NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli NIndu Jabili March 13 2024 Episode 596: మల్లి ని అనుమానిస్తున్న కౌసల్య, మంచి పొజిషన్ కి రావాలని గౌతమ్ ని ఆశీర్వదించిన మల్లి..

Malli NIndu Jabili Today Episode March 13 2024 Episode 596 highlights

Malli NIndu Jabili March 13 2024 Episode 596: ఆ అబ్బాయి రేపు వస్తానన్నాడు కదా అతిధి మర్యాదలు చేసి గౌరవించాలి అని వసుంధర అంటుంది. వాడొక ఇడియట్ వాడి గురించి నా ముందు మాట్లాడకండి అని మాలిని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, మల్లి తన రూమ్ అంతా మల్లెపూలతో బెడ్ నిండా రోజు మల్లెపూలతో అలంకరిస్తుంది. ఇంతలో గౌతమ్ వెనకనుంచి వచ్చి తనని వాటేసుకుంటాడు. ఏంటి అలా చూస్తున్నారు అని మల్లి అడుగుతుంది. ఇదంతా చేసింది నువ్వేనా అని గౌతమ్ అంటాడు. నేను కాక ఇంకెవరైనా కనపడుతున్నారా మీకు అని మల్లి అంటుంది. ఇదంతా కల నిజమా అన్నట్టుగా ఉంది అని గౌతమ్ అంటాడు. ఇదంతా కల కాదు నిజమే అని మల్లి అంటుంది. పెళ్లిరోజు నాడు నాకు కొత్త బట్టలు తీసుకురావడం మన రూమ్ అంతా ఇలా అందంగా డెకరేసన్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది మల్లి అని గౌతమ్ అంటాడు. ముందు మీరు వెళ్లి స్నానం చేసి రండి అని మల్లి అంటుంది. గౌతమ్ వెళ్లి స్నానం చేసి రెడీ  అవుతూ ఉంటాడు.

Malli NIndu Jabili Today Episode March 13 2024 Episode 596 highlights
Malli NIndu Jabili Today Episode March 13 2024 Episode 596 highlights

ఇంతలో కౌసల్య వచ్చి గౌతమ్ ఈరోజు ఉదయం నుంచి ఏం జరుగుతుంది రా అని అడుగుతుంది. మల్లి పూర్తిగా మారిపోయింది అమ్మ మనకు మొదట పరిచయమైన మల్లి ఎలా ఉందో ఈరోజు అలాగే ఉంది అని గౌతమ్ అంటాడు. నాకైతే నమ్మాలనిపించడం లేదు ఒకసారి నమ్మి రోడ్డున పడ్డాం జాగ్రత్తగా ఉండు అని కౌసల్య అంటుంది. అమ్మ నాతో పిల్లల్ని కనడానికి సిద్ధపడింది అమ్మ ఇంకా ఎందుకు అనుమానించాలి అని గౌతమ్ అంటాడు. సముద్రం లోతు ఎంత ఉందని అంచనా వేయచ్చు కానీ మల్లి మనసులో ఏముందో శాస్త్రవేత్తలు కూడా అంచనా వేయలేరు అని కౌసల్య అంటుంది. మేమిద్దరం సంతోషంగా ఉండడం నీకు ఇష్టమే కదా అని గౌతమ్ అంటాడు. ఆ మల్లి మీరా నమ్మకాన్ని పోగొట్టుకుంటారు అని కౌసల్య అంటుంది.

Malli NIndu Jabili Today Episode March 13 2024 Episode 596 highlights
Malli NIndu Jabili Today Episode March 13 2024 Episode 596 highlights

మల్లి మట్టిలో మాణిక్యం అని ఒకప్పుడు అంటూ ఉండే దానివి కదా అదే నమ్మకం మీద ఉండు అలా కాకపోయినా నన్నైనా నమ్ము అని గౌతమ్ అంటాడు. నేను చెప్పాల్సింది చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం అని కౌసల్య పోతుంది. కట్ చేస్తే, మీరా మల్లి కి ఫోన్ చేస్తుంది. గౌతమ్ ఉన్న రూమ్ కి డోర్ పెట్టి కౌసల్య ఫోను ఎత్తుతుంది. మల్లి నీకు ఈ విషయం తెలుసా మాలిని అమ్మ ఆత్మహత్య చేసుకోబోతుండగా ఒక అబ్బాయి కాపాడాడు తను చచ్చిపోతానని లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయింది ఎవరో అబ్బాయి వాళ్ళ బతికిపోయిందమ్మ అని మీరా అంటుంది. చచ్చిపోయిన బాగుండేది పీడ విరగడ అయిపోయేది నేనైతే అదే కోరుకుంటున్నాను అని కౌసల్య అంటుంది. భర్తని బిడ్డని కోల్పోయిన ఆడది మనసుకు సరిది చెప్పుకోలేక అట్లాగే ఉంటుంది అమ్మ అని మరా అంటుంది. నీ దగ్గర నుంచి నీతులు నీ కూతురు దగ్గర నుంచి బుద్ధులు నేర్చుకోవాలి మరి అని కౌసల్య అంటుంది. నేనేమన్నానమ్మ అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని మీరా అంటుంది.

