాలో చెప్పలేదు అని అంటే ఎలాగోలా పెట్టి తగలట్టండి అని అంటాడు రాజ్. ఎలాగైనా కళావతి ఆడకుండా చేద్దామంటే ఎలాగా కుదరట్లేదు అని ఆలోచిస్తూ ఇక ఫోన్ చూసుకుంటున్నట్లుగా నటిస్తూ కళావతి క్లైంట్స్ మెసేజ్ చేశారు నువ్వు వేసిన డిజైన్స్ తీసుకురాపో అని అంటాడు. వెళ్ళాక లేకపోతే చంపేసేలా ఉన్నాడు బావ అని అంటుంది అప్పు అవును నువ్వు వెళ్లకపోతే ఈ క్యారం బోర్డుని నా తలం పగలగొట్టేలా ఉన్నాడు వెళ్ళు అని అంటాడు భాస్కర్. ఇక డిజైన్స్ తీసుకొద్దామని లోపలికి వెళ్తుంది కళావతి. వాటి నిండా ఇంకుబడి ఉంటాయి అవన్నీ పాడైపోవడం చూసి ఇదేంటి నేను ఈ లోపలికి పెట్టినప్పుడు బానే ఉన్నాయి కదా ఈలోపే ఇలా పాడయ్యాయి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అంతలో రాజ్ కావాలని లోపలికి వచ్చి ఏంటి కళావతి ఇంత లేటు అవతల క్లైంట్స్ మెసేజ్ చేస్తున్నారు డిజైన్స్ పంపించమని తొందరగా ఇవ్వు అని అంటాడు అది అని అంటుంది కావ్య ఏంటి నసుకుతున్నావ్, డిజైన్స్ ఎక్కడ పెట్టావు అని అంటే కావ్య ఏం సమాధానం చెప్పకుండా నస్కుతూ ఉంటుంది ఇక వెంటనే రాజ్ లింకు పడిందా అని అంటాడు మీకు ఎలా తెలుసు అని అంటుంది కావ్య. నీలాంటి వాళ్ళందరూ ఎలాంటి సాకులు చెప్తారో నాకు తెలుసులే అని అంటాడు ముందు సాకులు చెప్పకుండా డిజైన్స్ బయటకి తీ అని అంటాడు రాజ్ తప్పక బయటికి తీసి వాటిని చూపిస్తూ నేను బానే గీశానండి కానీ ఇంకెలా పడిందో అర్థం కావట్లేదు

Brahmamudi Today Episode March 5 2024 Episode 349  Highlights
Brahmamudi Today Episode March 5 2024 Episode 349 Highlights

అని అంటే మళ్ళీ డిజైన్స్ వెయ్యి అందులో ఏముంది 12 గంటలు కష్టపడి గీసానండి అని అంటుంది కావ్య ఇప్పుడు మళ్లీ డియ్యాల అని ఆశ్చర్యపోతూ ఉంటుంది వెంటనే నువ్వేం బాధపడకు బుజ్జి అని ఎంట్రీ ఇస్తాడు బావ. దేనికి నువ్వు గీసి పెడతావా అని అంటాడు రాజ్ లేదు అన్నయ్య, మా బుజ్జి గీసిన డిజైన్స్ అన్ని నేను ముందే ఫోటో తీసేసాను. ఎందుకైనా మంచిది అని అప్పుడు ఆ డిజైన్స్ అని నా ఫోన్లో ఉన్నాయి అని అంటాడు. ఇక ఆ మాటలకు రాజకీయ బాగా కోపం వస్తుంది ఒరే బావ నిన్న అసలేం చేయాలి రా అని మనసులో రగిలిపోతూ ఉంటాడు ఇక కావ్య మాత్రం బాగా నువ్వు సూపర్ నువ్వు తోపు థాంక్స్ బావ నీకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయి అని పొగుడుతూ ఉంటుంది. ఇక మన చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉన్నాయి బుజ్జి కదా అవన్నీ ఆడుకుందాం అని అంటే ఇక రాజ్ కి చెప్పకుండా కావ్య బయటకు వెళ్ళిపోతుంది ఇక పెళ్లయిన ఆడవాళ్లు మొగుడుతో తప్ప ఇంకెవరితోనో ఆడకూడదని ప్రభుత్వం జీవోలు పాస్ చేయాలి అని రాజ్ మనసులో అనుకుంటాడు.

Brahmamudi Today Episode March 5 2024 Episode 349  Highlights
Brahmamudi Today Episode March 5 2024 Episode 349 Highlights

ఇక ఇందిరా దేవి దగ్గరికి వచ్చిన అపర్ణ మీకు ఒక విషయం చెప్పాలి అత్తయ్య అని అంటుంది. ఏంటో చెప్పు అని అంటుంది. ధాన్యంలో చాలా మార్పు వచ్చింది ఇందాక బావగారు అని కూడా చూడకుండా నా భర్తని అవమానించింది ప్రకాశం గురించి అందరికీ తెలిసిందే తనని మందలించబోతుంటే ధాన్యం అడ్డుపడి ఎందుకు నా భర్తని ఇలా అంటున్నారని గొడవ పెట్టుకుంది ఇక ధాన్యం ఎందుకు ఇలా మారిపోతుంది అని ఇందిరా దేవి ఉంటుంది మీరు కొంచెం ఆలోచించి దృష్టి పెట్టాల అత్తయ్య లేదంటే మన ఉమ్మడి కుటుంబం ధాన్యం కారణంగా విడిపోతుంది ఏమో అని నాకు భయంగా ఉంది మీరు ముందే జాగ్రత్త పడండి అంటూ అత్తగారికి సలహా చెప్తుంది అపర్ణాదేవి దాంతో ఇందిరాదేవి ధాన్యం కి ఎలా చెప్పాలీ అని ఆలోచనలో పడుతుంది.

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N