NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema march1 2024 Episode 560: భర్తలతో భార్యలకు తినిపించిన విక్కి ఫ్యామిలీ.. అరవిందను అక్కా అని పిలిచిన దివ్య

Nuvvu Nenu Prema Today Episode march 1 2024 Episode 560 Highlights

Nuvvu Nenu Prema march 1 2024 Episode 560: పద్మావతి అందరితో కలిసి పిక్నిక్ కి వస్తుంది. రమేష్ చంద్ర చాలా సంతోషంగా ఉంటాడు విక్కీ పిక్నిక్ లో గుర్తుగా ఫోటో తీయమని అడిగితే విక్కీ రమేష్ చంద్ర దివ్యలతో కలిపి ఫోటో తీస్తాడు. ఆ మూమెంట్ రమేష్ చంద్రకి చాలా సంతోషాన్నిస్తుంది ఇక పద్మావతి విక్కి ఏం చేస్తున్నాడు అని వెతుక్కుంటూ వస్తుంది విక్కీ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు ఎక్కడ తండ్రి మీద కోపంతో తను తీసిన ఫోటోని డిలీట్ చేస్తాడు అని భయపడి పద్మావతి విక్కి దగ్గరికి వెళ్లి ఫోన్ కావాలని అడుగుతుంది అందుకు విక్కీ నేను ఇవ్వను అని అంటాడు కావాలంటే నువ్వు ఎవరిదైనా ఫోన్ తీసుకో అని అంటాడు మీరు నా భర్తగా ఉంటే నేను వేరే వాళ్ళ ఫోన్ తీసుకుంటే ఏం బాగుంటుంది అని పద్మావతి విక్కినీ ఫోన్ ఇవ్వమని అడుగుతుంది విక్కి మాత్రం అందుకు ఒప్పుకోడు ఇక పద్మావతి ఎలాగైనా విక్కి నుంచి ఫోన్ తీసుకోవాలని, కాలుకు దెబ్బ తగిలినట్టు యాక్టింగ్ చేస్తుంది అది నమ్మి విక్కి ఏమైంది అని అంటాడు వెంటనే చేతిలో ఉన్న ఫోన్ తీసుకుంటుంది. ఈ ఫోన్ నేను ఎప్పుడు ఇవ్వాలనుకుంటే మీకు అప్పుడు ఇస్తాను అప్పటిదాకా ఇది నా దగ్గరే ఉంటుంది అని చెప్పేసి ఫోన్ తీసుకొని వెళ్ళిపోతుంది పద్మావతి. ఈ ఫోటో మావయ్య గారు చూస్తే ఎంత ఆనందపడతారు అని పద్మావతి విక్కి ఫోన్లో ఉన్న ఫోటోలు చూసి అనుకుంటుంది.

Nuvvu Nenu Prema Today Episode march 1 2024 Episode 560 Highlights
Nuvvu Nenu Prema Today Episode march 1 2024 Episode 560 Highlights

ఇక నారాయణ, రమేష్ చంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు పక్కనే దివ్య కూడా ఉంటుంది ఇక నారాయణ, పద్మావతి నువ్వు అడిగి అడగగానే పిక్నిక్ తీసుకొచ్చింది అన్నయ్య పద్మావతి నిన్ను విక్కిని కూడా కలుపుతుంది అని అంటే నా బాధంతా అది కాదు పద్మావతి ఎలాగైనా నన్ను విక్కి నీ కలుపుతుంది కానీ దివ్య మాత్రం ఇంకా పరాయి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగానే ఫీలవుతుంది దివ్య ఎప్పటికీ మనలో కలుస్తుంది వీళ్ళందర్నీ ఎప్పటికీ అర్థం చేసుకుంటుందో అర్థం కావట్లేదు అనీ దివ్య దగ్గరికి వెళ్లి, ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావ్ అమ్మ అక్కడ అందరూ ఉన్నారు కదా అన్న అక్కతో కలిసి ఉండొచ్చు కదా అని అంటాడు రమేష్ చంద్ర వాళ్లతో సరదాగా గడపమంటే ఇలా చేస్తున్నావ్ అంటే దివ్య వాళ్లతో సరదాగా గడపడం కంటే నాకు ఒంటరిగా ఉండటమే బాగుంది, డాడీ అని అంటుంది దివ్య. అలా అనకమ్మా నా తర్వాత నీకు అంతా వాళ్లే కదా ఎప్పటికైనా నువ్వు ఉండాల్సింది వాళ్లతోనే కదా అని అంటాడు రమేష్ చంద్ర, చూడు దివ్య మనమంతా ఒకటే కుటుంబం అని చెప్తూ ఉంటే వెంటనే దివ్య,వాళ్ళు మనం ఒకటి కాదు వాళ్ళు వేరే మనం వేరే, ఇంకెప్పుడు వాళ్లతో కలిసి ఉండాలని నాకు చెప్పకండి అని దివ్య కోపంగా తన తండ్రి మీద అరుస్తూ ఉంటుంది

Nuvvu Nenu Prema Today Episode march 1 2024 Episode 560 Highlights
Nuvvu Nenu Prema Today Episode march 1 2024 Episode 560 Highlights

వెంటనే నారాయణ చూడమ్మా పెద్దవాళ్ళు ఏం చెప్పినా నీ మంచి కోసమే చెప్తారు. మీ నాన్న ఆనందంగా ఉండాలని నువ్వు ఎలా తపన పడుతున్నావు నువ్వు, ఆనందంగా ఉండాలని ఆయన కూడా తపన పడుతున్నాడు అందుకే ఆయన లాగా ప్రేమను పంచేవాళ్లు ఈ ఇంట్లో నీ వాళ్ళు ఉన్నారని గుర్తు చేస్తున్నారు అని అంటాడు నారాయణ. చూడు డాడీ మీరేం చెప్తున్నారన్నది నాకు అనవసరం మిమ్మల్ని వేరు చేసి చూసే వాళ్ళు నాకు ఎప్పటికీ పరాయి వాళ్ళు, అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దివ్య ఇక నారాయణతో రమేష్ చంద్ర ఇలానే ఉంటుంది దివ్య ఎంత చెప్పినా మారట్లేదు అని బాధపడతాడు మారుతుంది లే అన్నయ్య నువ్వేం కంగారు పడకు అని అంటాడు నారాయణ. ఇక అక్కడికి వచ్చిన పద్మావతి మావయ్య మిమ్మల్ని సంతోషంగా ఉంచే ఒక ఫోటో చూపిస్తాను ఇప్పుడు అని అంటుంది ఏది చూపించు అని అంటాడు రమేష్ చంద్ర వెంటనే పద్మావతి విక్కి తీసిన సెల్ఫీ ఫోటోని చూపిస్తుంది అది చూసి నారాయణ చాలా సంతోషిస్తాడు. మీలోని ప్రేమని అర్థం చేసుకొని మీ బిడ్డలు మీతో సంతోషంగా ఉండే రోజు త్వరలోనే వస్తుంది మావయ్య అంటుంది. అప్పుడు అందరం కలిసి మళ్ళీ ఫోటో దిగుదాము అప్పుడు ఇంకా ఆనందాన్నిస్తుంది అని అంటుంది పద్మావతి. నీ మాటలు నన్ను చావనీయకుండా బతికుంటే ఇలా చేస్తున్నాయి అమ్మ అని పద్మావతితో రమేష్ చంద్ర అంటాడు. నేను చేసిన తప్పులకి ఈ ఇంట్లో కూడా రాలేను అనుకున్నాను అలాంటిది నాకు ఇంత సంతోషాన్ని నువ్వు ఇస్తున్నావు అంటే, నువ్వు నిజంగా దేవతవి అని అంటాడు రమేష్ చంద్ర విక్కి నన్ను కనుక నాన్న అని పిలిస్తే ఆ క్షణం నాకు ఆకరిక్షణమైన పర్వాలేదు అని అంటాడు. మావయ్య మీరు అలాంటి మాటలు మాట్లాడొద్దు మీకోసం నేను ఏదైనా చేస్తాను అని అంటుంది. నువ్వు చూపించే ఈ ప్రేమకేనమ్మ నేను చచ్చి నీ కడుపున పుట్టాలనుకుంటున్నాను అని అంటాడు రమేష్ చంద్ర. నీలాంటి కోడలు ఏ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం విడిపోదమ్మా ఎప్పటికీ కలిసే ఉంటుంది అని పద్మావతిని పొగుడుతూ ఉంటాడు రమేష్ చంద్ర.

ఇక దివ్య వాళ్ళ నాన్న అన్న మాటని ఆలోచించుకుంటూ విక్కీ, అరవింద తో వాళ్ళ నాన్న కలిసి ఉండాలి అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అటుగా వచ్చిన కృష్ణ ఒంటరిగా బాగా దొరికింది అని దివ్యని చూస్తూ ఉంటాడు. దివ్య వెనుక నుండి కృష్ణ పట్టుకోవాలని చూస్తూ ఉంటే దివ్య అనుకోకుండా పక్కకు తిరిగి బావ నువ్వా అని అంటుంది.వెంటనే ఏంటి దివ్య ఇక్కడే ఉన్నావు ఒంటరిగా అని అడిగితే నాకు బోర్ కొడుతుంది బావ అని అంటుంది. నాకు అర్థమైంది దివ్య నీ బాధ మీరు వాళ్ళని మీ మనుషులుగా చూస్తుంటే వాళ్ళు మాత్రం మిమ్మల్ని పరాయి వల్ల చూస్తున్నారు అని అంటాడు కృష్ణ ఆ మాటలకు మీకు మా గురించి అర్థమైంది బావ కానీ మా డాడీకి అర్థం కావట్లేదు అని అంటుంది.