Malli NIndu Jabili Today Episode March 13 2024 Episode 596 highlights
Malli NIndu Jabili Today Episode March 13 2024 Episode 596 highlights

వాళ్ల పెళ్లి రోజు నాడు చావు కబురు చెప్పాలనుకుంటున్నావా వాళ్లను సంతోషంగా ఉండని అని కౌసల్య అంటుంది. వాళ్ల సంతోషమే కదా మనకు కావాలి అని మీరా అంటుంది. అలాంటప్పుడు ఈ అర్ధరాత్రి ఎందుకు ఫోన్ చేశావు అని కౌసల్య ఫోన్ కట్ చేస్తుంది. కట్ చేస్తే, గౌతమ్ మల్లి దగ్గరికి వచ్చి వావ్ అచ్చం శోభనం గది లాగే ఉంది డెకరేషన్ అదుర్స్ పాల గ్లాస్ కూడా ఉంటే బాగుండేది అని అంటాడు. మల్లి సిగ్గుపడుతుంది. మల్లి గౌతమ్ ఎత్తుకొని గిరగిరా తిప్పి కిందికి దించి మన మొదటి పెళ్లి రోజుని ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసినందుకు చాలా థాంక్స్ అని గౌతమ్ మోకాళ్ళ మీద కూర్చొని నాకు పిల్లలు కావాలి నా కోరికను తీరుస్తున్నందుకు నీకు ఏదో ఒకటి ఇవ్వాలి ఏదైనా కోరిక కోరుకో అలాగని పెద్దపెద్ద కోరికలు కోరుకోకు నా రేంజ్ లో కోరుకో అని గౌతమ్ అంటాడు. మీకు ఇంతకుముందు సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఇంతకుముందు లాగే మీరు గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను అని ఆశీర్వదిస్తుంది మల్లి. దేవత గారు ఆశీర్వదించడం అయింది ఇక భార్యగారు ఏం వరం కావాలో కోరుకోండి అని గౌతమ్ అంటాడు.

Malli NIndu Jabili Today Episode March 13 2024 Episode 596 highlights
Malli NIndu Jabili Today Episode March 13 2024 Episode 596 highlights

ముందు మీరు పైకి లేవండి అని గౌతమ్ ని పైకి లేపుతుంది మల్లి. మొదటి పెళ్లి రోజు కానుకగా ఏం కావాలో కోరుకోండి శ్రీమతి గారు అని గౌతమ్ అంటాడు. డైమండ్ నెక్లెస్ కొనివ్వండి అని మల్లి అంటుంది. నేను మంచి పొజిషన్ కి వచ్చేంతవరకు అలాంటి కోరికలు వాయిదా వేయండి శ్రీమతి గారు అని గౌతమ్ అంటాడు. నాకు ఏ నగలు అక్కరలేదు జీవితాంతం ఇలా నీ ప్రేమ ఎప్పటికీ ఉంటుందని చెప్పండి చాలు అదే నాకు పెద్ద బహుమతి అని మల్లి అంటుంది. ఒక గంట చిరాకు పడడం ఒక గంట ప్రేమగా ఉండడం లాంటిది చేయకండి ఇప్పుడు ప్రేమగా ఎలా ఉన్నారో అలాగే ఉండండి అని మల్లి అంటుంది. ఇకమీదట నుంచి అలా ఉండాల్సిన అవసరం లేదు అన్నిటికి నువ్వు ఒప్పుకున్నావు కదా అని గౌతమ్ అంటాడు. గౌతమ్ మల్లి నీ పట్టుకోబోతూ ఉండగా పరిగెత్తుతుంది. పరిగెత్తుతున్న మల్లిని గౌతమ్ పట్టుకొని గట్టిగా కౌట్లో బంధించి మంచం మీద కూర్చోబెడతాడు. అలా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ మంచంలో వాలిపోతారు.

Malli NIndu Jabili Today Episode March 13 2024 Episode 596 highlights
Malli NIndu Jabili Today Episode March 13 2024 Episode 596 highlights

కట్ చేస్తే,  మాలిని అరవింద్ ల ఫోటో కింద పడుతుంది. మాలిని దిగ్గున లేచి ఆ ఫోటోని తీసుకొని బాధపడుతుంది. నువ్వు అన్న మాటలు నిజం చేసి వెళ్లిపోయినను నరకంలో నెట్టేసావు కదా అరవింద్ అంతకంటే నువ్వు ఉండి నన్ను రోజు బాధ పెట్టిన బాగుండేది అని మాలిని అంటుంది. మాలిని అన్నట్టు వినపడుతుంది అరవింద్ వచ్చాడేమో అని కంగారుపడుతూ రూమంతా చూస్తుంది మాలిని తను కనిపించకపోయేసరికి ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావ్ మల్లి అన్నట్టు నువ్వు నిజంగా బ్రతికి ఉంటే నా కళ్ళ ముందుకు రా అని తన ఫోటో పట్టుకొని బాధపడుతుంది. కట్ చేస్తే, ఇంతలో తెల్లవారుతుంది మల్లికి మెలకువ వస్తుంది లేచి నిద్ర మాత్రల బాటిల్ పట్టుకుంటుంది మల్లి.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri