ఇప్పటి వరకు జగన్ మగాడు అనుకున్నా.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఎంపీ రఘురామకృష్ణ రాజు

mp raghu rama krishnam raju fires on ap cm ys jagan
Share

నాకు తెలిసినంత వరకు జగన్ మోహన్ రెడ్డి.. ఎంతో ధైర్యవంతుడు. ఆయన మగాడు.. మొనగాడు అనుకున్నా.. కానీ.. ఆయన ఈ రకంగా తన స్థాయిని తగ్గించుకుంటారని ఎప్పుడూ అనుకోలేదు.. అంటూ ఎంపీ రఘురామకృష్ణ రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు.

mp raghu rama krishnam raju fires on ap cm ys jagan
mp raghu rama krishnam raju fires on ap cm ys jagan

పార్లమెంట్ బయట రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎంపీ.. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఇప్పటి వరకు జగన్ మగాడు అనుకున్నా.. కానీ.. ఆయన తన స్థాయిని తానే తగ్గించేసుకున్నారు.. అంటూ వ్యాఖ్యానించారు. ప్రజాకంటకంగా ఉన్నప్పుడు.. ప్రజలు, ప్రజాప్రతినిధులు అడ్డుపడే పరిస్థితి ఏర్పడుతుంది. అమరావతిపై ఒకటికి రెండు సార్లు పునరాలోచించుకోండి. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోండి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను మరోసారి సమీక్షించుకోండి.. ఎవరికీ అన్యాయం చేయొద్దు.. ఎవరికీ ఇబ్బందులు కలిగించవద్దు.. అందరికీ న్యాయం చేయాలి.. అదే ప్రభుత్వ సిద్ధాంతం కావాలి.. అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

నాపై ఇష్టమున్నట్టుగా కేసులు పెడుతున్నారు. నన్ను చంపేస్తా అన్నారు.. ఇప్పుడు నన్ను చంపేస్తా అని చెప్పిన వ్యక్తితోనే కేసులు పెట్టించారు. జగన్ ఎంతో ఉన్నతంగా ఉండాలని నేను అనుకున్నా. కానీ.. ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకుంటున్నారు. ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదన్నారు.నా స్థాయి మాత్రం పెరుగుతుంది. రోజురోజుకూ పెరుగుతోంది. మీ స్థాయి తగ్గడమే బాధగా ఉంది.. ఏది ఏమైనా ప్రజల దృష్టిలో మీరు ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి.. అని కోరుకుంటున్నా.. అని ఎంపీ స్పష్టం చేశారు.


Share

Related posts

లాక్ డౌన్ పై తిరగబడ్డ కూలీలు

Siva Prasad

సుమ‌తో గొడవ.. నిజంగా అనుకోలేదంటూ క్లారిటీ ఇచ్చిన రాజీవ్ క‌న‌కాల‌!

Teja

వేరుశెనుగా తీస్తుంటే వజ్రం దొరికింది.. చివరికి ఏమైందంటే?

Teja