NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

కొండపోచమ్మ కథలు : రేవంత్ రెడ్డి సాలిడ్ గా దిగుతున్నాడు – కే‌సి‌ఆర్ కి తప్పని కష్టాలు ?

mp-revanth-reddy-another-tweet-on-kondapochamma-sagar-reservior-corruption

రేవంత్ రెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్. తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఒక్క మాటైనా గట్టిగా వినిపించగలిగే వ్యక్తుల్లో రేవంత్ ఒకరు. మల్కాజ్ గిరి ఎంపీ. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు ఎమ్మెల్యేగా ఓడించినా.. ఎంపీగా గెలిచి తన సత్తాను చాటారు.

mp-revanth-reddy-another-tweet-on-kondapochamma-sagar-reservior-corruption
mp revanth reddy another tweet on kondapochamma sagar reservior corruption

తెలంగాణలో అవినీతి జరుగుతున్నదా? లేదా? అనేది పక్కన పెడదాం. కానీ.. ఎంపీ రేవంత్ రెడ్డి మాత్రం సీఎం కేసీఆర్ చేసే అన్ని పనుల్లో వేలు పెడుతుంటారు. ఏ ప్రాజెక్టు నిర్మించినా.. దాంట్లో ఆ అవినీతి.. దీంట్లో ఈ అవినీతి అంటూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు.

ప్రస్తుతం కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుపై పడ్డారు. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కొండపోచమ్మసాగర్ అవినీతిపై ఆధారాలతో సహా రేవంత్ రెడ్డి నిరూపించారు. కొండపోచమ్మ సాగర్ లో ఎంత అవినీతి జరిగిందో? ఎలా అవినీతి జరిగిందో? ఫోటోలతో సహా రేవంత్ ట్వీట్ చేశారు.

సీఎం కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించిన కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో అవినీతికి అంతే లేదన్నారు. నాసిరకం పనులు చేయడం వల్ల నీటి కట్టలు తెగి పడి.. పక్కన ఉన్న గ్రామాలను నీరు ముంచెత్తిందని.. రిజర్వాయర్ గేట్ల వరకు వెళ్లే వంతెన కూడా కుప్పకూలిపోయిందంటూ ట్వీట్ చేశారు.

ఏపీ మంత్రి కంపెనీ నిర్వాకాన్ని పోలీస్ పహారాతో కప్పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ… రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో మండిపడ్డారు.

కొండపోచమ్మ కథలు పేరుతో ఆయన రోజూ ఏదో ఒక ట్వీట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఇదే…

కొండపోచమ్మ కధలు.. కేసీఆర్ స్వహస్తాలతో ప్రారంభించిన కొండపోచమ్మ సాగర్ లో అవినీతి ఆనవాళ్లు అనంతం. నిన్న కట్టలు తెగి నీళ్లు ఊళ్లమీదకు పారితే.. తాజాగా రిజర్వాయర్ గేట్ల వద్దకు వెళ్లే వంతెన కుప్పకూలింది. ఏపీ మంత్రి కంపెనీ నిర్వాకాన్ని పోలీసు పహారాతో కప్పెట్టే కుయత్నం. సిగ్గు.. సిగ్గు.. అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకా.. రేవంత్ రెడ్డి ఆధారాలతో సహా.. ప్రాజెక్టుల అవినీతిని బయటకు తీస్తున్నారని.. దీనిపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

 

author avatar
Varun G

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?