NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

MP Kesineni: దేవినేని ఉమాకు మద్దతుగా ఎంపి కేశినేని..! కొండపల్లి మున్సిపాలిటీలో కీలకంగా మారిన కేశినేని ఓటు..!!

MP Kesineni:  ఒకే పార్టీలో ఉన్నా టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ ఎంపి కేశినేని నాని మధ్య విబేధాలు ఉన్నాయన్నది అందరికీ తెలిసిందే. కానీ రాజకీయాల్లో ఒక్కో సారి విబేధాలను పక్కన పెట్టి పార్టీ కోసం సహకరించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఇప్పుడు కేశినేని అవసరం ఉమాకు పడింది. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి మున్సిపాలిటీ ఫలితం రెండు ప్రధాన పార్టీలకు ఓ సవాల్ గా నిలిచింది. వైసీపీ, టీడీపీకి సమానంగా వార్డులు వచ్చాయి. ఈ మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉండగా, 14 వార్డులు వైసీపీ, 14 వార్డులు టీడీపీ గెలుచుకుంటే ఓ స్వతంత్ర అభ్యర్ధిని విజయం సాధించారు. ఎన్నికల ఫలితం అధికారికంగా వెల్లడి కాకముందే స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన శ్రీలక్ష్మి కుటుంబంతో దేవినేని ఉమా చర్చలు జరిపి వారిని టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి పార్టీ కండువా కప్పించారు. దీంతో టీడీపీ బలం 15కు చేరింది.

MP Kesineni nani key role in kondapalli municipality
MP Kesineni nani key role in kondapalli municipality

MP Kesineni: కొండపల్లిలో ఎంపీ కేశినేని ఓటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎక్స్ అఫిషియో ఓటుతో మళ్లీ సమాన స్థాయి ఏర్పడుతోంది. అయితే టీడీపీ విజయవాడ ఎంపి కేశినేని నాని ఈ మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మున్సిపల్ కమిషనర్ కు లేఖ రాసినా కమిషనర్ నుండి స్పందన లేకపోవడంతో కేశినేని హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపి కేశినేని నాని ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితాలను ప్రకటించవద్దని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే మంగళవారంకు వాయిదా వేసింది.

వైసీపీ, టీడీపీ క్యాంపుల్లో అభ్యర్ధులు

ఈ నెల 22వ తేదీన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్న నేపథ్యంలో వైసీపీ, టీడీపీ క్యాంప్ రాజకీయాలు ప్రారంభం అయ్యాయి. గెలిచిన కార్పోరేటర్ లను ప్రత్యర్ధులు ప్రలోభాలకు గురి చేసి తమ వైపుకు తిప్పుకునే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇరు పార్టీలు తమ తమ అభ్యర్ధులను రహస్య ప్రదేశాలకు తరలించి క్యాంపు నిర్వహిస్తున్నాయి. కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇక్కడి రాజకీయ పరిస్థితి ఉత్కంఠను రేపుతోంది.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!