NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Ram Charan: ఏపీ రిజల్ట్స్ తర్వాత రోజే పిఠాపురంకి రాబోతున్న రామ్ చరణ్..!!

Ram Charan: జూన్ 4వ తారీఖు ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. పవన్ గెలుపు కోసం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలామంది నటీనటులు పిఠాపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మెగా కుటుంబ సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది. ఎన్నికల ప్రచారం చివరి రోజు రామ్ చరణ్ తేజ్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా పర్యటించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీ ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత రోజే రామ్ చరణ్ పిఠాపురంలో పర్యటించబోతున్నారు.

Ram Charan coming to Pithapuran the day after AP results

విషయంలోకి వెళ్తే ఫలితాలు వచ్చిన తర్వాత రోజే పిఠాపురంలో హీరో శర్వానంద్ మూవీ ఈవెంట్ జరగనుంది. ఆయన నటించిన “మనమే” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరుకాబోతున్నారు. మెగా ఫ్యామిలీకి శర్వానంద్ చిన్నప్పటినుండి బాగా క్లోజ్. రామ్ చరణ్ కి చిన్నప్పటి నుంచి శర్వానంద్ స్నేహితుడు. అంతేకాదు “మనమే” నిర్మిస్తున్న యువి క్రియేషన్స్ బ్యానర్ కీలక వ్యక్తుల్లో ఒకరైన నిర్మాత విక్రం కూడా వాళ్ళిద్దరికీ బాగా క్లోజ్. దీంతో స్నేహితుల కోసం రామ్ చరణ్ … జూన్ 5వ తారీఖు పిఠాపురంలో “మనమే” ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు.

Ram Charan coming to Pithapuran the day after AP results

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నట్లు ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ లో ఫలితాలు రావడం జరిగాయి. దీంతో ఎన్నికల ఫలితాల మరుసటిరోజే పిఠాపురంలో రాంచరణ్ పర్యటన ఖరారు కావడంతో నియోజకవర్గంలో సందడి వాతావరణం నెలకొంది. 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకొని ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని పిఠాపురం నుండి పోటీ చేయడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో కూడా భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. గతంలో కంటే పోటీ చేసే నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానికంగా ఉన్న నాయకులతో కార్యకర్తలతో భేటీ అయ్యారు. ప్రత్యేకంగా పిఠాపురం నియోజకవర్గానికి పలు హామీలు కూడా ప్రకటించడం జరిగింది. మరి పిఠాపురం ప్రజలు ఎంత మెజారిటీతో పవన్ ని గెలిపించారో రేపు తెలియనుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella