NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema March 12 2024 Episode 569: పద్మావతికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్న విక్కి.. కృష్ణ,దివ్య కోపం.. పద్మావతి పై విక్కీ ప్రేమ..

Nuvvu Nenu Prema Today Episode March 12 2024 Episode 569 highlights

Nuvvu Nenu Prema March 12 2024 Episode 569: పద్మావతి పుట్టినరోజు తెలుసుకొని విక్కీ ఎలాగైనా పద్మావతికి విషెస్ చెప్పాలనుకుంటాడు. అను ఇంట్లో అందరికీ పద్మావతి పుట్టినరోజు అన్న విషయం చెబుతుంది దాంతో పద్మావతి పుట్టినరోజు ని సెలబ్రేట్ చేయాలని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ అనుకుంటారు. అందుకు విక్కీ మాత్రం ఒప్పుకోడు మీరెవరు ఇలాంటి సప్రైస్లు చేయొద్దు అని చెప్తాడు అందుకు నారాయణ అదేంటి విక్కీ నువ్వు ఒప్పుకుంటావ్ అనుకుంటే ఇలా చేశావు అని అంటే అవన్నీ ఏమొద్దు బాబాయ్ జస్ట్ కేక్ కట్ చేయించడి అని అంటాడు. విక్కి మాత్రం మనసులో పద్మావతి ఎప్పుడు రూమ్ లోకి వస్తుందా తనకి సప్రైజ్ గా ఎప్పుడు విషెస్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు.

Nuvvu Nenu Prema Today Episode March 12 2024 Episode 569 highlights
Nuvvu Nenu Prema Today Episode March 12 2024 Episode 569 highlights

ఇక విక్కీ పద్మావతి కోసం ఎదురు చూస్తూ ఉంటే పద్మావతి అప్పుడే పాలు, అరవింద్ కు టాబ్లెట్స్ తీసుకుని హాల్లోకి వస్తుంది. అరవింద కు మీరు టాబ్లెట్స్ వేసుకోలేదు వదిన అని అంటే నేను తర్వాత వేసుకుంటాలే అని అంటుంది కాదు మీరు వేసుకోవాల్సిందే లేదంటే మీ కడుపులో ఉండే అత్తయ్యకి ఇబ్బంది కలగకూడదు కదా వేసుకోండి అని అంటుంది టాబ్లెట్స్ వేసుకుంటుంది పద్మావతి పాలు తీసుకొని విక్కీకి ఇవ్వకపోతే ఇప్పటికే చాలా టైం అయి ఉండాలి కోప్పడతాడేమో అని అనుకుంటుంది. ఇక అందరూ కలిసి పద్మావతిని పైకి వెళ్లి విక్కీకి పాలు ఇచ్చి రమ్మని చెప్తారు. ఇక పద్మావతి ఏంటి మీరందరూ ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు నేను రాగానే ఆపేశారు అని అర్థం ఏం లేదమ్మా అని అంటాడు నారాయణ. కుశల చెప్పబోతుంటే నారాయణ ఆపేస్తాడు. ఇక పద్మావతిని అందరూ కలిసి విక్కీ రూమ్ కి వెళ్ళమని చెప్తారు ఇక పద్మావతి వెనక్కి తిరిగి చూసుకుంటూనే వికీ రూమ్ కి వెళ్తుంది. వీళ్ళందరూ ముఖాల్లో ఏదో తేడా కనిపిస్తుంది నా దగ్గరే ఏమైనా దాచి పెడుతున్నారా అని అనుకుంటూ విక్కీ రూమ్ కి వెళ్తుంది పద్మావతి. అప్పటికే విక్కీ పద్మావతి కోసం ఒక బ్యాంగిల్ ని తీసుకొచ్చి, దాన్ని చూస్తూ ఈరోజు నీకు పుట్టినరోజు విషెస్ తో పాటు నా మనసులో ఉన్న ప్రేమని కూడా చెప్తాను పద్మావతి ఈ చిన్న గిఫ్ట్ నీకోసమే తీసుకొచ్చాను అని అనుకుంటూ ఉండగా పద్మావతి సారు అని పిలుస్తుంది ఇక వెంటనే ఆ గిఫ్ట్ ని దిండు కింద దాచి పెట్టేస్తాడు.

Nuvvu Nenu Prema Today Episode March 12 2024 Episode 569 highlights
Nuvvu Nenu Prema Today Episode March 12 2024 Episode 569 highlights

