NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani March 15 2024 Episode 1189: గాయత్రీ పాప పేరుమీద ఆస్తినంతా రాసిస్తాను అంటున్న లలితాదేవి..

Trinayani Today Episode March 15 2024 Episode 1189 highlights

Trinayani March 15 2024 Episode 1189:  సీసం పోసిన దరిద్రం పోయేది అని హాసిని అంటుంది. లలితా దేవి వస్తున్నారు అని డమ్మక్క అంటుంది. ఇంతలో లలితాదేవి వస్తుంది. నైని ఎదురు వెళ్లి తనని తీసుకొచ్చి మూట పక్కన పెట్టి తన చేతులు పట్టుకుని చూస్తూ ఉంటుంది. లలితా దేవి అక్క చేతులు ఎందుకు పట్టుకుని చూస్తున్నావు నైని అని తిలోత్తమ అడుగుతుంది. ఇంకా శాస్త్రి గారి మనవరాలు అనుకుని జాతకం చెప్పాలనుకుంటున్నావా నైని అని లలితా దేవి అంటుంది. వేల మందికి అన్నం పెట్టే ఈ చేతులు చల్లగా ఉండాలి అని నైని అంటుంది. తిలోత్తమ సుమనకి సైగ చేసి మూటలో ఏముందో అడుగు అని చెబుతుంది.ఇంతకీ పెద్ద అత్తయ్య గారు మూటలో ఏం తెచ్చిందో అని సుమన అంటుంది.ఆ మూటలో నాకు నా చెల్లికి సంబంధించిన ఆస్తి ఉంది అని లలితా దేవి అంటుంది. ఏదో విలువైనది చెబుతున్నారు ని అర్థమవుతుంది కానీ అదేంటో వినపడట్లేదు అని తిలోత్తమ అంటుంది.

Trinayani Today Episode March 15 2024 Episode 1189 highlights
Trinayani Today Episode March 15 2024 Episode 1189 highlights

మా నాన్న నాకు మా చెల్లికి ఆడపిల్లలమైన కోట్ల ఆస్తిని రాసిచ్చాడు అది నా పిల్లలు వద్దన్నారు విశాల్ కు ఇస్తానన్న ఆస్తి అంత పోయినప్పుడు కూడా వద్దన్నాడు అని లలితా దేవి అంటుంది. మరి ఇప్పుడు ఎందుకు తెచ్చారు అని నైని అడుగుతుంది. సుమన పేపర్లో మా చెల్లి ఫోటో వేయించి చాలా మంచి పని చేసింది అని లలితా దేవి అంటుంది. అదేంటమ్మా అలా అంటావు అని విశాల్ అంటాడు. ఏమంటున్నావ్ పెద్దమ్మ అని విక్రాంత్ అంటాడు. పెద్ద వదిన  ఫోటో పేపర్లో పడితే మంచి జరిగిందంటావేంటి వదిన అని దురంధర అంటుంది.అవును విశాల్ గాయత్రీ దేవి పునర్జన్మ ఎత్తి ఎక్కడో అక్కడ ఉంది ఆ విషయం ముందు మనకే తెలియాలి కానీ ఇంతవరకు తెలియలేదు అని లలితా దేవి అంటుంది. అందుకనే నిజం తెలుసుకోవాలని పేపర్లో వేయించాను ఎవరికైనా తెలిస్తే మనకు చెప్తారు కదా వీళ్ళు వద్దంటున్నారు అత్తయ్య అని సుమన అంటుంది.

Trinayani Today Episode March 15 2024 Episode 1189 highlights
Trinayani Today Episode March 15 2024 Episode 1189 highlights

నువ్వు కాసేపు నోరు మూస్తావా అని విక్రాంత్ అంటాడు. మాకు ఏమీ వినపడట్లేదు అని తిలోత్తమ అంటుంది. హాసిని ఎద్దులయ్య వాళ్ళ చెవుల్లో ఊదండి అని లలితా దేవి అంటుంది. హాసిని వెళ్లి తిలోత్తమ చెవిలో చెబుతుంది. ఎద్దులయ్య వల్లభ చెవులు చెబుతాడు. ఆస్తి ఇప్పుడు ఎందుకు తెచ్చింది అని తిలోత్తమ అంటుంది. పెద్దమ్మ ఆస్తి ఎందుకు తెచ్చినట్టు అని వల్ల అంటాడు. నా చెల్లెలు ఏ ఫోటో పేపర్లో పడ్డ కానుంచి అందరూ ప్రశ్నిస్తున్నారు అందుకే ఆస్తిని అంతా ఎవరి పేరు మీదనైనా రాయాలనుకుంటున్నాను అని లలితా దేవి అంటుంది. నేను పేపర్లో ప్రకటన ఇచ్చి మంచి పని చేశాను కాబట్టి ఆస్తి నా పేరు మీదే రాస్తుంది అని సుమన అనుకుంటుంది. ఎవరి పేరు మీద రాయాలనుకుంటున్నావ్ పెద్దమ్మ అని విశాల్ అంటాడు.

