హైదరాబాద్: చంచల్‌గూడ జైలులో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్న టివి 9 మాజీ సిఇఒ రవి ప్రకాష్‌తో కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంలో రవి ప్రకాష్‌ను రేవంత్ పరామర్శించి పలు విషయాలపై చర్చించారు.
టివి 9 సిఇఒగా ఉన్న సమయంలో రవిప్రకాష్ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డాడని ఆ ఛానల్ ప్రస్తుత యాజమాన్యం చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
చంచల్‌గూడ జైలులో ఉన్న రవిప్రకాష్‌ను పలువురు రాజకీయ నేతలు కలిసి పరామర్శిస్తున్నారు.