NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema March 13 2024 Episode 570: పద్మావతిని సప్రైజ్ చేసిన విక్కీ.. కృష్ణకి వార్నింగ్ ఇచ్చిన పద్మావతి..

Nuvvu Nenu Prema Today Episode March 13 2024 Episode 570 highlights

Nuvvu Nenu Prema March 13 2024 Episode 570: పద్మావతి పుట్టినరోజు వేడుకలను విక్కీ సర్ప్రైజ్ గా ప్లాన్ చేయాలనుకుంటాడు కానీ ఇంట్లో అప్పటికే కుటుంబ సభ్యులందరూ పద్మావతి పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తారు విక్కీ పద్మావతికి మొదట తనే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి అనుకుంటాడు. అందుకే ఇంట్లో వాళ్ళు సెలబ్రేషన్స్ చేస్తానంటే వద్దని చెప్తాడు ఇక వాళ్ళు విక్కీకి తెలియకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారు. పద్మావతి కిందకి రాగానే అందరూ సప్రైజ్ గా పద్మావతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతారు ఇక విక్కి ఏంటి కింద గోలగా ఉంది అని రూమ్ లో నుంచి బయటికి వచ్చి చూసేసరికి వాళ్ళు పద్మావతికి హ్యాపీ బర్త్డే చెబుతూ ఉంటారు వెంటనే కోపంతో ఇవన్నీ వద్దని చెప్పాను కదా అని కుటుంబ సభ్యుల్ని అరుస్తాడు. పద్మావతి నచ్చింది నాకోసమే కదా సార్ ఇవ్వాలి ఇదంతా చేసింది అని అందుకు విక్కీ మొదటి నేను నీకు విషెస్ చెప్పాలనుకుంటే వీళ్లంతా చెప్పేశారు పద్మావతి అని అంటాడు. అందుకే ఇంట్లో వాళ్ళంతా నవ్వుకుంటారు.

Nuvvu Nenu Prema Today Episode March 13 2024 Episode 570 highlights
Nuvvu Nenu Prema Today Episode March 13 2024 Episode 570 highlights

ఇక ఈరోజు ఎపిసోడ్లో పద్మావతికి విక్కీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాడు ఇక ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు ఇక ఆర్య పద్మావతి కోసం వికీ నువ్వేం గిఫ్ట్ తీసుకొచ్చావు అని అడుగుతాడు అది మా అందరి ముందు ఇస్తే మేము కూడా చూస్తాం కదా అని అంటాడు ఇక పద్మావతి కోసం విక్కీ బ్రాస్లైట్ ని గిఫ్ట్ గా తీసుకొస్తాడు. అందరి ముందు పద్మావతికి తను తీసుకొచ్చిన సర్ప్రైసింగ్ గిఫ్ట్ ని ఇస్తాడు ఇక పద్మావతి ఆ గిఫ్ట్ ను చూసి చాలా సంతోషపడుతుంది వెంటనే అరవింద నువ్వే పద్మావతి చేతికి తొడుగు అని అంటుంది. ఇక పద్మావతి చేతికి విక్కీ బ్రాస్లెట్ దొరుకుతుంటే పద్మావతి మనసులో మీలో ఇంత మార్పు వస్తుందని నేను అనుకోలేదు సారు ఈ మాత్రం మీరు మారారు నాకు అంతే చాలు అని అనుకుంటూ ఉంటుంది. విక్కీ కూడా మనసులో నీకు నా మనసులో ఉన్న ప్రేమని తెలియాలి అనుకున్నాను పద్మావతి కానీ ఇది సమయం కాదు నీకు ఒక్కదానివే ఉన్నప్పుడు నా మనసులో ప్రేమని తెలియజేస్తాను అని అనుకుంటాడు. ఇక విక్కి పద్మావతిని ప్రేమిస్తుండడంతో ఇద్దరు హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు. వాళ్ల సంతోషాన్ని చూసి కృష్ణ కుళ్ళు కోవడం మొదలుపెడతాడు. నేను పద్మావతి వికీల మనసు విరగకొట్టాను కదా అయినా విక్కీ పద్మావతికి గిఫ్ట్ తీసుకురావడం ఏంటి ఇదంతా చూస్తుంటే నాకు ఏదో కొంచెం అనుమానంగా ఉంది విక్కీ మనసులో పద్మావతి మీద ప్రేమ మొదలైనట్టుంది వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే అలానే ఉంది అని అనుకుంటూ నేనున్నాను కదా ఎలాంటి వాళ్ళనైనా విడగొట్టడానికి అని అనుకుంటాడు.