ఇక మరోవైపు నారాయణ అసలు విక్కీ పుట్టినరోజు చేయొద్దు అని చెప్పడానికి వాడెవడు ఇంట్లో పెద్ద నేను చెప్తే కదా చేయకుండా ఉండాల్సింది మనం పుట్టిన రోజు జరుపుతున్న పద్మావతి ఆనందానికి మనం ఏదో ఒకటి చేసి తీరాలి అందరూ పుట్టినరోజు ఏర్పాట్లు చేద్దాం అని అంటాడు. ఆర్య కూడా అవును అన్నయ్య చెప్తే వినాలా ఏంటి మనకంటూ స్వతంత్రం లేదా ఈ ఇంట్లో ఆయన చెప్పిన మాటే వినాలా ఏంటి మన పద్మావతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగబోతున్నాం అని అంటే అందరూ అని అంటారు ఇక అరవింద మీరిద్దరూ కరెక్ట్ గానే మాట్లాడుతున్నారు కదా అని అంటుంది. అవును కరెక్ట్ గానే మాట్లాడుతున్నావు అని అంటారు ఇక అప్పుడే కుచల రా విక్కి రా నీ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరూ అని అంటుంది. వెంటనే నారాయణ ఆర్య విక్కీ చాలా మంచివాడు విక్కి బుద్ధిమంతుడు విక్కీ చెప్పిన మాట మన వినాలి అని విక్కీ శ్రీరాముడు అయితే నేను లక్ష్మణుడిని అని అంటూ ఉంటారు వెంటనే అరవింద కుచల ఇద్దరు నవ్వుతారు. విక్కీ రాలేదు మీ ఓవరాక్షన్ ఆపేసేయండి. నాకు తెలిసిందే ఇదంతా మీ మేకపోదుగా మీరు ఏమైనా వీక్ ఏ వస్తే సైలెంట్ అవుతారు అని అంటుంది. సరే ఇప్పుడు మనం పుట్టిన రోజు ఏర్పాట్లు చేసి తీరుతున్న అంతే అని అంటాడు నారాయణ. ఇక పద్మావతి కోసం ఏర్పాట్లు అన్నీ చేస్తారు ఇల్లంతా బెలూన్స్ కట్టి కేక్ తీసుకొచ్చి టేబుల్ మీద పెడతారు ఇంకా పద్మావతి కిందకి రాదు ఏంటి అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు.

Nuvvu Nenu Prema Today Episode March 12 2024 Episode 569 highlights
Nuvvu Nenu Prema Today Episode March 12 2024 Episode 569 highlights

ఇక మరోవైపు విక్కీ పద్మావతిని పాలు నువ్వు కూడా తాగు అని అంటాడు నేనెప్పుడైనా తాగాన సారు ఉన్న పాలన్నీ మీకోసమే తీసుకొచ్చాను తాగండి అని అంటుంది లేదు పద్మావతి ఈరోజు నువ్వే తాగాలి అని అంటాడు అది ఎలా సారు మీకు పాలు తాగకపోతే నిద్ర పట్టదు కదా అని అంటుంది సరే నా దగ్గర ఒక ఐడియా ఉంది అని విక్కీ సగం పాలు తాగి పద్మావతికి ఇస్తాడు సారు మీరేనా అని అడుగుతుంది నేనే పద్మావతి తాగు అని అంటాడు. విక్కీ మిగిల్చిన సగం పాలు పద్మావతి సంతోషంగా తాగుతుంది. పద్మావతి మూతికి పాల మీగడ అంటుకుంటుంది. విక్కీ నవ్వుతాడు పద్మావతి కూడా అవుతుంది. ఇక ఇద్దరు ఒకరి మూతి కి ఒకరు పాలమీగడ అంటుకుందని నవ్వుకుంటారు. విక్కీ నేను తుడుస్తాను అని అంటాడు పద్మావతి చాలా సంతోషిస్తుంది విక్కీ ప్రేమగా పద్మావతి తో ఉండడం పద్మావతికి ఇది కలా నిజమా అని అనిపిస్తుంది. ఒకసారి నేను కిందకి వెళ్ళాలి నాకు చాలా పనులు ఉన్నాయి అంటే అలా ఎలా వెళ్తావు కాసేపు ఉండాల్సిందే అని అంటాడు. కింద సామాను కూడా సద్ది రాలేదు నేను వెళ్ళాలి అని అంటుంది లేదు ఉండాల్సిందే అని అంటూ ఉంటాడు ఇక మరోవైపు ఈ పద్మావతికి విషెస్ చెప్పడానికి టైం అవుతుందని అందరూ పద్మావతిని కిందకి రప్పించడానికి, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఆర్యా నా దగ్గర ఒక ప్లాను ఉంది అని పని అమ్మాయి గొంతుతో పద్మావత్ అమ్మగారు ఇంకా మీరు కిందకి రాలేదు ఇంకా పనిలేమన్నా ఉంటే చెప్పండి నేను వెళ్ళాలి అని పనమ్మాయి గొంతుతో అంటాడు ఇక పద్మావతి అదిగొండి పనమ్మాయి కూడా పిలుస్తుంది నేను కిందకి వెళ్తాను చాలా పనులు ఉన్నాయి అని అంటుంది ఇక అంతలో ఆర్య ఫాస్ట్గా వెళ్లి కరెంటు తీసేస్తాడు. అయ్యో సారు కరెంట్ కూడా పోయింది నేను కిందకి వెళ్తున్నాను అని పద్మావతి కిందకు వచ్చేస్తుంటుంది ఇక ఆర్య నారాయణ అరవింద ఇంట్లో కుటుంబ సభ్యులందరూ పద్మావతికి కనిపించకుండా దాక్కుంటారు. విక్కి మాత్రం చ నేను తనకి ఫస్ట్ టైం విషెస్ చెప్పాలనుకుంటే ఇలా జరిగింది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు.

Nuvvu Nenu Prema Today Episode March 12 2024 Episode 569 highlights
Nuvvu Nenu Prema Today Episode March 12 2024 Episode 569 highlights

ఇక మరోవైపు పద్మావతి కిందకి రాగానే కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా సర్ప్రైజ్ అంటూ హ్యాపీ బర్త్డే టూ యు అని పెద్దగా అరుస్తారు. ఆరుపులకు దివ్య కృష్ణ ఇద్దరు బయటికి వస్తారు ఇక దివ్య మనసులో మా నాన్న చనిపోయి నేను చాలా బాధలో ఉంటే మీకు సంతోషంగా పుట్టినరోజులు జరుపుకుంటారా అని ఆలోచిస్తూ ఉంటుంది కృష్ణ కూడా ఇదే మీకు చివరి సంతోషమైన రోజు మీరు ఎంత ఆనందంగా ఉండాలో ఈ ఒక్క రోజుకి ఉండండి రేపటినుండి ఎదుగుడి ఉండలేరు కదా అని అంటాడు. దివ్య కృష్ణ ఇద్దరు కోపంగా పద్మావతి వాళ్ళని చూస్తూ ఉంటారు. ఇక మరోవైపు పద్మావతి కే ఇంట్లో అందరూ విషెస్ చెప్పినందుకు విక్కి కోపం వస్తుంది నేను మొదటి చెబుదామనుకుంటే వీళ్ళ కింద ఏం తీ అరుపులు అని కిందకు వచ్చి చూస్తాడు. అప్పటికి పద్మావతి కోసం కింద బెలూన్స్తో డెకరేషన్ చేసి హ్యాపీ బర్త్డే అని చెప్తూ ఉండగా స్టాపెక్ట్ అని పెద్దగా అరుస్తాడు ఇక అందరూ వికీపీ కోపం వచ్చిందనుకుంటారు విక్కీ కిందకి వచ్చి ఏంటక్కా ఇదంతా నేను వద్దని చెప్పాను కదా మీరు ఇలా ఏర్పాట్లు ఎందుకు చేశారు అని అంటే ఏదో పద్మావతి పుట్టినరోజు కదా అందుకని చేసాము అని అంటుంది అరవింద్ ఇక విక్కి మొదట కోపంగా ఉన్నట్టు నటిస్తాడు తర్వాత పద్మావతి ఏదోలే సారు నా సంతోషం కోసం వదిలి ఏర్పాటు చేశారు మీరు కోప్పడకండి అని అంటే అది కాదు పద్మావతి మొదటి విషశబ్దం అనుకుంది నేను కదా వీళ్ళందరూ చెప్పేశారు అని అంటారు ఇక వెంటనే ఇంట్లో అందరూ ఓహో నువ్వు ఇంతసేపు కోపపడింది మేమేదో అరేంజ్ చేసినందుకు కాదా, నువ్వు మొదటి విషెస్ చెబుదామనుకుంటే మేము అడ్డుపడినందుకా సరే పర్లేదు ఇప్పుడైనా చెప్పు అని అంటారు. ఇక పద్మావతి వైపు తిరిగి ప్రేమగా పద్మావతి చేతిని తీసుకొని హ్యాపీ బర్త్డే పద్మావతి అని అంటాడు. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode March 12 2024 Episode 569 highlights
Nuvvu Nenu Prema Today Episode March 12 2024 Episode 569 highlights

రేపటి ఎపిసోడ్ లో, పద్మావతి విక్కీ అందరూ గుడికి వస్తారు పద్మావతి గంట కొడదామని ట్రై చేస్తుంది. కానీ ఆమెకి గంట అందదు ఇక వెంటనే ఇంట్లో అందరూ పద్మావతి నువ్వు గంట కొడితే నేను పదివేలు ఇస్తాను అని అరవింద్ ఇరవై వేలు ఇస్తాను అని బెట్టు కాస్తారు.పద్మావతి విక్కీ వైపు చూస్తూ మీరు కూడా నేనెప్పుడూ పొట్టిగా ఉంటాను ఎక్కిరిస్తారు కదా సారు ఇప్పుడు కూడా మీరు కూడా ఏదో ఒకటి అనండి అని అంటుంది. కానీ విక్కీ పద్మావతి దగ్గరికి వచ్చి తన చేత గంట కొట్టిస్తాడు తన చేతి మీద పద్మావతి ఎక్కించుకొని గంట కొట్టిస్తాడు ఆ సీన్ చాలా బాగుంటుంది. ఇక ఇంట్లో అందరూ పద్మావతికి విక్కీ అంటే చాలా ప్రేమ అని అనుకుంటారు.

author avatar
bharani jella

Related posts

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N