NewsOrbit
Entertainment News సినిమా

Hai Nani: విజయ్ దేవరకొండ, రష్మిక ఫోటో వివాదంపై స్పందించిన నాని..!!

Hai Nani: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో త్వరలో ఓ జంట పెళ్లితో ఒకటి కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ జంట మరి ఎవరో కాదు విజయ్ దేవరకొండ, రష్మిక మందన. వీరిద్దరూ కలిసి అనేక సినిమాలు చేయడం జరిగింది. ఫస్ట్ టైం “గీతాగోవిందం” సినిమాతో ఈ జంట ప్రేక్షకులను అలరించడం జరిగింది. ఆ తర్వాత పలు సినిమాలు చేయడం జరిగింది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అంతేకాదు చాలా సందర్భాలలో రష్మిక మందన.. విజయ్ దేవరకొండ ఔట్ డోర్ వెళ్లినట్లు పలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది.

Nani reacts on Vijay Devarakonda and Rashmika photo controversy

ఇదిలా ఉంటే నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా హాయ్ నాని డిసెంబర్ 7వ తారీఖున విడుదల కాబోతోంది. ఈ సినిమాలో సీతారాం ఫేం మృణాల్ థాకూర్ నాని హీరోయిన్ గా చేయడం జరిగింది. శౌర్యవ్ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారు. ఫ్యామిలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటుడు జయరామ్ కీలక పాత్ర పోషించారు. తెలుగుతోపాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నవంబర్ 29వ తారీకు ఆర్కే బీచ్ వద్ద ఉన్న గోకుల్ పార్క్ లో జరిగింది. అయితే ఈ వేడుకలో సినిమాకి ఎలాంటి సంబంధం లేని విజయ్ దేవరకొండ మరియు రష్మిక ఫోటోలు స్క్రీన్ పై రావడం చర్చకు దారి తీసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Nani reacts on Vijay Devarakonda and Rashmika photo controversy

ఈ ఘటన పట్ల విజయ్ దేవరకొండ అభిమానులు సినిమా మేకర్స్ పై ఈవెంట్ నిర్వాహకులపై సీరియస్ కామెంట్లు చేయడం జరిగింది. ఈ క్రమంలో న్యాచురల్ స్టార్ నాని ఈ గొడవ పై తాజాగా స్పందించారు. విజయ్ దేవరకొండ రష్మిక మందన ఫోటోలు చూసి మేము కూడా షాక్ అయ్యాం. అటువంటి ఈవెంట్స్ కోసం ఎంతోమంది వర్క్ చేస్తుంటారు. అయితే ఇండస్ట్రీలో మేమంతా స్నేహితులమే.. సినిమా ప్రమోషన్స్ లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని.. వాళ్లకు కూడా తెలుసు. అయితే ఆ పరిస్థితి వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే నాతో పాటు సినిమా మేకర్స్ అంతా క్షమాపణలు చెబుతున్నామంటూ నాని ఇటీవల వివరణ ఇచ్చారు. తండ్రి కుమార్తెల సెంటిమెంట్ నేపథ్యంలో “హాయ్ నాని” సినిమా తెరకెక్కింది.

Related posts

Nuvvu Nenu Prema march1 2024 Episode 560: భర్తలతో భార్యలకు తినిపించిన విక్కి ఫ్యామిలీ.. అరవిందను అక్కా అని పిలిచిన దివ్య

bharani jella

Sunflower 2: సన్ఫ్లవర్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను వెల్లడించిన అదా శర్మ.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

sekhar

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నే ఢీ కొడుతున్న సాయి పల్లవి.. డార్లింగ్ పరువు మొత్తం పోయింది గా..!

Saranya Koduri

Kalki 2898 AD: చిక్కుల్లో పడ్డ కల్కి మూవీ.. టెన్షన్ లో డార్లింగ్ ఫ్యాన్స్..!

Saranya Koduri

Tantra trailer: దడ పుట్టిస్తున్న ” తంత్ర ” మూవీ ట్రైలర్… యూట్యూబ్లో టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Premalu: ” ప్రేమలు ” మూవీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సమస్త..!

Saranya Koduri

Nithya Menon: ఆడదాని ఉసురుతో అడ్రస్ లేకుండా పోయిన తెలుగు డైరెక్టర్.. నిత్యామీనన్ శాపనార్ధాలు బానే పనిచేసాయిగా..!

Saranya Koduri