NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema March 8 2024 Episode 566: తండ్రి చేతుల మీదగా అవార్డు అందుకున్న విక్కీ.. పద్మావతిని సర్ప్రైజ్ చేయనున్న విక్కి

Nuvvu Nenu Prema Today Episode March 8 2024 Episode 566 Highlights

Nuvvu Nenu Prema March 8 2024 Episode 566:  బెస్ట్ బిజినెస్ మాన్ అవార్డు అందుకోవడానికి విక్కీ తో పద్మావతి కుటుంబ సభ్యులందరూ ఫంక్షన్ హాల్ కి చేరుకుంటారు. అక్కడే ఉన్న కృష్ణ ఎలాగైనా సరే ఫంక్షన్ ని చెడగొట్టాలని నిర్ణయించుకుంటాడు అందుకు తగినట్టుగా ప్లాన్ ప్రకారం మేనేజర్ తో విక్కీ తండ్రి ద్వారా అవార్డు ఇప్పించమని చెప్తాడు. విక్కీకి తన తండ్రి అంటే అసలు ఇష్టం ఉండదని అందుకే అవార్డు ఆయన చేతుల మీదుగా ఇప్పించేటట్టుగా ప్లాన్ చేసి అక్కడ గొడవలు సృష్టించి విక్కీ అవార్డు తీసుకోకుండా వెళ్లిపోతాడని కృష్ణ మనసులో అనుకుంటాడు ఇక వీళ్ళ ఆనందం ఎంతో సేపు నిలబడదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు.

Nuvvu Nenu Prema Today Episode March 8 2024 Episode 566 Highlights
Nuvvu Nenu Prema Today Episode March 8 2024 Episode 566 Highlights

ఇక స్టేజ్ మీద జడ్జిస్ అందరూ ఒక్కొక్కరిని మాట్లాడమంటూ ఉంటారు విక్కీ తర్వాత పద్మావతిని మాట్లాడమని, అడుగుతారు ఇక పద్మావతి సారు నన్ను కూడా రమ్మంటున్నారు అని అంటే ఇప్పుడు వద్దులే కూర్చో అని అంటాడు లేదు సార్ నేను కూడా వెళ్తాను అని పద్మావతి మాట్లాడడానికి వెళుతుంది. ఇక పద్మావతి స్టేజ్ ఎక్కి అందరికి నమస్కారం అని, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మా ఆయనకు ఇలాంటి అవార్డు రావడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈరోజు అసలు మాటలు కూడా నాకు రావట్లేదు ఈ ఆనందంలో నేనేం మాట్లాడుతున్నాను కూడా తెలియట్లేదు అని అంటుంది పద్మావతి. మా సార్ ఇలాంటి అవార్డులను ఇంకా చాలా తీసుకోవాలని కోరుకుంటున్నాను అని సారు అని పిలుస్తున్నాం ఏంటి అని అనుకుంటున్నారా నేను ఆయనకి భార్య కాకముందే, తన ఆఫీసులో ఎంప్లాయ్ గా చేరాను తర్వాత తనని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఇంత మంచి మనిషికి భార్య నేను ఎందుకు చాలా గర్వంగా ఉంది అని పద్మావతి విక్కీ గురించి గొప్పగా పొగుడుతూ చివరికి తనంటే నాకు ఇష్టం అని ఐ లవ్ యు సారు అని అందరి ముందు పద్మావతి తన మనసులో మాటను బయటపెడుతుంది ఎన్ని జన్మలెత్తినా నేను మళ్ళీ మీ వారే గాని రావాలని కోరుకుంటున్నాను అని అక్కడ ఉన్న జనాలు అందరి ముందు పద్మావతి తన ప్రేమను బయట పెడుతుంది. అదంతా చూసిన అరవింద ఎలాగైనా పద్మావతి చాలా గ్రేట్ తను మనసులో మాట ఏదీ దాచుకోదు అది ఎక్కడైనా సరే బయట పెడుతుంది అని అంటుంది ఇలాంటి భార్య దొరకడం మీ అదృష్టం రవికి అని అంటుంది ఇక అందరూ క్లాస్ కొడతారు పద్మావతి మాట్లాడటం పూర్తి చేసుకొని వచ్చి మళ్ళీ కూర్చుంటుంది. బాగా మాట్లాడావ్ పద్మావతి అని ఆర్య నారాయణ, అరవింద,అందరూ చెప్తారు. ఇక ఇప్పుడు మీ అందరి కోసం ఒక సప్రైజ్ ఉందని అక్కడ స్టేజి మీద ఉన్న యాంకర్ అనౌన్స్ చేస్తుంది అందరూ ఏంటబ్బా అంత సుప్రైజ్ అని అడుగుతారు.