Trinayani Today Episode March 15 2024 Episode 1189 highlights
Trinayani Today Episode March 15 2024 Episode 1189 highlights

అక్కయ్ త్వరగా చెప్పు ఎవరి పేరు మీద రాస్తావు అని పావనమూర్తి అంటాడు. విశాల్ నైని దత్తత తీసుకున్న శంకర శాస్త్రి గారి మనవరాలు గాయత్రి పేరు మీద రాయాలనుకుంటున్నాను అని లలితా దేవి అంటుంది. ఆ మాట వినగానే అందరూ షాక్ అయిపోతారు. అమ్మ గాయత్రి పేరు మీద ఎందుకు రాయాలనుకుంటున్నావు అని విశాల్ అంటాడు. పెద్ద అత్తయ్య తన ఆస్తి గాయత్రి అత్తయ్య ఆస్తి గాయత్రి పాప పేరు మీద రాయాలనుకుంటుందంట అని హాసిని తిలోత్తమకి చెబుతుంది. పెద్దమ్మ గారు గాయత్రి పాప పేరు మీద ఆస్తి రాయాలనుకుంటుంది అని వల్లభకి ఎద్దులయ్య చెబుతాడు. ఇప్పుడు ఆస్తినంతా తన పేరు మీద ఎందుకు రాయాలనుకుంటుంది అని తిలోత్తమ అంటుంది. ఎందుకంటే గాయత్రి పాప పేరుకి దేవి అని చివరిలో పెడితే గాయత్రీ దేవి అవుతుంది అందుకనే మా అక్క చెల్లెల ఆస్తినంతా తన పేరు మీద రాయాలనుకుంటున్నాను అని లలితా దేవి అంటుంది.అలాంటప్పుడు గాయత్రీ దేవి అత్తయ్య తిరిగివస్తే ఆస్తి లేకుండా అనాధ లాగా రోడ్డు మీద వదిలేస్తారా అని సుమన అంటుంది.

Trinayani Today Episode March 15 2024 Episode 1189 highlights
Trinayani Today Episode March 15 2024 Episode 1189 highlights

వందల వేల కోట్ల ఆస్తి ఉన్న గాయత్రీ ని ఎందుకు అనాధని చేస్తాం అప్పుడు ఈ ఆస్తి అంతా తన పేరు మీద రాస్తామని లలితా దేవి అంటుంది.కట్ చేస్తే,విక్రాంత్ గాయత్రి పాపని ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు. నీ బతుకంతా ఇలా సేవలు చేస్తూనే ఉండాలి అని సుమన అంటుంది. ఇప్పుడు నా బతుకు ఏం తక్కువైందని అలా మాట్లాడుతున్నావ్ అని విక్రాంత్ అంటాడు. చెల్లి అర్థమయ్యేలా చెప్పు ఎందుకలా వంకర టింకర్ గా మాట్లాడుతున్నావ్ అని నైని అంటుంది. ఏముంది అక్క ఆస్తి అంత అనాధ పిల్ల అయినా గాయత్రి పాప పేరు మీద రాశారు తను వందల కోట్ల ఆస్తికి వారసురాలు తనకు అందరూ సేవలు చేస్తున్నారు మా ఆయనను కూడా పనివాడు చేస్తున్నారు కదా అని సుమన అంటుంది. చూడు సుమన ఏం కావాలో డైరెక్ట్గా చెప్పు అని విశాల్ అంటాడు. ఏముంది బావగారు పెద్ద అత్తయ్య గారు గాయత్రీ దేవి అత్తయ్య గారు  అక్క చెల్లె ఎలా కలిసి ఉంటున్నారు ఆస్తినంత అనాధ పిల్ల అయినా పాపకి రాసి ఇవ్వాలనుకుంటున్నారు కానీ మేము మాత్రం ఎప్పుడు పోట్లాడుకుంటూనే ఉంటున్నాం నా కూతురు ఏమైపోతుందని మా అక్కకి లేనేలేదు అని సుమన అంటుంది. తిలోత్తమ అత్తయ్య గాయత్రీ అమ్మగారు తోటి కోడల్ని అయిన వాళ్ళ  కలిసి ఉన్నారా మనము తోటి కోడళ్లను అక్కాచెల్లెళ్ళం కాదు ఎప్పటి కలిసి ఉండలేము నువ్వు ఉండవు కూడా అని నైని అంటుంది.

Trinayani Today Episode March 15 2024 Episode 1189 highlights
Trinayani Today Episode March 15 2024 Episode 1189 highlights

సుమన తిలోత్తమ అమ్మ మా అమ్మ అక్క చెల్లెలు ఎలా అనిపిస్తారు కానీ మా అమ్మ బతికున్నప్పుడు ఎప్పుడూ తిలోత్తమ అక్కని పిలువలేదు అని విశాల్ అంటాడు.అందుకే పెద్దమ్మ పోయాక కూడా మా అమ్మ ఇంటికి పెద్ద దిక్కుగా అయింది కానీ ఆస్తి సొంతం చేసుకోలేక పోయింది అని విక్రాంత్ అంటాడు. అలాంటి తిలోత్తమ అత్తయ్యకే ఆస్తి దక్కలేదు ఇక రోజు నిన్ను చూస్తున్నాం అలాంటిది నీకెలా ఆస్తి వస్తుంది చిల్లి గవ్వ కూడా రాసి ఇవద్దని నిర్ణయించుకున్నాం అని నైని అంటుంది. సుమన నువ్వు మీ అక్క తో బాగుంటే ఆస్తి నీకు వచ్చేది కానీ ఇప్పుడు కూడా ఒక అవకాశం ఉంది ఇప్పుడు విక్రాంత్ తో నువ్వు బాగు ఉండి మళ్ళీ బిడ్డని కంటే ఆస్తి పొందే అవకాశం ఉంది అని విశాల్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N