Nuvvu Nenu Prema Today Episode march 1 2024 Episode 560 Highlights
Nuvvu Nenu Prema Today Episode march 1 2024 Episode 560 Highlights

నువ్వు నిజంగా చాలా మంచి దానివి, అయినా మీ డాడీ కూడా మీరు వద్దు అనుకున్న వాళ్ళ దగ్గరికే మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాడు అంటాడు కృష్ణ.మీ నాన్నని చూస్తుంటే నాకు చాలా జాలి వేస్తుంది అంత పెద్ద మనిషి వీళ్ళ దగ్గర ఇలా ఉండడమేంటి ఆయన లేకపోతే వీళ్ళందరూ ఎక్కడున్నారు చెప్పు, అది నేనైతే నా మీ డాడీ నెత్తిన పెట్టుకొని పూజించేవాడిని అని కృష్ణ మాట్లాడుతూ ఉంటే దివ్య చాలా సంతోషంగా కృష్ణ నే చూస్తూ ఉంటుంది నిజంగా నువ్వు చాలా మంచి వాడివి బావ, ఆ ఇంట్లో మా గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారంటే అది నువ్వే బావ అనిదివ్య అంటూ ఉంటే దివ్య చెయ్యి పట్టుకొని కృష్ణ నీకు బోర్ కొట్టకుండా నేను నిన్ను ఎంటర్టైన్ చేస్తాను నువ్వు ఎప్పుడు అంటే అప్పుడు అని ఫీల్ అవ్వద్దు అని దివ్యని చేయి పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు నాతో ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడొచ్చు నువ్వు ఫ్రీ గా ఉండొచ్చు నా దగ్గర, నీకు నేనున్నాను అని మాట ఇస్తూ ఉంటాడు. అప్పుడే రమేష్ చంద్ర ఫోన్ చేస్తే దివ్య వెళ్ళిపోతుంది చా అందినట్టే అంది జారిపోయింది అని నా కంట్లో పడిన తర్వాత ఏ ఆడపిల్ల అయినా నేను ఎలా వదులుతాను అని అనుకుంటాడు కృష్ణ.

Nuvvu Nenu Prema Today Episode march 1 2024 Episode 560 Highlights
Nuvvu Nenu Prema Today Episode march 1 2024 Episode 560 Highlights

ఇక పిక్నిక్ లో అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు రమేష్ చంద్ర ఇంట్లో వాళ్ళందరూ గేమ్స్ ఆడుతూ ఉంటారు పద్మావతి, దివ్య అరవింద,చూస్తూ ఉంటారు. అందరూ కలిసి క్రికెట్ ఆడుతూ ఉంటారు పద్మావతి అందరితో కలిసి గేమ్స్ ఆడుతూ ఉంటుంది ఇక రమేష్ చంద్ర చూస్తూ చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక అందరూ కలిసి కుర్చీలాటాడుతూ ఉంటారు అందులో అందరిని ఓడించి దివ్య గెలుస్తుంది దివ్య గెలిచినందుకు అందరూ సంతోషిస్తారు. ఇక కుచల కాలుజారి కింద పడుతుంది. నారాయణ వచ్చి మెల్లిగా లేపి తీసుకెళ్తూ ఉంటాడు కాలు ఇరిగిందా ఏంటే అని అంటాడు ఇరగలేదు అని అంటుంది.

Nuvvu Nenu Prema Today Episode march 1 2024 Episode 560 Highlights
Nuvvu Nenu Prema Today Episode march 1 2024 Episode 560 Highlights