Nuvvu Nenu Prema Today Episode March 13 2024 Episode 570 highlights
Nuvvu Nenu Prema Today Episode March 13 2024 Episode 570 highlights

ఇక అందరూ కేక్ కటింగ్ చేయడానికి దగ్గరికి రమ్మని చెప్తుంది అరవింద దివ్య చాలా దూరంగా ఉంటుంది ఇక దివ్యని కూడా రమ్మని పిలుస్తారు దివ్య మనసులో మా నాన్నకి చేసిన అవమానాలని నాకు గుర్తున్నాయి ఆయన చనిపోయినంత మాత్రాన ఆయన పగలు మాత్రం నా మనసులో అలానే పెట్టుకున్నాను అని అనుకుంటూ ఉంటుంది ఇక దగ్గరికి వచ్చిన అరవింద దివ్యని తీసుకొని కేక్ కటింగ్ దగ్గరికి తీసుకు వెళుతుంది.ఇక పద్మావతి కేక్ కట్ చేసి అందరికీ తినిపిస్తూ ఉంటుంది ఇక పద్మావతి వికీ ఇద్దరు చాలా సంతోషంగా గడుపుతుంటారు ఇక దివ్య వాళ్ళ సంతోషాన్ని చూడలేక అక్కడ నుంచి పక్కకు వెళ్ళిపోతుంది వెంటనే కృష్ణ మనసులో ఇప్పుడు దివ్య నువ్వు రెచ్చగొట్టామంటే ఈ ఇంట్లో సంతోషం కాస్త పుల్ స్టాప్ పడుతుంది. మనం చేయాల్సింది చేద్దాము తర్వాత జరిగేది జరుగుతుంది అని అనుకుంటాడు ఇక దివ్య మనసులో ఎలాగైనా సరే ఇంట్లో వాళ్ళ మీద కోపం పగ రగలే లాగా చేయాలనుకుంటాడు కృష్ణ. ఇక దివ్య దగ్గరికి వెళ్తాడు. ఇక అందరం గుడికి వెళ్ళాలి ఉదయాన్నే అని చెప్తుంది అరవింద అందరూ సరే అంటారు.

Nuvvu Nenu Prema Today Episode March 13 2024 Episode 570 highlights
Nuvvu Nenu Prema Today Episode March 13 2024 Episode 570 highlights

ఇక పద్మావతి తల్లిదండ్రులు, విషెస్ చెప్పడానికి ఫోన్ చేస్తారు పద్మావతి ఫోన్ లిఫ్ట్ చేసి మీ కోసమే ఎదురుచూస్తున్నానమ్మా అని అంటుంది ఇటువంటినే భక్త పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి అని అంటాడు పద్మావతి తో పార్వతి మాట్లాడుతూ నీకు అక్కడ అంతా బానే ఉంది కదా మీ అని అంటే అమ్మ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఉదయం జరిగిన విషయాలన్నీ పద్మావతి వాళ్ళ అమ్మతో పంచుకుంటుంది. ఇక నా కోసం విక్కి మంచి గిఫ్ట్ తీసుకొచ్చాడు సప్రైజ్ గా నా కోసం బ్రాస్లైట్ నీతోటిగాడు నా చేతికి అని అంటుంది ఆ మాటలకు పద్మావతి వాళ్ళు తల్లిదండ్రులు పొంగిపోతారు ఇక పద్మావతి కూడా చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. మీరు కూడా ఉంటే చాలా బాగుండేది నాన్న అని అంటే మేము కూడా రేపు వస్తాంలే తల్లి అని అంటాడు. రేపు సాయంత్రం ఫంక్షన్ టయానికి మీ ఇంట్లో ఉంటాము అని అంటుంది పార్వతి ఇక సరే అని ఫోన్ పెట్టేసి పద్మావతి వికీ ఇచ్చిన బ్రాస్లెట్ చూసుకుంటూ మీ మనసులో ఉన్న ప్రేమని మీ మాటల్లో కూడా తెలిపితే బాగుండేది సారు అని అనుకుంటూ పద్మావతి విక్కీ లో వచ్చిన మార్పుకి సంతోషిస్తూ వెనక్కి తిరిగి చూసేసరికి కృష్ణ ఎదురుగా వచ్చిన నిలబడతాడు. ఏంటి పద్మావతి విక్కీ ఇచ్చిన చిన్న గిఫ్ట్ ను చూసి అంతలా మరిచిపోతున్నావు అని అడుగుతాడు ఇది నీ దృష్టిలో చిన్న గిఫ్ట్ ఏ కావచ్చు కానీ నాకు వెలకట్టలేనిది అని అంటుంది. ఒక గిఫ్ట్ తోనే మీ జీవితం మారిపోతుందని అనుకోవద్దు పద్మావతి అని అంటాడు నీలాంటి వాళ్ళు ఉండగా అవతలి వాళ్ళ మంచి కోరుకోరు కదా అని అంటుంది పద్మావతి ఇక పద్మావతి కృష్ణకి వార్నింగ్ ఇస్తుంది నేను మా ఆయన కలిసే తీరుతాము నువ్వు చూస్తూ ఉండు నీ కళ్ళు పేలిపోయేలాగా మేమిద్దరం కలిసి పోతాము నువ్వు కనుక మధ్యలో ఏదైనా తేడా చేయాలని చూసావంటే నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను అని అంతు చూస్తాను అని పద్మావతి వార్నింగ్ ఇస్తుంది. అది చూద్దాం పద్మావతి మీ ఇద్దరు ఎలా కలిసిపోతారు నేను చూస్తాను కదా అని అంటాడు కృష్ణ.

Nuvvu Nenu Prema Today Episode March 13 2024 Episode 570 highlights
Nuvvu Nenu Prema Today Episode March 13 2024 Episode 570 highlights

ఇక పద్మావతి వాళ్ళందరూ గుడికి బయలుదేరుతారు ఇక పద్మావతి విక్కీ ఇద్దరు ఎక్కడా అని నారాయణ అడగగానే, ప్రేమ పక్షులు వెనకాల వస్తున్నారు నాన్న అని చెప్తాడు ఆర్య ఇక వాళ్ళిద్దరూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని మెట్లు ఎక్కుతూ ఉంటారు గుడిలో ఇద్దరు ట్రెడిషనల్ డ్రెస్సులు చాలా అందంగా కనిపిస్తారు. ఇంక వాళ్ళిద్దరిని చూసి నారాయణ వీళ్లు ఈ జన్మలో బంధం కాదమ్మా వీళ్లది ఎన్నో జన్మల బంధం అని అంటాడు ఇక ఒకరి కోసం ఒకరు కొట్టారు అని ఆర్య అను అంటారు ఇక అరవింద్ విక్కీ మీద పద్మావతి ప్రేమా పద్మావతికి విక్కి అంటే ప్రేమ అని అంటుంది ఇక అందరూ పద్మావతి ఉంటారు ఇక నారాయణ తో కుచల మనది కూడా జన్మజన్మల బంధం నారు అని అంటుంది. నీతో ఈ జన్మ వరకే నేను నా బంధం వచ్చే జన్మలో బ్రహ్మదేవుడితో మాట్లాడి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా నేను అని అంటాడు దానికి కుచల కోపంగా లేదు నారు నేను బ్రహ్మదేవుడితో పోట్లాడైనా సరే నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను జన్మజన్మలకి నీవే నాకు కావాలి అని అంటే ఎందుకే నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావంటే ఇది టార్చర్ కాదు నారు నీ మీద నా ప్రేమ అని అంటుంది.కుచల కు నారాయణ కౌంటర్ ఇస్తూ ఉంటాడు ఇక అందరూ కలిసి గుళ్లోనికి వెళ్తారు అప్పటికే కృష్ణ గుడిలో మొదటి వెళ్లి నుంచోని వీళ్ళు ఎప్పుడు వస్తారు అని ఎదురుచూస్తూ వీళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలని కూడా ప్లాన్ చేస్తూ ఉంటాడు ఎలాగైనా విడగొట్టి మాత్రం తీరుతాను అని అనుకుంటాడు. అరవింద మీరు ముందే వచ్చి ఇక్కడ ఉండకపోతే మాతో పాటు కలిసి రావచ్చు కదా అండి అని అంటుంది. బావ మంచివాడు అయితే కదా కానీ నీతో కలిసి రావడానికి అని అంటాడు ఆర్య ఏమన్నా ఇప్పుడు అని అడుగుతుంది అరవింద అదే భావ చాలా మంచివాడు అంటున్నాడు అని అంటాడు. ఇక బావకి అక్క అదృష్టం కొద్దీ దొరికింది లేకపోతే వేడి అదృష్టం వేరేలా ఉండేది అని అనడంతో నారాయణ నువ్వే మాట్లాడుతావో అర్థం కాదురా అని అంటాడు ఆర్యా అని. కానీ కృష్ణకుమాత్రం అంతా అర్థమవుతుంది కావాలనే ఆర్య తనని బ్లైమ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది.

Nuvvu Nenu Prema Today Episode March 13 2024 Episode 570 highlights
Nuvvu Nenu Prema Today Episode March 13 2024 Episode 570 highlights

ఇక గుడిలో అందరూ, పూజ చేయించడానికి లోపలికి వెళ్తారు పద్మావతి పేరు మీద పూజ చేయమని అరవింద చెప్తుంది కానీ పద్మావతి మాత్రం కుటుంబ సభ్యులందరూ బాగుండాలని పూజ చేయమని చెప్తుంది.ఇలాంటి మంచి అమ్మాయిని భార్యగా దొరకడం నీ అదృష్టం బాబు అని పంతులుగారు విక్కీ తో అంటాడు. ఇక పద్మావతి గంట కొట్టడానికి వెళుతుంది కానీ గంట అందదు వెంటనే అందరూ నవ్వుతూ ఉంటారు ఇక ఆర్య పద్మావతి నువ్వు కనుక గంట కొడితే నేను నీకు పదివేలు ఇస్తాను అని అంటాడు ఇక వెంటనే అరవిందా పదివేలు కాదు నేను ఇరవై వేలు ఇస్తాను అని అంటుంది. ఇక నారాయణ ఇదేదో బాగుందే అనుకొని నేను 50 వేలు ఇస్తాను అని అంటాడు కుచలనేను కూడా 50 వేలు అని అంటుంది. ఇక అందరూ పద్మావతి గంట కొట్టదు అని ఫిక్స్ అయిపోయి బెట్టు కాస్తూ ఉంటారు ఇక పద్మావతి బుంగమూతితో సారు మీరు కూడా ఎప్పుడూ నేను పొట్టిగా ఉంటానని ఎక్కిరిస్తారు కదా ఇంక మీరు ఒక్కరే ఉన్నది మీరు కూడా పందెం కాసేయండి అని అంటుంది. కానీ విక్కీ మాత్రం పద్మావతి దగ్గరికి వెళ్లి తన చేతి మీద పద్మావతిని ఎక్కించుకొని గంట కొట్టిస్తాడు ఆ సీన్ చాలా బాగుంటుంది అందరు కాప్ల్స్ కొడతారు పద్మావతి విక్కీ లను చూసి అందరూ సంతోషిస్తారు. నిన్ను గెలిపించడానికి మీ ఆయన ఉన్నాడు కదా పద్మావతి అని అంటుంది అరవింద ఇక పద్మావతి తో విక్కీ అలా ఉండడం చూసి కృష్ణ తట్టుకోలేక పోతాడు విక్కీలో మార్పు వచ్చిందని అర్థమవుతుంది ఎలాగైనా వీళ్ళకి నేను అంటే ఏంటో చూపిస్తాను అని అనుకుంటాడు.

author avatar
bharani jella

Related posts

Trinayani April 17 2024 Episode 1215: తిలోత్తమ విశాలాక్షి మెడలో తాళి పట్టుకోగానే, గాయత్రి ఏం చేయనున్నది..

siddhu

Jagadhatri April 17 2024 Episode 207: నిన్ను సీఈవో చేస్తాను అంటున్నా మీనన్, కౌశికి మీద రివేంజ్ తీర్చుకో అంటున్న మీనన్..

siddhu

Brahmamudi April 17 2024 Episode 386: వెన్నెల అబద్ధం.. రాజ్ పై కావ్య ప్రేమ నిజం.. రుద్రాణి ప్లాన్ సక్సెస్..ఆస్తి పేపర్లు అత్తచేతిలోకి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu