శివుడి వేషధారణలో ఎంపీ శివప్రసాద్

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం ఎంపీలు ఈ రోజు కూడా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద తమ నిరసన కొనసాగించారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చినప్పటి నుంచీ పార్లమెంటు సమావేశాల సందర్భంగా తెలుగుదేశం ఎంపీలు నిరసన, ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

తెలుగుదేశం ఎంపీల ఆందోళనలలో ఎంపీ నరమల్లి శివప్రసాద్ ఆహార్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ రోజు ఆయన మహాశివుడి వేషధారణలో తన నిరసన వ్యక్తం చేశారు. శివుడి వేషధారణలో ఆయన మోడీ ఏపీకి చేసిన వాగ్దానాలు, వాటిని పట్టించుకోకుండా అన్యాయం చేసిన తీరు గురించి విమర్శలు గుప్పించారు.