ఇక అందరూ భోజనానికి కూర్చొని ఉంటారు పద్మావతి విక్కి ఇద్దరు మాత్రం రాలేదు. వాళ్లకోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు, ఇక కుచల మాత్రం ఆగలేక భోజనాన్ని ప్లేట్లో పెట్టుకుని, టెస్ట్ చూస్తాను అని తింటూ ఉంటుంది.నారాయణ వచ్చి ఏంటే ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అంటే ఐటమ్స్ అన్ని ఎలా ఉన్నాయో టేస్ట్ చేస్తున్నానండి అని అంటుంది. ఆగండి అప్పుడే తినకండి అని అంటుంది పద్మావతి. ఏంటో చెప్పు అని అంటారు. మనం ఎవరికి వాళ్ళం తింటే ఏం బాగుంటుంది ఇక్కడ ఉన్న భర్తలు భార్యలకు తినిపిస్తే బాగుంటుంది అని అంటుంది. ఏమంటారు అని అంటే సూపర్ అమ్మ అంటున్నారు నారాయణ సరే ఆలస్యం దేనికి, మీరు కుచల అత్తయ్యకి తినిపించండి అని అంటుంది. నారాయణ ఇప్పుడు నా వల్ల కాదమ్మా అని అంటాడు.అందరూ సరదాగా సంతోషంగా గడపడానికి ఇక్కడికి వచ్చాం కాబట్టి మీరు అత్తయ్యకి తినిపించాల్సిందే అని అంటుంది. ఇక కుచల తను తిని నారాయణ కూడా పెడుతుంది నారాయణ కూడా కుచల కు భోజనం పెట్టిస్తాడు. కృష్ణ నువ్వు వచ్చి అరవింద కి భోజనం పెట్టు అని అంటే ప్రాణం తీస్తే బాగుంటుంది అనుకుంటే ఈ సేవలు ఏంటి అని అనుకుంటాడు. ఇక ఆను,ఆర్య మాత్రం అక్కడ ఉన్న వాళ్ళ కోసం బలవంతంగా ఒకరికి ఒకరు తినిపించుకుంటారు. ఇక విక్కీ పద్మావతి వంతు వస్తుంది. నువ్వు కూడా పద్మావతికి తినిపించు అని అక్కడ ఉన్న వారు చెప్పడంతో విక్కి ఆలోచిస్తూ ఉంటాడు. విక్కీ భోజనం తీసుకొని పద్మావతి దగ్గరికి వస్తాడు.

రేపటి ఎపిసోడ్ లో దివ్యా పిల్లలతో కలిసి ఫుట్బాల్ ఆడుతూ ఉంటుంది. అరవింద అటుగా వెళుతూ ఉంటే దివ్య బాల్ ని విసురుతుంది అది అనుకోకుండా అరవింద పొట్టకి తగులుతూ ఉండగా పద్మావతి అడ్డుగా వచ్చి నిలబడడంతో పద్మావతికి తగులుతుంది వెంటనే పద్మావతి అమ్మ అని కింద పడుతుంది. పద్మావతిని లేపిన అరవింద, దివ్య మీద కోపంగా నీకు అసలు బుద్ధుందా చూసుకునే పని లేదా అని అడుగుతుంది. వెంటనే దివ్య సారీ అక్క అని అంటుంది దివ్య ఒకసారిగా అక్క అని పిలిచేసరికి అరవింద కి ఏమీ అర్థం కాదు. ఐ యాం రియల్లీ సారీ అక్క అని అంటుంది దివ్య ఆ మాటలకు అరవింద అలానే నిల్చుండి ఆలోచిస్తూ ఉండిపోతుంది. దివ్య మొదటిసారి అరవిందనీ అక్క అని పిలవడంతో పద్మావతి కూడా సంతోషిస్తుంది.

author avatar
bharani jella

Related posts

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Brahmamudi April 13 2024 Episode 383:  బిడ్డతో ఫంక్షన్ కి వెళ్లిన కావ్య.. వెన్నెల ఎంట్రీ.. రుద్రణి ప్లాన్ కనిపెట్టిన స్వప్న

bharani jella

Krishna Mukunda Murari April 13 2024 Episode 444: భవానీ నిర్ణయానికి గింగిరాలు తిరిగిన ముకుంద.. కృష్ణ మురారి సంతోషం.. రజనీతో కలిసి ముకుంద ప్లాన్..

bharani jella

Jayasudha: వాట్.. సీనియర్ యాక్టర్ జయసుధ తల్లి హీరోయినా?.. ఏ ఏ సినిమాల్లో నటించిందంటే..!

Saranya Koduri

Karthika Deepam: మా అమ్మ – నాన్నకు మాటలు రావు.. శౌర్య ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema April 12 2024 Episode 597: పోలీస్ స్టేషన్ కి కుచల.. కృష్ణ ఆవేశం.. రౌడీలకు లొంగిపోయిన విక్కీ.. పద్మావతిని కాపాడనున్నాడా?

bharani jella

Naga Panchami: పంచమి బిడ్డ గురించి గురువుగారు ఏం చెప్పు తలుచుకున్నాడు.

siddhu

SS Rajamouli: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ యాడ్ లో రాజమౌళి.. వీడియో వైరల్..!!

sekhar

Madhuranagarilo April 12 2024 Episode 336: శ్యామ్ ని జైల్లో వేయించిన రుక్మిణి…

siddhu

Pawan Kalyan: రామ్ చరణ్ కి బెస్ట్ విషెస్ తెలియజేసిన పవన్ కళ్యాణ్..!!

sekhar

OTT Releases: ఒకేరోజు ఓటీటీలోకి సందడి చేసేందుకు వచ్చేసిన 3 సూపర్ హిట్ మూవీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Yatra 2 OTT Streaming: గప్చిప్ గా ఓటీటీలోకి వచ్చేసిన టాలీవుడ్ పొలిటికల్ బయోపిక్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri