NewsOrbit
సినిమా

వి.వి.వినాయక్ ఆవిష్కరించిన ‘యమ్6’ ట్రైలర్

వి.వి.వినాయక్ ఆవిష్కరించిన ‘యమ్6’ ట్రైలర్
విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ బ్యానర్స్‌పై విశ్వనాధ్ తన్నీరు  నిర్మిస్తున్న చిత్రం ‘యమ్6’.  ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఆవిష్కరించి చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో హీరో ధ్రువ, నిర్మాత విశ్వనాథ్ తన్నీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత విశ్వనాథ్ తన్నీరు మాట్లాడుతూ ‘‘వినాయక్‌గారి చేతులమీదుగా మా ‘యమ్6’ ట్రైలర్ విడుదల కావడం మాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఈ సందర్భంగా ఆయనకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఎంతో క్వాలిటీగా నిర్మించాం.  దర్శకుడు జైరాం చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. మా హీరో ధ్రువ కొత్తవాడైనప్పటికీ చక్కటి నటనను ప్రదర్శించాడు. ఈ చిత్రంలో ధ్రువ సరసన మిస్ బెంగళూరు అశ్విని హీరోయిన్‌గా నటించింది. ఆమెకు ఇదే తొలి సినిమా. మంచి కంటెంట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, సంగీతం, సస్పెన్స్, కామెడీ, యాక్షన్ సన్నివేశాలు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. ప్రేక్షకులు సినిమాలోని ప్రతి సీన్‌ని ఎంతో ఎంజాయ్ చేస్తూ చూస్తారు. ఎక్కడా బోర్ ఫీల్ అవకుండా ఉత్కంఠను కలిగించేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ‘యమ్6’ అనే డిఫరెంట్ టైటిల్‌ని ఈ సినిమాకు ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రానికే హైలైట్‌గా నిలిచే ‘ఈ క్షణం…’ అనే మెలోడీ సాంగ్‌ను మంగళూరు, అరకులోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించడం జరిగింది. ఈ పాటకు చాలా మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
హీరో ధ్రువ మాట్లాడుతూ  ‘‘హీరోగా ఇది నా తొలి చిత్రం. అందర్నీ అలరించే విభిన్నమైన పాత్రలు పోషించి ఇండస్ట్రీలో నటుడిగా నాకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలన్నది నా చిరకాల కోరిక. నిర్మాత విశ్వనాథ్ తన్నీరు, దర్శకుడు జైరామ్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఎక్కడా ఇబ్బంది పడకుండా నటించగలిగాను. ఈ సినిమాలో అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక మంచి సినిమా ద్వారా నేను హీరోగా పరిచయమవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నా మొదటి సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్‌గారు ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా సినిమాను, నన్ను ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా ధన్యవాదాలు’’ అన్నారు.
ధ్రువ, శ్రావణి, అశ్విని, తిలక్, సాధన, అప్పలరాజు, హరిత, వంశీ, ఇంద్రతేజ నటించిన ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజీ,  సినిమాటోగ్రఫీ: మహ్మద్ రియాజ్, కో- ప్రొడ్యూసర్: సురేష్,  నిర్మాత: విశ్వనాథ్ తన్నీరు, కధ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:  జైరామ్ వర్మ

Related posts

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Leave a Comment