NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

MP RRR Case: రఘురామ కేసులో మరో ట్విస్ట్..! సీఐడీ అడిషినల్ డీజీకి లీగల్ నోటీసు..! ఎందుకంటే..?

RaghuramaKrishnamraju case: Shock to TV 9

MP RRR Case: వైసీబీ రెబల్ ఎంపి రఘురామకృష్ణం రాజుపై ఏపి సీఐడీ రాజద్రోహంతో సహా పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేయడం, ఆయన సుప్రీం కోర్టు ద్వారా బెయిల్ పొందటం తెలిసిన విషయమే. ఈ కేసులో మొదటి నుండి అనేక ట్విస్ట్ ‌లు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా సీఐడీ అడిషినల్ డీజీకి రఘురామ కృష్ణంరాజు లీగల్ నోటీసు పంపించారు. తన అరెస్టు సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఐ ఫోన్ ను తిరిగి ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.

MP RRR Case legal notice to ap cid
MP RRR Case legal notice to ap cid

స్వాధీనం చేసుకున్న ఐ ఫోన్ ను రికార్డులో ఎక్కడా చూపలేదనీ, కోర్టుకు స్వాధీనం చేయలేదని తన ఫోన్ లో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అంతే కాకుండా స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా తనకు సంబంధించిన చాలా విలువైన సమాచారం ఫోన్ లోనే ఉందని, పార్లమెంట్ విధులను నిర్వర్తించడానికి ఫోన్ తిరిగి ఇవ్వాలని నోటీసులో కోరారు. ఫోన్ తిరిగి ఇవ్వకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.

Read More: CPI Narayana: రాజద్రోహం చట్టంపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

మొదటి నుండి రఘురామ కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటుచేసుకున్నాయి. గుంటూరు ఆసుపత్రికి తరలించమని మెజిస్ట్రేట్ ఆదేశిస్తే గుంటూరు జైలుకు తరలించడం, ఆ తరువాత మెజిస్ట్రేట్ ఉత్తర్వులు రద్దు చేయాలంటూ హైకోర్టును సీఐడీ ఆశ్రయించడం, హైకోర్టు కోర్టు దిక్కార నోటీసు జారీ చేయడం, సుప్రీం కోర్టు ఆదేశాలతో రఘురామను సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించడం, సుప్రీం కోర్టు కండిషన్ బెయిల్ తో  ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి నేరుగా ప్రత్యేక విమానంలో రఘురామ ఢిల్లీకి వెళ్లడం, ఎయిమ్స్ లో పరీక్షలు చేయించుకోవడం ఇలా అనేక పరిణామాలు జరిగాయి.

ఇప్పుడు తాజాగా రఘురామ సెల్ ఫోన్ పంచాయతీ వెలుగులోకి వచ్చింది. అసలు సీఐడీ అధికారులు రఘురామ ఐ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై సీఐడీ అధికారులు ఏమి సమాధానం ఇస్తారో వేచి చూడాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!