NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani February 29 2024 Episode 1176: తిలోత్తమ చచ్చిపోయిందని ఏడుస్తున్న హాసిని..

Trinayani Today Episode February 29 2024 Episode  1176 Highlights

Trinayani February 29 2024 Episode 1176:  అమ్మ ఎవరూ లేరేంటి అని వల్లభ అంటాడు. గాయత్రీ ని హాసిని అయినా పావనమూర్తి ఎత్తుకొస్తే అఖండ స్వామి దగ్గరికి తీసుకువెళ్లాలి రా అని తిలోత్తమ అంటుంది.ఏడిస్తే ఏం చేస్తావ్ అమ్మ అని వల్లభ అంటాడు. అఖండ స్వామి ఇచ్చిన మూలిక ఉంది కద రా అది వాసన చూపిస్తే చాలు పడుకుంటుంది అని తిలోత్తమ అంటుంది. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దామని వల్లభ మూలికను తీసి తిలోత్తమముక్కు దగ్గర పెడతాడు వాసన తీసుకున్న తిలోత్తమ స్పృహ తప్పి పడిపోతుంది. మమ్మీ లే అని వల్లభ లేపుతుండగా అందరూ అక్కడికి వస్తారు. ఏమైంది అల్లుడు అని పావని మూర్తి అంటాడు. చచ్చిపోయింది పిన్ని అని హాసిని అంటుంది. సోపాలో పడుకోబెటు అల్లుడు అని దురంధర అంటుంది. సోఫాలో ఎందుకు పిన్ని కింద పడుకోబెట్టండి దాన్ని అని హాసిని తీసుకువచ్చి తినోత్తమని కింద పడుకోబెడుతుంది. కట్ చేస్తే అందరూ వస్తారు.అమ్మకు ఏమైంది అని విక్రాంత్ అంటాడు.. వదిన ఉన్నట్టుండి పడిపోవడం చూశాను నైని అని దురంధర అంటుంది.

Trinayani Today Episode February 29 2024 Episode  1176 Highlights
Trinayani Today Episode February 29 2024 Episode 1176 Highlights

లోబిపేమో అని విశాల్ అంటాడు. పాపికి లోబీపీ ఉందని తెలుసు విశాల్ అని హాసిని అంటుంది. మా అమ్మను పాపి అంటావేంటి అని వల్లభ అంటాడు. నువ్వు ఆగు బ్రో వదిన నువ్వు చెప్పు అని నిక్రాంత్ అంటాడు. అయ్యో దుక్కలా ఉండేది మన అత్త పోయింది చెల్లి అని హాసిని ఏడుస్తుంది. ఏ చచ్చిపోయి ఉండేదే అని వల్లభ అంటాడు. అసలేం జరిగింది అని డమ్మక్క అంటుంది. తల్లి కొడుకులు ఇద్దరే ఉన్నారు అని హాసిని అంటుంది. ఏం జరిగిందో ఏమో హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి అని విశాల్ అంటాడు. బాబు గారు డాక్టర్ ని ఇంటికి పిలిపించండి అని నైని అంటుంది. డాక్టర్ ఎందుకు గాలి ఉత్తే సరిపోతుంది అని హాసిని అంటుంది. ఎవరు ఊదుతారు అని దురంధర అంటుంది. మగవాళ్ళని పక్కన పెడితే ఆడవాళ్లు ఊదొచ్చు అని డమ్మక్క అంటుంది. ముద్దుల కోడలువి కదా సుమన నువ్వే అమ్మకి ఊపిరి ఊదు అని విక్రాంత్ అంటాడు. అక్క నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని సుమన అంటుంది. అత్తయ్య నెమ్మదిగా కోలుకుంటారు అనిపిస్తుంది అని నైని అంటుంది. మత్తు మూలిక వల్ల ఇలా జరిగిందని నిజం చెప్పేస్తే అందరూ నన్ను చంపేసేలా ఉన్నారు అని వల్లభ అనుకుంటాడు. డాక్టర్ కి ఫోన్ చేద్దాం అని విశాల్ అంటాడు.

Trinayani Today Episode February 29 2024 Episode  1176 Highlights
Trinayani Today Episode February 29 2024 Episode 1176 Highlights

వద్దు విశాల్ బాబు చిటీకెన వేలు పట్టి లాగితే ప్రాణం లేచేస్తుంది అని డమ్మక్క చెబుతుంది. హాసిని అక్క లాగాలి అని సుమన అంటుంది. హాసిని తిలోత్తమ చిటికెన వేలు పట్టి లాగుతూ ఉంటుంది. నైని ఒక కాలు హాసిని ఒక కాలు పట్టుకొని చిటికెన వేలు లాగుతూ ఉంటారు. స్పృహ వస్తుంది చూడండి అని డమ్మక్క అంటుంది. జాగ్రత్తగా లే అమ్మ అని వల్లభ లేపి కూర్చో పెడతాడు. ఎక్కడున్నాను నేను అని తిలోత్తమ అంటుంది. హాల్లో ఉన్నారా అత్తయ్య అని నైని అంటుంది. ఊటీ లో ఉన్నాను అనుకుంటున్నారా బతికిపోయారు అని హాసిని అంటుంది. తిలోత్తమ లేచి వల్లభ చంప పగల కొడుతుంది. ఇలా అవుతుందని అనుకోలేదమ్మా అని వల్లభ అంటాడు. అమ్మ కొట్టింది అంటే అన్నయ్య ఏదో చేసి ఉంటావు అని విశాల్ అంటాడు. బావగారు ఏం చేశారు అని అంటుంది నైని. ఆకలేస్తుంది అంటే చూస్తూ ఉన్నాడు కళ్ళు తిరిగి పడిపోయిందాకా అందుకే కొట్టాను అని తిలోత్తమ అంటుంది. నాకు చెప్పాల్సింది కదా అత్తయ్య అని సుమన అంటుంది.

Trinayani Today Episode February 29 2024 Episode  1176 Highlights
Trinayani Today Episode February 29 2024 Episode 1176 Highlights

సర్లే పిల్లలేం చేస్తున్నారు అని తిలోత్తమ అంటుంది. పిల్లలతో ఆడుకున్న అలసిపోతావ్ అమ్మ వెళ్లి రెస్ట్ తీసుకో అని విశాల్ అంటాడు. పాలు తాగి రెస్ట్ తీసుకోండి అత్తయ్య అని నైని అంటుంది. పాలు నేను తీసుకొస్తాను అంటూ హాసిని కిచెన్ లోకి వెళుతుంది. కట్ చేస్తే,రెండు గిన్నెలో పాలు ఉన్నాయి ఆవు పాలు గేదె పాలు అనే వేరువేరుగా పెట్టిందా చెల్లి అని హాసిని అనుకుంటుంది. అన్నయ్య అమ్మని సోఫాలో కూర్చోబెట్టు అని విశాల్ అంటాడు. అమ్మ ఇప్పుడు ఎలా ఉంది అని విశాల్ అంటాడు. కొంచెం నీరసంగా ఉంది అని తిలోత్తమ అంటుంది.హాసిని అక్క పాలు తీసుకొస్తుంది గా తగ్గిపోతుందిలే అత్తయ్య అని నైని అంటుంది. అవును ఆవిడకి ఆవుపాలెందుకు బర్రె పాలే తీసుకువెళ్దాం అసలు ఇందులో ఆవుపాలేవీ బర్రె పలేవి తెలియట్లేదే అని రెండు తీసుకొని వస్తుంది హాసిని.  అత్తయ్య ఎందుకో గందరగోళంగా కనబడుతున్నారు అని నైని అంటుంది. గందరగోళం గా ఉంది నాకు చెల్లి అని హాసిని అంటుంది. ఏమైంది అక్క అని సుమన అంటుంది.రెండు గిన్నెలోపాలు ఉన్నాయి ఈ రెండిట్లో ఆవు పాలు ఏవో గేద పాలు ఏవో అర్థం కావట్లేదు అని హాసిని అంటుంది.

Trinayani Today Episode February 29 2024 Episode  1176 Highlights
Trinayani Today Episode February 29 2024 Episode 1176 Highlights

ఒకే గిన్నెలో పాలు పెట్టాను కదా సుమన నువ్వేమైనా పాప కోసం పాలు తీసుకొచ్చావా అని నైని అడుగుతుంది.పాల కోసం గేటుదాకా కూడా వెళ్లదు అది పాలు ఎక్కడ తీసుకొస్తుంది వదిన అని విక్రాంత్ అంటాడు. ఎవ్వరూ తేలేదంటే ఎవరు తెచ్చి పెట్టారో గుర్తుపట్టాలి అని డమ్మక్క అంటుంది. తిలోత్తమ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. గాయత్రికి మత్తుమందు కలిపిన పాలు తాగిస్తే పడుంటుంది అఖండ స్వామి ఇచ్చిన మూలికను ఇంకోరకంగా ఉపయోగించవచ్చు అని అనుకుంటుంది తిలోత్తమ. ఏ పాలు అయితే ఏముంది ఆరోగ్యానికి మంచిదే కదా వదిన గ్లాసులో పాలు పోసి అమ్మకి ఇవ్వు అని విశాల్ అంటాడు. వద్దు విశాల్ అని తిలోత్తమ అంటుంది. వద్దంటావేంటమ్మా అని విశాల్ అంటాడు.

Trinayani Today Episode February 29 2024 Episode  1176 Highlights
Trinayani Today Episode February 29 2024 Episode 1176 Highlights

ఇప్పుడు పాలు తాగబుద్ధి కావట్లేదు అని తిలోత్తమ అంటుంది. నీరసంగా ఉందన్నావుగా ఎందుకు వద్దు  అత్తయ్య అని నైని అంటుంది. వేడిగా లేవు కదా అని తిలోత్తమ అంటుంది. ముగ్గురు కోడలు ఉన్నారు వేడి చేసుకుని వస్తారులే వదిన అని దురంధర అంటుంది. ఇప్పుడు వేడి చేసుకురావాలా అని సుమన అంటుంది. నాకు ఈ గిన్నెలో పాలొద్దు అని తిలోత్తమ అంటుంది. వేరే గిన్నెలో పాలు తాగు మమ్మీ అని వల్లభ అంటాడు.సరే  వేరే గిన్నెలో పాలుపోయండి అని విశాల్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri