అసలే కరోనా కాలం. మాస్క్ పెట్టుకుంటేనే బయట అడుగు పెట్టాల్సిన పరిస్థితి. కానీ.. మాస్క్ ను కూడా నమ్మే పరిస్థితులు లేవు ఈరోజుల్లో. మాస్క్ పెట్టుకున్నా కరోనాను అడ్డుకోలేకపోతున్నాం.
ఎన్ 95 మాస్కులు కూడా కరోనాను నిరోధించలేకపోతున్నాయి. కాకపోతే.. గుడ్డి కన్నా మెల్ల నయం అన్న చందంగా కరోనాను ఎంతో కొంత వ్యాప్తి చెందకుండా ఆపడానికి మాస్కులు కాస్తో కూస్తో పనిచేస్తున్నాయి.
ఇప్పటికే కొందరు రకరకాల మాస్కులను విడుదల చేశారు. ఇంకొదరైతే ఏకంగా గోల్డ్ మాస్కులను తయారు చేసుకున్నారు.
తాజాగా కాపర్ మాస్కులు కూడా మార్కెట్ లోకి వచ్చేశాయి. డాక్టర్ కాపర్ వాటర్ బాటిల్ తెలుసు కదా. ఆ కంపెనీకే చెందిన కాపర్ ఫిల్టర్డ్ ఎన్ 95 రీయూజబుల్ మాస్క్ ను లాంచ్ చేశారు.
మొత్తం ఐదు లేయర్లతో ఈ మాస్క్ ను రూపొందించారు. ఎయిర్ మెష్ క్లాత్, మాయిశ్చర్ కంట్రోల్, కాపర్ క్లాత్ ఫిల్టర్, యాంటీ బాక్టీరియల్ ఫినష్, ఎన్ 95 ఫిల్టర్ తో ఈ మాస్క్ ను తయారు చేశారు.
సాధారణంగా ఎక్కువ మంది వాడే ఎన్ 95 మాస్క్ కన్నా ఇది 90 శాతం మెరుగ్గా పని చేస్తుందని డాక్టర్ కాపర్ బాటిల్ కంపెనీ ఎంఎస్ఆర్ సీఈవో తెలిపారు.
ప్రస్తుతం ఈ మాస్క్ మార్కెట్ లోకి వచ్చింది. దీని ధర కూడా అంత ఎక్కువేం కాదు.. 199 రూపాయలే. ఈ మాస్క్ ను కనీసం 35 సార్లు క్లీన్ చేసుకొని వాడుకోవచ్చు.