Mp: ‘ఎంపీ’లో టెన్షన్ మొదలైందా..? స్పీకర్ ని కలిసింది అందుకేనా..?

mp tension over cm jagan delhi tour
Share

Mp Raghuramakrishna Raju: ఎంపీ రఘురామకృష్ణ రాజు Mp Raghuramakrishna Raju లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తనపై అనర్హత వేటు వేయొద్దని కోరారు. దీని వెనుక ఓ కారణం ఉంది. ఇటివల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. సీఎం జగన్ పర్యటన అనంతరం ఎంపీ మార్గాని భరత్ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రఘురామపై అనర్హత వేటు వేయాలని లిఖితపూర్వకంగా కోరారు. దీనిపై రఘురామ స్పందిస్తూ ఇప్పటికి 4-5 సార్లు లేఖ ఇచ్చారు. నాపై వేటు వేయడం అంత ఈజీ కాదనే స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. కానీ.. స్పీకర్ ను కలిసి లేఖను పరిగణలోకి తీసుకోవద్దని కోరారు. అంటే.. ఆయనలో ఏమూలో జంకు ఉండబట్టే స్పీకర్ ను కలిశారని చెప్పాలి.

mp tension over cm jagan delhi tour
mp tension over cm jagan delhi tour

ఢిల్లీలోనే మకాం వేసుకున్న రఘరామకు అక్కడే ఉండే పెద్దలను కలవడం ఎంపీగా చాలా తేలిక. ఈ ధైర్యంతోనే భరత్ ఇచ్చిన లేఖను తేలిగ్గానే తీసిపారేశారు. పైగా.. కేంద్ర మంత్రులతో సీఎం జగన్ భేటీలో రాష్ట్ర సమస్యలతోపాటు తన అంశంపై కూడా హోంమంత్రి అమిత్ షాతో చర్చించి ఉంటారని ఆయనకు ప్రత్యేకంగా తెలియాల్సిన అవసరం లేదు. అందుకే ఆ లేఖపై అలా స్పందించారు. తోటి ఎంపీలను, కేంద్ర మంత్రులను కలుస్తూ ఏపీ సీఎంపై, రాష్ట్ర ప్రభుత్వ తీరు, సీఐడీ తీరుపై కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నారు. ఎంపీగా నియోజకవర్గానికి ఏం చేశారనే ఆలోచన కేంత్ర ప్రభుత్వ పెద్దలకు ఒకరు చెప్పాల్సిన పని లేదు. నియోజకవర్గంలో భద్రత లేదనే వై కేటగిరీ భద్రత తెచ్చుకున్నారు కానీ.. ఢిల్లీలో ఉంటున్నందుకు కాదు.

Read More: Telangana Congress: టీపీసీసీ చీఫ్ ఎంపిక..! అధిష్టానం ఆలోచిస్తోందా.. భయపడుతోందా..?

అంత భద్రత ఉన్నా నర్సాపురంలో అడుగుపెట్టింది లేదు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే స్పీకర్ ఆయనపై చర్య తీసుకుంటారో లేదో ఆయనకూ తెలుసు. నిజంగా.. తనపై అనర్హత వేటు వేయలేరంటే స్పీకర్ ను కలవాల్సిన అవసరం లేదు. కాబట్టి.. కొంత అభద్రతలోనే ఉన్నారనే చెప్పాలి. ఏదేమైనా.. రఘురామ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరే. సీఎం జగన్ పై సీబీఐ కేసుల విచారణ ఆయనకు అవసరం లేనివి. అయినా పిటిషన్ వేశారంటే వ్యక్తిగతంగా వెళ్తున్నట్టే. మరి.. ఓట్లేసిన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి చూడకుండా కేవలం తనను తాను కాపాడుకుంటూ.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే స్పీకర్ చూస్తూ ఉరుకుంటారా..? ఏమో చూద్దాం..!

 


Share

Related posts

రవి పరువు గంగలో కలిపేసిన బాబా భాస్కర్…! లాస్య ముందు అంత పర్ఫార్మెన్స్ ఎందుకు అనేశాడు….

arun kanna

Gangubai Kathiawadi : గంగూభాయ్ కతియావాడి టీజర్ లో అలియాభట్ డైలాగ్స్ తో దుమ్ముదులిపేసింది..!!

bharani jella

నిశ్శబ్ధం కంటే నాని వి సినిమానే వెయ్యిరెట్లు బెటర్ .. కారణం ఇదే ..!

GRK