NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Mansoor Ali Khan: మన్సూర్ ను క్షమించేసిన త్రిష .. వివాదానికి తెర

Mansoor Ali Khan: గత కొద్ది రోజులుగా మన్సూర్ ఆలీఖాన్, త్రిష మధ్య నెలకొన్న వివాదానికి పురిస్టాప్ పడింది. కోలీవుడ్ నటుడు మన్సూర్ ఆలీఖాన్ .. నటి త్రిష గురించి చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. త్రిష పై చేసిన వ్యాఖ్యలకు తాను క్షమాపణ చెప్పనని మన్సూర్ అనడంతో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, నటి ఖుష్బూ తీవ్రంగా స్పందించారు. త్రిషపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణిస్తూ సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశించడంతో మన్సూర్ పై చెన్నై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

దీనిపై పలువురు నటులు కూడా స్పందించారు. మన్సూర్ ఆలీఖాన్ వ్యాఖ్యలను ఖండించారు. ఈ నేపథ్యంలో  మన్సూర్ ఆలీఖాన్ వెనక్కు తగ్గి త్రిషకు క్షమాపణ తెలుపడంతో వివాదానికి తెరపడినట్లు అయ్యింది. త్రిషపై తనకు ఎలాంటి దురుద్దేశాలు లేవనీ, ఆమె పెళ్లికి వెళ్లి మంగళ సూత్రం సైతం ఇచ్చి ఆశీర్వదిస్తానని మన్సూర్ పేర్కొన్నారు. దీనిపై ఆయన పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై త్రిష కూడా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. తప్పులు మానవ సహజం, క్షమ అనేది దైవత్యం వంటిది, అత్యుత్తమైనది అంటూ ఎక్స్ లో ట్వీట్ చేసారు త్రిష. దీంతో ఈ వివాదానికి తెరపడినట్లు అవుతోంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మన్సూర్ ఆలీఖాన్ మాట్లాడుతూ.. కేరీర్ ఆరంభం నుండి ఇప్పటి వరకూ తాను ఎన్నో రేప్ సీన్స్ లో నటించాననీ, లియోలో ఆఫర్ వచ్చిన సమయంలో త్రిషతోనూ అలాంటి సీన్ చేసే అవకాశం ఉందనుకున్నానని అలా లేకపోవడం తనను ఎంతో బాధించిందని అన్నారు. మన్సూర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుష్పూ .. సినిమాలో పోషించిన పాత్రలనే నిజ జీవితంలోనూ మన్సూర్ ఫాలో అవుతున్నట్లు ఉన్నారని, ఆయనను చూస్తుంటే సిగ్గుగా అనిపిస్తొందని వ్యాఖ్యానించారు. దీనిపై మన్సూర్ ఆలీఖాన్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం, ఇతర నటులు స్పందించడంతో ఆయన దిగివచ్చారు. మన్సూర్ తాజా స్టేట్ మెంట్ కు త్రిష కూడా స్పందించడంతో ఈ వివాదానికి తెరపడినట్లు అయ్యింది.

Barrelakka Sirisha: బర్రెలక్క పిటీషన్ తో స్వతంత్ర అభ్యర్ధుల భద్రతపైనా కీలక ఆదేశాలు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

Brahmamudi March 1 2024 Episode 346: ఇందిరా దేవి సూపర్ ప్లాన్..? భాస్కర్ మీద కోపంతో కళావతి ఇంటికి రాజ్.. అప్పు సలహా..?

bharani jella

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

Nuvvu Nenu Prema march1 2024 Episode 560: భర్తలతో భార్యలకు తినిపించిన విక్కి ఫ్యామిలీ.. అరవిందను అక్కా అని పిలిచిన దివ్య

bharani jella

జెండా ఎగురుతుంది.. కానీ కొత్త డౌట్లు మొద‌ల‌య్యాయ్‌…!

ప‌వ‌న్ – చంద్ర‌బాబు న‌యా స్కెచ్ వెన‌క అస‌లు ప్లాన్ ఇదే..!

విశాఖ సిటీ పాలిటిక్స్ ఓవ‌ర్ వ్యూ ఇదే… ఎవ‌రు స్వింగ్‌.. ఎవ‌రు డౌన్‌…!

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

CM YS Jagan: అమరావతి రాజధాని ప్రాంత నిరుపేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. వారి ఫించన్ ఇక రెట్టింపు

sharma somaraju

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Mudragada Padmanabham: పవన్ కళ్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ.. విషయం ఏమిటంటే..?

sharma somaraju