NewsOrbit
Entertainment News OTT సినిమా

Akkineni Naga Chaitanya: నాగచైతన్య బర్త్ డే నేపథ్యంలో కెరియర్ లో ఫస్ట్ వెబ్ సిరీస్ “దూత” ట్రైలర్ రిలీజ్..!!

Akkineni Naga Chaitanya: నవంబర్ 23 అక్కినేని నాగచైతన్య పుట్టినరోజు. దీంతో ప్రతి ఏడాది తన పుట్టినరోజు కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంటూ ఉంటారు. తన బర్త్ డే నాడు వాళ్ల దగ్గరే తన ఆనందాన్ని పొందుతానని చాలా సందర్భాలలో.. తెలియజేయడం జరిగింది. కానీ రీసెంట్ గా చైతూ పుట్టినరోజుకు కొద్దిరోజుల ముందు అభిమానుల ఇళ్లకు సడన్ గా వెళ్లి.. వాళ్ళని సర్ప్రైజ్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే నేడు పుట్టినరోజు సందర్భంగా తన కెరియర్ లో మొదటి వెబ్ సిరీస్ “దూత” ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మించింది. గత ఏడాది విడుదల కావలసిన “దూత” వెబ్ సిరీస్ కొన్ని అన్నివార్య కారణాలతో వాయిదా పడగా మళ్లీ ఇప్పుడు విడుదలకు సిద్ధమయ్యింది.

On the occasion of Naga Chaitanya birthday Dhootha web series Trailer released

దాదాపు 40 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ సిరీస్ నీ మనం ఇంకా 24 వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. ప్రియా భవాని శంకర్, పార్వతి, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. డిసెంబర్ మొదటి తారీకు నుంచి ఈ సిరీస్ అమెజాన్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సీజన్ 1 .. 40 నిమిషాల నిడివితో ఎనిమిది ఎపిసోడ్స్.. ఐదు భాషలలో రానున్నట్లు ట్రైలర్ లో తెలియజేయడం జరిగింది. ట్రైలర్ బట్టి చూస్తే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో “దూత” వెబ్ సిరీస్ చిత్రీకరించారు. జర్నలిస్టు పాత్రలో నాగచైతన్య కనిపిస్తున్నారు. ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో ఈ వెబ్ సిరీస్ చిత్రీకరించడం జరిగింది. నేడు నాగచైతన్య పుట్టినరోజు నేపథ్యంలో విడుదలైన “దూత” వెబ్ సిరీస్ ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అక్కినేని నాగార్జున వారసుడిగా 2009లో నాగచైతన్య “జోష్” సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు.

On the occasion of Naga Chaitanya birthday Dhootha web series Trailer released

ఆ తర్వాత 2010లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో “ఏ మాయ చేసావే” సినిమాతో సూపర్ హిట్ అందుకోవడం జరిగింది. సమంత నాగచైతన్య జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో యూత్ నీ అంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో “100% లవ్” సినిమాతో చైతూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అనంతరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తే ఇప్పటివరకు 27 సినిమాలలో నటించడం జరిగింది. ఒక్క తెలుగులో మాత్రమే కాక బాలీవుడ్ లో కూడా నాగచైతన్య సినిమాలు చేశారు. 2017లో సమంతతో పెళ్లి నాలుగు సంవత్సరాలకు విడాకులు తీసుకోవటం చైతు కెరియర్ కి అతి పెద్ద దెబ్బ. అయినా గాని నాగచైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో “తండేల్” అనే సినిమా చేస్తున్నారు. అయితే ఫస్ట్ టైం వెబ్ సిరీస్ నేపథ్యంలో నాగచైతన్య నటించిన దూత ట్రైలర్.. ఆయన బర్త్ డే కానుకగా సినిమా యూనిట్ విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. “దూత” వెబ్ సిరీస్ డిసెంబర్ మొదటి తారీకు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది.

Related posts

Nuvvu Nenu Prema Feburavy 22 2024 Episode 553: పద్మావతి ఫుల్ ఖుషి.. రమేష్ చంద్రను కాపాడిన విక్కీ..

bharani jella

Krishna Mukunda Murari February 22 2024 Episode 400: ముకుందపై ఓ కన్నేసిన కృష్ణ.. ఫాఫం ముకుంద కృష్ణ ప్లాన్స్ కి చిత్తు చిత్తు..

bharani jella

Tripti Dimri: ఆ సీన్ కి మా పేరెంట్స్ ఒప్పుకోలేదు “యానిమల్” బ్యూటీ త్రిప్తి దిమ్రీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Salaar Cease Fire: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన “సలార్”..!!

sekhar

Guppedantha Manasu February 21 2024 Episode  1005: మను మహేంద్ర వాళ్ళ ఇంటికి భోజనానికి వెళతాడా లేదా.

siddhu

Prabhas: మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ నీ నిరూత్సాహపరిచిన “కల్కి 2898AD” సినిమా యూనిట్..?

sekhar

Paluke Bangaramayenaa February 21 2024 Episode 157: స్టేషన్లో వైజయంతికి వార్నింగ్ ఇచ్చిన స్వర..

siddhu

Mamagaru February 21 2024 Episode 141: పవన్ ని చితకొట్టి సిరిని కాపాడిన గంగాధర్..

siddhu

Madhuranagarilo February 21 2024 Episode 293: నిజం తెలుసుకున్న రాదా  వెళ్లి పోతుందా,ప్రాణాపాయ స్థితిలో శ్యామ్

siddhu

Bootcut Balaraju: OTT లోకి బిగ్ బాస్ సయ్యద్ సోహైల్ “బూట్‌కట్ బాలరాజు”..?

sekhar

Naga Chaitanya: సమంతా కోసం ప్రత్యేకమైన వీడియోని షేర్ చేసిన చైతు.. సంతోషంలో ఫ్యాన్స్..!

Saranya Koduri

Politics: రాజకీయాల్లో ఆరితేరిన ఫుడ్ షాప్ కుమారి ఆంటీ.. తీసుకునేది ఒకడి దగ్గర ఓటు మాత్రం మరొకడికి..!

Saranya Koduri

Deepika Padukone: అమ్మతనానికి నోచుకున్న దీపిక పదుకోన్.. బేబీ బంప్ తో ఫొటోస్..!

Saranya Koduri

Chiranjeevi: అమ్మ దీనమ్మ.. చిరు – సురేఖ మధ్య ఏకంగా అన్నేళ్ల ఏజ్ గ్యాపా.. ఎవరు పెద్దంటే..!

Saranya Koduri

ఫ్యాన్స్ కోసం జాక్ పాట్ ఆఫర్ ప్రకటించిన మహేశ్.. 100 జన్మలు ఎత్తిన రాని ఛాన్స్.. పండగ చేసుకోండ్రా అబ్బాయ్ లు..!

Saranya Koduri