Nuvvu Nenu Prema Today Episode March 8 2024 Episode 566 Highlights
Nuvvu Nenu Prema Today Episode March 8 2024 Episode 566 Highlights

ఇక అందరూ ఎదురు చూస్తుండగా, సప్రైజ్ ఏంటో అయినా చేయబోతున్నాము అని విక్రమాదిత్య గారి కి గెలుపుకి కారణం వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కే కాకుండా, ఆయన తండ్రి కూడా ఒక కారణం. అలాంటి విక్రమాదిత్య గారి తండ్రి ఇప్పుడు ఇక్కడే ఉన్నారు ఆ ఇన్ని స్టేజి మీదకి ఆహ్వానిస్తున్నాము అని అనడంతో విక్కీ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అక్కడే ఉన్న బల్ల మీద తన చేతిని వేసి గట్టిగా కొడతాడు ఇక వెంటనే అరవింద వద్దు వికీ కూల్ గా ఉండు అని అడుగురు నిన్నే చూస్తున్నారు ఈ టైంలో నువ్వు బయటపడ్డ మంచిది కాదు అని అంటుంది. ఇక నారాయణ కూడా వద్దు విక్కీ సైలెంట్ గా ఉండు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుందామని అంటే అదేంటి బాబాయ్ ఇక్కడ తీసుకొచ్చింది ఎవరు అని అంటే నారాయణ సైలెంట్ గా ఉంటాడు. ఇక అరవింద నాకోసం విక్కీ నువ్వు సైలెంట్ గా ఉండాలి ఇక్కడ నలుగురిలో పరువు తీయొద్దు అని అంటుంది ఇక అరవింద కోసం విక్కీ సైలెంట్ గా ఉంటాడు. ఇక రమేష్ చంద్రుని స్టేజి మీదకి పిలుస్తారు రమేష్ చంద్ర నాకిష్టం లేదు నేను రాను అన్న బలవంతంగా ఆయన్ని స్టేజి మీదకి తీసుకొస్తారు ఇక స్టేజి మీదకి వచ్చిన రమేష్ చంద్ర తన కొడుకు గురించి గొప్పగా చెప్తాడు. విక్కీ సాధించిన ఈ విజయం చూసి తనకు చాలా గర్వంగా ఉందని వికీ తన సపోర్ట్ లేకపోయినా ఇంత ఎత్తుకు ఎదిగాడని తన తల్లి దీవెన ఎప్పుడు విక్కీకి ఉంటుందని ఏ లోకంలో ఉన్న తన తల్లి విక్కీని చూస్తుంటుందని రమేష్ చంద్ర మాట్లాడి విక్కీ ఇలాంటి అవార్డులు ఇంకా చాలా తీసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని స్టేజి దిగి వెళ్ళిపోతుండగా,అక్కడే ఉన్న మేనేజ్మెంట్ మీరు కాసేపు ఉండండి అని అంటారుమినిస్టర్ గారి చేతుల మీదుగా అవార్డు ఇస్తారని అనుకుంటే రమేష్ చంద్రుని మినిస్టర్ గారు మీరే మీ అబ్బాయికి అవార్డు ఇవ్వండి అని అనడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు.

Nuvvu Nenu Prema Today Episode March 8 2024 Episode 566 Highlights
Nuvvu Nenu Prema Today Episode March 8 2024 Episode 566 Highlights

రమేష్ చంద్రకి అసలు విక్కి నా చేతుల మీదుగా ఇస్తే అవార్డు తీసుకుంటాడో లేదో అని సందేహిస్తూ ఉంటాడు. ఇక అరవిందైతే కచ్చితంగా అవార్డు తీసుకోడు అని అనుకుంటుంది ఇక కృష్ణ మనసులో ఇది కదా నాకు కావాల్సింది ఇప్పుడు అవార్డు తీసుకోకుండా విక్కి వెళ్లిపోతాడు నేను చాలా కష్టపడి వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది అని అనుకుంటూ ఉంటాడు ఇక రమేష్ చంద్ర వద్దండి నేను కాదు అవార్డు మీరే ఇవ్వండి అని అంటే లేదు సార్ మీరు మీ అబ్బాయి కదా ఇస్తే మీకు ఆనందం వేరేగా ఉంటుంది మీరు ఇది కాదనకండి అని బలవంతంగా రమేష్ చంద్ర ని అవార్డు ఇవ్వమని అంటారు.ఇక విక్కీ ని స్టేజి మీదకి పిలుస్తారు విక్కి అప్పటికే చాలా కోపంగా రగిలిపోతూ ఉంటాడు కానీ ఏమి చేయలేక అరవింద్ కి ఇచ్చిన మాట కోసం సైలెంట్గా స్టేజి మీదకి వెళ్తాడు ఇక రమేష్ చంద్రని, కోపంగా చూస్తూ ఉంటాడు ఇక తప్పక రమేష్ చంద్రశేఖర్ మీదగా ఇచ్చిన అవార్డును తీసుకొని సైలెంట్గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక నారాయణ దగ్గరికి వచ్చిన రమేష్ చంద్ర విక్కీ నా చేతుల మీదుగా అవార్డు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అని అంటాడు. ఇక అక్కడే ఉన్న కృష్ణ అనంత రివర్స్ అయింది అరవింద్ కోసం వికీ సైలెంట్ గా అవార్డు తీసుకున్నాడు ఎంతో గొడవ జరుగుతుందని ఊహించుకుంటే ఏమీ లేకుండా ప్లాన్ అంతా ఇలా రివర్స్ అయింది ఏంటి అని బాధపడుతూ ఉంటాడు.

