NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani March 13 2024 Episode 1187: తిలోత్తమ కి వల్లభకి చెవులు వినపడ లేదని తిడుతున్నా హాసిని..

Trinayani Today Episode March 13 2024 Episode 1187 highlights

Trinayani March 13  2024 Episode 1187: ఇద్దరికీ ఒకేసారి చెవులు వినిపించకపోవడమేంటి అని సుమన అంటుంది.వినిపిస్తే కదా అడగడానికి ఇప్పుడు అడిగినా చెప్పలేరు అని విక్రాంత్ అంటాడు.కట్ చేస్తే, శివ హాయిగా నిద్రపోయావా అని నైని అడుగుతుంది. నువ్వంటే హాయిగా ఇంట్లో మంచం మీద పడుకుంటావు నేను ఏ చెట్టుకొమ్మనో గోడల మీద భయం భయంగా పడుకోవాలి అని శివ అంటాడు. నీకు భయం ఎందుకు శివ అని నైని అడుగుతుంది. మొగుళ్ళని పట్టించుకోని వాళ్లను చూస్తే భయమేయదా మరి అని శివ అంటాడు. ఎవరున్నారు శివ అలా అని నైని అడుగుతుంది. ఒకరు మీ తిలోత్తమ అత్తయ్య ఇంకొకరు సుమన అసలు మొగుణ్ణి పట్టించుకుంటుందా అని శివ అంటాడు. చెల్లి విషయంలో అదొక్కటే బాధగా ఉంది శివ అని నైని అంటుంది. నీకు కష్టాలు తెచ్చి పెట్టాలనే మీ చెల్లి సుఖంగా ఉండాలని కోరుకుంటావా అని శివ అంటాడు.

Trinayani Today Episode March 13 2024 Episode 1187 highlights
Trinayani Today Episode March 13 2024 Episode 1187 highlights

అది నైని మంచి మనసు శివ అని విశాల్ అంటాడు. ఇక్కడ ఉంది కాబట్టి ఊరుకుంటున్నాను అదే ముక్కంటి పురం లో ఉంటే మూడు చర్ల నీళ్లు తాగించేవాన్ని అని శివ అంటాడు. ఇంతలో నైనికి కలలో లలితా దేవికి జైకి రక్తం అంటుకున్నట్టు కనిపిస్తుంది. విశాలాక్షమ్మ తల్లి పెద్దమ్మ గారి చెయ్యికి రక్తం అంటుకుంది ఏం జరుగుతుంది అని కంగారు పడుతుంది నైని.నైని ఏం ఆలోచిస్తున్నావ్ అని విశాల్ అంటాడు. ఏమీ లేదు బాబు గారు అని నైని అంటుంది. మీ ఆవిడ అప్పుడప్పుడు హనీ లోపలికి వెళ్ళొస్తుంటుందిలే బుల్లి అబ్బాయి అని శివ అంటాడు. పెద్దమ్మ ఫోన్ చేసింది రేపు పొద్దున ఇక్కడికి వస్తానన్నది అని విశాల్ అంటాడు. ఎందుకు బాబు గారు ఏదైనా పని ఉంటే మనమే అక్కడికి వెళ్దాం అని నైని అంటుంది. పెద్దమ్మ వస్తానన్నాక రాకపోతే ఊరుకోదు అని విశాల్ అంటాడు. కట్ చేస్తే, హాసిని తిలోత్తమ్మ ఫోన్ ఎత్తి మాట్లాడుతుంది. ఒరేయ్ అది నా ఫోన్ ఎత్తి మాట్లాడుతుంది లాక్కోరా అని తిలోత్తమ అంటుంది.

Trinayani Today Episode March 13 2024 Episode 1187 highlights
Trinayani Today Episode March 13 2024 Episode 1187 highlights

నువ్వేం అంటున్నావో నాకు అర్థం కావట్లేదు మమ్మీ అని వల్లభ అంటాడు. ఒరేయ్ నీ భార్య ఎవరితో మాట్లాడుతుంది చూడరా అని తిలోత్తమ అంటుంది. హాసిని నీ ఫోన్ మాట్లాడుతుందనే కదా నీ భయం అని వల్లభ ఫోను తీసుకోబోయి హాసినిని పట్టుకుంటాడు. రేయ్ ఫోన్ తీసుకోమంటే నీ పెళ్ళాన్ని పట్టుకుంటావేంట్రా అని తిలోత్తమ ఫోన్ తీసుకుంటుంది. హలో పాండి ఇప్పుడు నువ్వేం చెప్పినా నాకు వినపడదు నేను తర్వాత ఫోన్ చేస్తాను అని తిలోత్తమ ఫోన్ కట్ చేస్తుంది. హాసిని వల్లభని తిడుతుంది. నా కొడుకుని నువ్వు తిడుతున్నావ్ కదు అని తిలోత్తమ అంటుంది. వేస్ట్ ఫెలో అని చెవి పట్టుకొని అంటుంది హాసిని. నువ్వు తిట్టినా తిట్టకపోయినా అసలు ఎందుకు వచ్చావో చెప్పు అని తిలోత్తమ అంటుంది. విశాల్ వాళ్ళ పెద్దమ్మ వస్తుంది అని హాసిని అంటుంది.వినపడట్లేదు గట్టిగా చెప్పు అని వల్లభ అంటాడు. విశాల్ వాళ్ళ పెద్దమ్మ వస్తుంది అని హాసిని అంటుంది. కట్ చేస్తే, అందరూ హాల్లో మీటింగ్ పెడతారు . వాళ్లకు ఏమీ మాట్లాడిన వినపడదు అని హాసిని చిటికె వేసి చెబుతుంది. అమ్మ ఇది మనల్ని ఏదో తిడుతున్నట్టు ఉంది అని వల్లభ అంటాడు. నోరు తెరిస్తే చెంపలు వాస్తాయి అని హాసిని అంటుంది. సమయం వచ్చిందని రెచ్చిపోవచ్చు కానీ టైం బాగోలేకపోతే ప్రాబ్లం అవుతుంది అని విశాల్ అంటాడు. వదిన ఏమి తోచక హాల్లోకి వచ్చిన వాళ్ళని వదిలేయ్ అని విక్రాంత్ అంటాడు.

Trinayani Today Episode March 13 2024 Episode 1187 highlights
Trinayani Today Episode March 13 2024 Episode 1187 highlights

తిలోత్తమ ఆ చీర చూశారా అని డమ్మక్క అంటుంది. ఎవరిది చీర అని తిలోత్తమ అంటుంది. తిలోత్తమ అత్తయ్యకి చెవులు వినిపించకపోయిన చీరను చూసి గుర్తుపట్టింది అని నైని అంటుంది. బావగారు ఇప్పుడు ఆ చీర ఎందుకు తీశారు అని సుమన అడుగుతుంది. మా అమ్మ శుక్లపక్షమి నాడు కట్టుకొని పూజ చేసేది అందుకే ఈరోజు పూజలో పెట్టి ఇంట్లో పెట్టమని నేనే చెప్పాను అని విశాల్ అంటాడు. నైని చీర తీసి లోపల పెట్టు అని విశాల్ అంటాడు. నైని ఆగు అని తిలోత్తమ అంటుంది. ఆ చీర ఎవరిది ఎందుకు తీశారు అని వల్లభ అంటాడు. ఆ చీర పెద్ద అత్తయ్యది బావగారు అని హాసిని అంటుంది. ఇది పెద్దమ్మ చీర అని విశాల్ ఇందాకే చెప్పాడు కదా అని విక్రాంత్ అంటాడు. మీరేం చెప్తున్నారో మాకేం అర్థం కావట్లేదు అని తిలోత్తమ అంటుంది. అయ్యో వినపడట్లేదు అని విశాల్ నెత్తి కొట్టుకుంటాడు.హాసిని నువ్వైన అర్థమయ్యేలా చెప్పవే అని దురంధర అంటుంది. ఆ చీర కట్టుకొని అత్తయ్య వెళ్తే నువ్వు ఆరోజు చంపేసావు కదా చెప్పు అని తిలోత్తమని వల్లభని కొడుతుంది హాసిని. ఏ వద్దులేవే మాకు అర్థమైంది అని తిలోత్తమ అంటుంది.ఏం అర్ధం అయ్యిందో చెప్పు అని హాసిని అంటుంది.

Trinayani Today Episode March 13 2024 Episode 1187 highlights
Trinayani Today Episode March 13 2024 Episode 1187 highlights

గాయత్రి అక్క ఆ చీర కట్టుకొని పుట్టలో పాలు పోసింది అని తిలోత్తమ అంటుంది. అది విన్న విశాల్ చప్పట్లు కొడతాడు. చూశారా బాబు గారు హాసిని అక్క హావ భావాలతో ఎలా అర్థమయ్యేలా చెప్పిందో అని నైని అంటుంది. చెప్పడమేమో కానీ అత్తయ్యని బావని కొట్టి చంపేస్తుందేమో అని భయం వేసింది అని సుమన అంటుంది.అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అనవసరం అని తిలోత్తమ అంటుంది. ఈ చీరతో నీకేం పని అత్తయ్య అని నైని అంటుంది. ఈ చీరతో నీకేం పని అని మీరందరూ అనుకోవచ్చు గాయత్రి అక్క ఆ చీర కట్టుకొని పుట్టలో పోసుకుంది కాబట్టి ఈరోజు నా భుజం మీద ఉంటే బాగుంటుంది అని తిలోత్తమ అంటుంది. కట్టుకోనప్పుడు భుజం మీద ఉంటే ఏంటి లాభం అత్తయ్య అని సుమన అంటుంది. చీర ఇవ్వను అంటున్నారా ఏమంటున్నారు అని వల్లభ అంటాడు. అది కాదు ఎందుకు అంటున్నారు అని దురంధర అంటుంది. మీరు ఏమైనా అనుకోండి చీర ఇస్తారా లేదా అని తిలోత్తమ అంటుంది.

Trinayani Today Episode March 13 2024 Episode 1187 highlights
Trinayani Today Episode March 13 2024 Episode 1187 highlights

బాబు గారు ఏమంటారు అని నైని అడుగుతుంది. పర్వాలేదులే నైని రేపు పొద్దున తీసి బీరువాలో పెట్టు అని విశాల్ అంటాడు. నైనీ ఆ చీర తీసుకువెళ్లి తిలోత్తమ భుజం మీద వేస్తుంది. ఓహో చీర అడిగావా మమ్మీ ఇంతకీ ఆ చీర ఎవరిది అని వల్లభ అంటాడు. నీ చెవిటి నమస్కారం వెళ్ళండి అని విక్రాంత్ అంటాడు. రా మమ్మీ లోపలికి వెళ్దాం అని తిలోత్తమని తీసుకొని వెళ్ళిపోతాడు వల్లభ. కట్ చేస్తే, గాయత్రి పాప తన ఫోటో దగ్గర నిలబడి చూస్తుంది. నీ ఫోటోని నువ్వే చూసుకుంటున్నావా అమ్మ అని డమ్మక్క అంటుంది. అక్కడ నీళ్లు పోస్తుంది గాయత్రి. ఈ నీళ్లు తిలోత్తమ కోసం పోసావా ఏది చేసినా తన చావేగా నీకు కావాల్సింది నీకు సహాయం చేస్తాను అని డమ్మక్క తిలోత్తమ గదిలోకి వెళుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri