YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. సీబీఐ సిట్ వేగంగా దర్యాప్తు చేస్తొంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపి అవినాష్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ కు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే అవినాష్ పలు పర్యాయాలు సీబీఐ విచారణను ఎదుర్కొన్నారు. ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని ఈ కేసులో సీబీఐ అరెస్టు చేసింది. అదే మాదిరిగా అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి ని కూడా సీబీఐ అధికారులు అంతకు ముందే అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరు ఇద్దరు చంచల్ గూడ జైలులో ఉన్నారు. కాగా ఇంతకు ముందు కూడా తనకు ఈ కేసుతో ఎటువంటి ప్రమేయం లేదని, సీబీఐ దర్యాప్తు తీరు సరిగాలేదంటూ ఆరోపణలు చేసిన అవినాష్ రెడ్డి తాజాగా ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆ రోజు (వివేకా హత్య జరిగిన రోజు) ఏమి జరిగిందో వాస్తవాలు ప్రజలకు తెలియాలి అంటూ తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు.

వివేకా చనిపోయిన విషయం తనకు శివప్రకాశ్ రెడ్డి పోన్ చేసి చెప్పారన్నారు ఉదయం 6.30 గంటల ప్రాంతంలో శివప్రసాద్ తనకు ఫోన్ చేశారనీ, అప్పటికే తాను జమ్మలమడుగు బయలుదేరానని వివరించారు. జీకే కొండారెడ్డి అనే అతనిని వైసీపీలో చేర్చుకునే కార్యక్రమం కోసం ఆ రోజు ఉదయమే జమ్మలమడుగు బయలు దేరానని, బ్రేక్ పాస్ కూడ అక్కడే ఎర్పాటు చేశారన్నారు. తాను పులివెందుల రింగ్ రోడ్డు దగ్గరలో ఉండగా శివప్రకాశ్ రెడ్డి నుండి పోన్ వచ్చిందని, వెంటనే వివేకా ఇంటికి వెళ్లాలని చెప్పడంతో ఎందుకు, ఏం జరిగిందని అడిగితే వివేకా ఇకలేరని చెప్పడంతో హుటాహుటిన ఇంటికి వెళ్లానన్నారు. అప్పటికే అక్కడ వివేకా పీఏ కృష్ణారెడ్డి ఉన్నారనీ, బాత్ రూమ్ లో ఉన్న డెడ్ బాడీని చూపించారన్నారు. అనుమానాస్పదంగా ఏమైనా కనిపించాయా అని అడిగితే లేదని చెప్పాడన్నారు. తాను అక్కడకి వెళ్లకముందే అక్కడున్న లెటర్, మొబైల్ ఫోన్ మాయమయ్యాయన్నారు. వీటి గురించి పీఏ కృష్ణారెడ్డి వివేకా కూతురు, అల్లుడికి సమాచారం ఇచ్చారని, వివేకా అల్లుడు ఆ రెండింటినీ దాచేయాలని కృష్ణారెడ్డికి సూచించారన్నారు.
వివేకా రాసిన లెటర్ లో డ్యూటీకి తొందరగా రమ్మన్నానని నా డ్రైవర్ నన్ను చచ్చేలా కొట్టాడు, ఈ లెటర్ రాయడానికి నేను చాలా కష్టపడ్డాను, డ్రైవర్ ప్రసాద్ ను వదిలిపెట్టవద్దు అని ఉందని అన్నారు. ఆ లెటర్ గురించి వివేకా కూతురు పోలీసులు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఈ కేసులో ఎంతో కీలకమైన ఈ లెటర్ ను సీబీఐ ఎందుకు డౌన్ ప్లే చేస్తొంది, సీబీఐ అధికారి రాంసింగ్ ఎవరిని కాపాడాలని చూస్తున్నారని ప్రశ్నించారు. సీబీఐ విచారణలోనూ సూనీత రెండు వేర్వేరు స్టేట్ మెంట్లు ఇచ్చిందనీ, మొదటి స్టేట్ మెంట్ తప్పలను కవర్ చేసుకుంటూ రెండో స్టేట్ మెంట్ ఇచ్చిందన్నారు. వివేకా హత్య కేసు చుట్టూ ఎన్నో రాజకీయాలు నడుస్తున్నాయని విమర్శించారు చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడవద్దనే ఎన్ని విమర్శలు వచ్చినా మౌనంగా ఉన్నానని స్పష్టం చేశారు అవినాష్ రెడ్డి.
TDP: నందమూరి సుహానికి పార్టీలో కీలక పదవి.. ఆ పుకార్లకు చెక