Nuvvu Nenu Prema Today Episode March 8 2024 Episode 566 Highlights
Nuvvu Nenu Prema Today Episode March 8 2024 Episode 566 Highlights

ఇక అందరూ ఇంటికి చేరుతారు ఇక కృష్ణ అక్కడ ప్లాన్ రివర్స్ అయితే ఏంటి ఇక్కడ మళ్ళీ అమలు చేస్తాను కదా అని కావాలని విక్కీతో ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది విక్కీ నువ్వు మీ నాన్నగారు చేతుల మీద అవార్డు తీసుకున్నావు ఇప్పటివరకు మీ నాన్న ఎవరో ప్రపంచానికి తెలియదు ఈ అవార్డు ఫంక్షన్ ద్వారా అది అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు రమేష్ చంద్రప్రసాద్ అంటే అందరికీ తెలుసు విక్కీ పాదా రమేష్ చంద్రప్రసాద్ అయిపోయాడు అసలు అవార్డు ఫంక్షన్ నీ కన్నా మీ నాన్నకి ఎక్కువ గుర్తింపు వచ్చింది అని అనడంతో విక్కి ఒకసారిగా కోపంతో స్టాప్ ఇట్ అని అరుస్తాడు. ఇంతటి మాట్లాడింది చాలు ఆపు అని అంటాడు ఇక రమేష్ చంద్ర దగ్గరికి వచ్చి అసలు మీరు అవార్డు ఫంక్షన్ కి ఎందుకు వచ్చారు అని అంటే రమేష్ చంద్ర లేదు బాబు నేను చెప్పేది విను అని అంటాడు. ఏంటి మీరు చెప్తే నేను వినేది మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు మేము కొంచెం సంతోషంగా మా అమ్మ జ్ఞాపకాలతో బతకాలనుకుంటున్నాము అలాంటి జ్ఞాపకాలు ఉండి మమ్మల్ని దూరం చేసి మమ్మల్ని చంపడానికి మీరు ఈ ఫంక్షన్ కి వచ్చారు కదా అని అంటాడు నేను ఎంత వద్దంటున్నా ఈ ఇంట్లో స్థానం కల్పించుకొని ఇంట్లో స్థిరపడిపోయారు. అని రమేష్ చంద్ర మీద కోప్పడుతూ ఉంటే పక్కనే ఉన్న దివ్య మేమేం గతిలేక మీ ఇంట్లో ఉండట్లేదు అని అంటుంది. ఇక అప్పుడే పద్మావతి కల్పించుకుని దివ్య వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా నువ్వెందుకు మధ్యలో మాట్లాడతావు సైలెంట్ గా ఉండు అని అంటుంది. పద్మావతిని విక్కీ గోపడతాడు అసలు నువ్వు ఇదంతాజరగడానికి కారణం అసలు ఇలాంటి వాళ్లను లోపలికి తీసుకురావద్దు అంటే విన్నావా అని అంటాడు ఇక పద్మావతి మాట్లాడటం మొదలు పెడుతుంది.అవును సార్ ఒక పెద్దాయన తన కొడుకు కోసం బాధపడుతూ ఉంటే ఇంటికి తీసుకురావడం తప్పైపోయిందా అని అంటుంది ఇక ఇక్కడ తో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది..

Nuvvu Nenu Prema Today Episode March 8 2024 Episode 566 Highlights
Nuvvu Nenu Prema Today Episode March 8 2024 Episode 566 Highlights

రేపటి ఎపిసోడ్లో పద్మావతి పాల గ్లాస్ తీసుకొని విక్కీ దగ్గరికి వస్తుంది మీరు పాలు తాగండి సారు అని అంటుంది ముందు నువ్వు తాగు అని అంటాడు ఏంటి సార్ ఇవాళ కొత్తగా కనిపిస్తున్నారు అని అంటే 12 గంటలకు నీకు పుట్టినరోజు కదా ఇప్పుడు 12 అవ్వగానే నీకు హ్యాపీ బర్త్డే చెప్పి నా మనసులో ఉన్న ప్రేమని కూడా బయట పెడతాను అని అనుకుంటాడు. విక్కీని పద్మావతి అని చూస్తూ ఉంటుంది విక్కీ ముందు నువ్వు పాలు తాగు అని అంటాడు. పద్మావతి పాలు తాగిన తర్వాత తన మూతికి పాలమీగడ అంటుకుంటుంది నేను తుడుస్తాను ఉండు అని విక్కీ ప్రేమగా పద్మావతి మూతి మీద ఉన్న మీగడని తుడుస్తూ ఉంటాడు. ఇక పద్మావతి ఏంటి సారు మీలో ఎంత మార్పు వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది.

Related posts

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri