NewsOrbit
సినిమా

Sarkaru Vaari Paata Trailer: `సర్కారు వారి పాట` ట్రైలర్ వ‌చ్చేసింది.. మ‌హేశ్ మెంట‌లెక్కించేశాడు!

Sarkaru Vaari Paata Trailer: `సరిలేరు నీకెవ్వరు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీ అనంత‌రం సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు చేసిన తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ మే12న విడుద‌ల కాబోతోంది.

ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌, గ్లింప్స్‌, సాంగ్స్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను పెంచ‌గా.. మ‌రింత హైప్ క్రియేట్ చేసేందుకు మేక‌ర్స్ వ‌రుస అప్డేట్స్ ఇవ్వ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా స‌ర్కారు వారి పాట థియేట్రికల్ ట్రైలర్‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు. `నా ప్రేమను దొంగిలించగలవ్.. నా స్నేహాన్నీ దొంగిలించగలవ్.. కానీ నువ్వు నా డబ్బుని మాత్రం దొగించలేవ్` అంటూ మహేష్ బాబు చెప్పే డైలాగ్ తో ప్రారంభ‌మైన ఈ ట్రైల‌ర్ ఆద్యంతం విశేషంగా ఆక‌ట్టుకుంది.

కీర్తి సురేశ్‌-మహేశ్‌ బాబుల లుక్స్‌, వారి మ‌ధ్య‌ రొమాంటిక్ సీన్స్‌, అల‌రించే డైలాగ్స్, యాక్ష‌న్ స‌న్నివేశాలు అదిరిపోయాయ‌ని చెప్పాలి. `అమ్మాయిలను అప్పు ఇచ్చేవాళ్లను పాంపర్ చేయాలిరా.. రఫ్ గా హ్యాండిల్ చేయకూడదు`, `నేను విన్నాను.. నేను వున్నాను..`, `దిస్ ఈజ్ మహేశ్‌.. రిపోర్టింగ్ ఫ్రమ్ చేపలపూడి బీచ్ సర్` వంటి డైలాగ్స్ మ‌హేశ్ మెంట‌లెక్కించేశాడు.

కామెడీ, ల‌వ్‌, యాక్ష‌న్.. ఇలా అన్నీ సినిమాలో ఉండ‌బోతున్నార‌ని ట్రైల‌ర్ బ‌ట్టీ స్ప‌ష్టంగా అర్థ‌మైంది. మొత్తానికి అద్భుతంగా ఉన్న ఈ ట్రైల‌ర్ సినిమాపై హైప్‌ను వేరె లెవ‌ల్‌కి తీసుకెళ్లింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా, బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణం నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సముద్ర ఖని విలన్ గా కనిపించ‌బోతుండ‌గా.. త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చాడు.

Related posts

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Karthika Deepam 2 June 5th 2024: నరసింహ మెడపై కత్తిపీట పెట్టి వార్నింగ్ ఇచ్చిన దీప.. హడలిపోయిన శోభ, అనసూయ..!

Saranya Koduri

Naga Chaitanya: వ‌రుస‌గా రెండు డిజాస్ట‌ర్లు.. అయినా తండేల్ చిత్రానికి చైతు రెమ్యున‌రేష‌న్ అన్ని కోట్లా..?

kavya N

RK Roja: అసెంబ్లీ ఎన్నికల్లో ప‌రాజ‌యం.. రోజా రూటు మ‌ళ్లీ జబర్దస్త్ వైపేనా..?

kavya N