NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam: భాగమతికి గోరింటాకు పెట్టిన అమరేంద్ర, భాగమతిని గదిలో పెట్టి డోర్ పెట్టిన మనోహరి..

Nindu Noorella Saavasam Today Episode February 24 2024 Episode 168 Highlights

Nindu Noorella Saavasam అక్క చెల్లెలు ఒకే దగ్గర చేరారు అన్నమాట అని మనోహరి అంటుంది. ఈ పెళ్లితో భాగిని వాళ్ళ ఇంటికి పంపిస్తా అరుంధతిని ఘోరకి పట్టిస్తా ఇద్దరి పీడా ఒకేసారి విరగడైపోతుంది అని మనోహరి అంటుంది. కట్ చేస్తే, అక్క మీరెప్పుడొచ్చారు అని భాగమతి అడుగుతుంది. నేను ఇందాకే వచ్చాను మీసమ్మ కానీ నగలు ఏంటి ఇలా బయటపెట్టి నువ్వు వాష్ రూమ్ లోకి వెళ్తే కనీసం డోరైన వేసుకోవాలి కదా అని అరుంధతి అంటుంది. ఇంట్లోకి ఎవరు వచ్చి దొంగతనం చేస్తారు అక్క అని భాగమతి అంటుంది. నాలాంటి వాళ్లు వచ్చి కొట్టేస్తే ఎవరిని అడుగుతావు అని అరుంధతి అంటుంది.  అందుకే జాగ్రత్తగా నగలు దాచి పెట్టుకో ఇంకెప్పుడు ఇలా బయట పెట్టకు అని అరుంధతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode February 24 2024 Episode 168 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 24 2024 Episode 168 Highlights

సరే అక్క నువ్వు చెప్పావు కదా ఇక మీదట నుంచి జాగ్రత్తగానే ఉంచుకుంటాను అని భాగమతి అంటుంది. మిస్సమ్మ నువ్వు ఆర్జీ భాగి గా వర్క్ చేశావు కదా అని అరుంధతి అంటుంది. నీకెలా తెలుసు అక్క అని భాగమతి అడుగుతుంది.నువ్వు అవార్డు తీసుకునేటప్పుడు టీవీలో వచ్చింది కదా అప్పుడు చూశాను ఒకసారి అలా మళ్లీ మాట్లాడవా అని అరుంధతి అంటుంది. భాగమతి మాట్లాడగానే ఎంత బాగా మాట్లాడవు మిస్సమ్మ ఎంత బాగుందో నీ వాయిస్ అని మురిసిపోతుంది అరుంధతి. అక్క నీ వాయిస్ వింటుంటే మనం ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుకున్నామా నాకు అలాగే అనిపిస్తుంది అని భాగమతి అంటుంది. రోజు నీతో మాట్లాడుతున్నాను కదా అలా అనిపించిందేమో పద కింద గోరింటాకు రుబ్బుతున్నారు అని అరుంధతి వెళ్తుంది.రాథోడ్ నీరసపడుతూ గోరింటాకు  రుబ్బుతూ ఉంటాడు.

Nindu Noorella Saavasam Today Episode February 24 2024 Episode 168 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 24 2024 Episode 168 Highlights

రాథోడ్ ఏంటయ్యా ఇంత నీరసంగా రుబ్బుతున్నావ్ గోరింటాకే రుబ్బ లేని వాడివి ఇక దేశాన్ని ఏం కాపాడుతావయ్యా అని నిర్మల అంటుంది. గోరింటాకు రుబ్బడానికి దేశాన్ని కాపాడడానికి ఏమైనా సంబంధం ఉందా అమ్మ అని రాథోడ్ అంటాడు. రాథోడ్ వల్ల కాదు కానీ నన్ను రుబ్బా మంటావా  అని శివరామ్ అంటాడు. మీరు పది నిమిషాల రూబీ 10 రోజులు మంచాన పడతారు అవసరం అంటారా మీరు గమ్మున ఉండండి నా కొడుకు ఒక పట్టు పడతాడు అని నిర్మల అంటుంది.  ఏంటమ్మా గారు సార్ పొజిషన్ ఏంటి మీరు మాట్లాడుతున్న మాట ఏంటి సార్ గోరకు రుబ్బడమేంటి అని రాథోడ్ అంటాడు.  అయ్యో రాథోడ్ మా అమ్మ కోసం మా డాడీ గోరింటాకు రుబ్బేవాడు అని అమృత అంటుంది. అమరేంద్ర వచ్చి రుబ్బు నాన్న అని నిర్మల అంటుంది. డాడీ మమ్మీ కోసం నువ్వు గోరింటాకు రుబ్బే వాడివి అంటే వీళ్ళు నమ్మట్లేదు వచ్చి రుబ్బండి అని అంజలి అంటుంది. అమరేంద్ర గోరింటాకు రుబ్బుతూ అరుంధతితో కలిసి ఉన్న రోజు గుర్తుకు తెచ్చుకుంటాడు.

Nindu Noorella Saavasam Today Episode February 24 2024 Episode 168 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 24 2024 Episode 168 Highlights

అమరేంద్ర గోరింటాకు రుబ్బుతాడు. కట్ చేస్తే,డాడీ గోరింటాకు నువ్వే మాకు పెట్టాలి అని అమృత అంటుంది.నాయనమ్మ తో పెట్టించుకోండమ్మా అని అమరేంద్ర అంటాడు. ప్లీజ్ డాడీ మా కోసం పెట్టవా అని పిల్లలు బ్రతిమిలాడుతారు. సరే అని అమరేంద్ర పిల్లలకు గోరింటాకు పెడుతూ ఉంటాడు. అమర్ తో ఎలాగైనా గోరింటాకు పెట్టించుకోవాలని మనోహరి అమర్ నాక్కూడా పెట్టవా అని అడుగుతుంది. పిల్లలకు పెట్టేసరికి లేట్ అవుతుంది మనోహరి నువ్వు అమ్మతో పెట్టించుకో అని అమరేంద్ర అంటాడు. పర్వాలేదా  నేను వెయిట్ చేస్తాను అని మనోహరి అంటుంది. నేను ఖాళీగానే ఉన్నాను కదా మనోహరి రా గోరింటాకు పెడతాను అని నిర్మల మనోహరి కి గోరింటాకు పెడుతుంది. అమర్ తో పెట్టించుకుందామంటే ఈ ముసల్దొక్కటి అని మనోహరి గునుక్కుంటుంది. అందరూ గోరింటాకు పెట్టుకుంటున్నారు కానీ ముఖ్యమైన పర్సన్ మిస్సమ్మ పెట్టుకోలేదేంటి అని శివరామ్ అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode February 24 2024 Episode 168 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 24 2024 Episode 168 Highlights

మనోహరి కి పెట్టడం అయిపోయిన తర్వాత నేను పెడతానండి అని నిర్మల అంటుంది.డాడీ మిస్సమ్మ కూడా నువ్వు పెట్టవా అని అంజలి అంటుంది.వద్దులే అమ్మ నాయనమ్మ పెడుతుంది అని అమరేంద్ర అంటాడు. ప్లీజ్ డాడ్ పెట్టండి అని పిల్లలు రిక్వెస్ట్ చేయడంతో అమరేంద్ర సరే పెడతాను అని భాగమతి దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. సరే పర్వాలేదులే ఏం చేస్తాం తనకు ఎవరూ లేరు కదా అని అరుంధతి అనుకుంటుంది. అమరేంద్ర చెయ్యి చాపుతాడు భాగమతి తన చేతిలో చేయి పెడుతుంది. అమరేంద్ర తన వంక చూడకుండా చెయ్ పట్టుకొని గోరింటాకు పెడతాడు. భాగమతి మాత్రం అమరేంద్రని చూస్తూ ఉంటుంది. అమరేంద్ర గోరింటాకు భాగమతికి పెడతాడు. కట్ చేస్తే, ఇదేంటమ్మా గోరింటాకు పెట్టుకొని 10 నిమిషాలు కూడా ఉంచుకోలేదు ఎలా పండుతుంది అని నీలా అంటుంది. అమర్ తో పెట్టించుకోవాలని నేను ఆశపడితే మధ్యలో ముసలి వచ్చి అంత ప్లాన్ పాడు చేసింది అని మనోహరి అంటుంది. కానీ అమరేంద్రయ్య  మిస్సమ్మ కి గోరింటాకు బాగా పెట్టాడమ్మా అని నీలా అంటుంది.ఈ ఒక్కరోజే కాదే పెళ్లి అయిపోయిన తర్వాత అమర్ దగ్గరికి రానివ్వను అని మనోహరి అంటుంది. అంజలి మాత్రం పెళ్ళికి రాకూడదు అని మనోహరి అంటుంది. మా మిస్సమ్మ అని నెత్తిన పెట్టుకుంటారు కదమ్మా రాకుండా ఎలా ఉంటారు అని నీలా అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode February 24 2024 Episode 168 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 24 2024 Episode 168 Highlights

ఎలాగైనా సరే అంజలి ఇంట్లోనే ఉంచాలి అని మనోహరి అంటుంది.కట్ చేస్తే,ఆకలి వేస్తుంది ఎలా చేతులు కడుక్కుందామా అని భాగమతి ఆలోచించి వద్దులే ఆయన అంత కష్టపడి పెట్టాడు పండకపోతే ఫీల్ అవుతాడు అని ఊరుకుంటుంది. ఆకలి వేస్తుంది నిద్ర పట్టదు నీలా సహాయం తీసుకుందామని భాగమతి బయటికి వచ్చి అటు ఇటు చూస్తూ ఉండగా మనోహరి చూసి ఏంటి మిస్సమ్మ బయటకు వచ్చావు అని అడుగుతుంది. నేనింకా అన్నం తినలేదండి నీలా ని పిలుద్దాము అనుకుంటున్నాను అని భాగమతి అంటుంది. నువ్వు వెళ్ళు మిస్సమ్మ నేను నీలాకు చెప్పి పంపిస్తాను బయట ఉంటే గోరింటాకు దేనికైనా తగిలిపోతుంది అని మనోహరి అంటుంది. భాగమతి లోపలికి వెళ్లి కూర్చుంటుంది. భాగమతిని లోపల ఉంచి మనోహరి డోర్ పెట్టి నా అమర్ తో గోరింటాకు పెట్టించుకుంటావా ఈ నైటు అన్నం లేకుండా పస్తులు ఉండవే అని వెళ్ళిపోతుంది. ఇంకా నీలా రావట్లేదు ఏంటి అని భాగమతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అమరేంద్ర వచ్చి మిస్సమ్మ గదిలో లైట్ వేసింది కానీ డోర్ పెట్టి ఉంది ఏంటి అని డోర్ కొట్టి మిస్సమ్మ ఏంటి బయట గడియ పెట్టారు ఎవరు అని అమరేంద్ర అంటాడు. ఎవరు పెట్టారో తెలియదండి అని భాగమతి అంటుంది. డోర్ తీసి అమరేంద్ర అంతా ఓకేనా అని అడుగుతాడు. అంతా ఓకే నండి అని భాగమతి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella